S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గొప్పగా...

మన జీవితాన్ని గొప్పగా ఊహించుకోవాలి. జీవితంలోని అన్ని అంశాల గురించి గొప్పగానే ఊహించుకోవాలి.
మన వృత్తిలో
మన వ్యాపారంలో మనం అత్యున్నత శిఖరం వైపు ప్రయాణం చేసే విధంగా మనం కృషి చేయాలి.
ఇతరులతో మన సంబంధాలు గొప్పగా వుండాలని ఆశించాలి.
మన ఆరోగ్యం
మన ఆర్థిక స్థితిగతులు
మన వ్యవహారాలు
అన్నీ గొప్పగా వుండాలని ఆశించాలి.
గొప్పగా వుండాలని ఆశించడంలో తప్పు లేదు. అది దురాశ కూడా కాదు.
అది ఒక మంచి అంశం.
ఆశించడంతోనే అవి సమకూరవు.
వాటికి ఎంతో శ్రమ, నేర్పూ, ఓర్పూ వుండాలి.
మన ప్రయత్నాలు సిన్సియర్‌గా ఉండాలి. హృదయపూర్వకంగా ఉండాలి. శ్రద్ధతో ఉండాలి.
నెగెటివ్ భావాలతో వుండే వ్యక్తులకి దూరంగా ఉండాలి. ఆశాభావంగా ఉండే వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయాలి.
ఉబుసుపోక కబుర్లకి
గాలి ముచ్చట్లకి దూరం ఉండాలి.
మనం ఏది ఆశిస్తున్నామో
ఏమి కోరుకుంటున్నామో వాటి నుంచి మన దృష్టి మరల్చకూడదు.
గొప్ప విషయాలు కావాలని అనుకునేటప్పుడు
మన ప్రయత్నం కూడా గొప్పగానే వుండాలి.
అన్నింటికీ ముఖ్యం-
క్రమశిక్షణ
ఆ విషయం పట్ల కోరిక
సాధించాలన్న పట్టుదల.

మంగారి రాజేందర్ ‘జింబో’