S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గొలుసు

స్కూల్ నించి తిరిగి వచ్చిన శృత తల్లిని కోరింది.
‘అమ్మా! నా ఫ్రెండ్ చంపక్ ఒక్కడే బస్‌లో జూ పార్క్‌కి వెళ్లి వస్తాట్ట. నన్ను కూడా రమ్మన్నాడు. రేపు ఆదివారం వెళ్లనా?’
‘వద్దు. ఒంటరిగా చిన్న పిల్లలు అంత దూరం వెళ్లకూడదు. చంపక్ వెళ్లడం కూడా మంచిది కాదు’ శృత తల్లి నిరాకరించింది.
‘నువ్వెప్పుడూ ఇంతే. నాకు స్వేచ్ఛని ఇవ్వవు’ శృత చిన్నబుచ్చుకుని చెప్పింది.
అరగంట తర్వాత శృత తల్లితో డాబా మీదకి వెళ్లింది. పిట్ట గోడ మీంచి పక్కింట్లోకి చూసి చెప్పింది.
‘అరె! పక్కింటి టామీని కొత్తగా చెయిన్‌తో కట్టేశారే?’
‘అవును. టామీకి అది నచ్చక చాలాసేపు మొరిగింది’
‘పక్కింటి వాళ్లు ఎందుకంత హీనంగా ప్రవర్తిస్తున్నారు’
‘హీనంగా కాదు. ప్రేమతో’ తల్లి సరిదిద్దింది.
‘ప్రేమతోనా? కట్టెయ్యడం ప్రేమ ఎందుకు అవుతుంది?’
‘ఇందాక నీ కోసం ఇంటి బయట నేను వేచి ఉన్నపుడు టామీ ఇంట్లోంచి బయటికి పరుగెత్తి ఓ కారు కింద పడబోయింది. పక్కింటి వాళ్లు అది చూసి తమ ఇంటి గేటు తెరుచుకోకుండా రిపేర్ చేసేదాకా దాన్ని కట్టేసి ఉంచుతామని, అది టామీ క్షేమం కోసం అని చెప్పారు’
‘ఐతే కట్టేయడం మంచిదే’
‘నేను కూడా నీ మీద ప్రేమతోనే నీకు స్వేచ్ఛని ఇవ్వడం లేదు. కుటుంబాల్లో కొన్నిసార్లు ప్రేమ వల్లే స్వతంత్రాన్ని ఇవ్వకుండా కట్టేస్తూంటారు’
‘అర్థమైంది. నన్ను చంపక్‌తో జూకి పంపకపోవడానికి కారణం అదే అన్న మాట’
‘అవును. తల్లిదండ్రుల చర్యలు కఠినంగా తోచినా వాటి వెనుక తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది’
‘నా స్వతంత్రాన్ని కట్టేయడం నాకు నచ్చకపోయినా అది ప్రేమవల్ల కాబట్టి ఇప్పుడు నాకు కోపం పోయింది’ శృత చెప్పింది.

ఏక్సెప్ట్ డిసిప్లిన్

మల్లాది వెంకట కృష్ణమూర్తి