S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నానీలు

గోడపై కాలాన్ని మోస్తూ
క్యాలెండర్
కాలాన్ని మేస్తూ
గడియారం

* కనె్నతల్లి
కన్నతల్లయింది
చంటి బిడ్డ చేరింది
చెత్తకుండీ ఒడికి

* మూన్నాళ్లుగా వాన
మునకలేసింది
ఊరంతా
అభ్యంగన స్నానం

* ఆత్మాభిమానం ఓడి
ఆకలి గెలిచింది...
ఎంగిలిస్తర్లలో
ఎన్ని రుచులో...!!

* అతను పాడెక్కి
పయనమయ్యాడు
పంచిన మంచితనం
ఏడుస్తోంది.

* నారు పోశాడు
చెట్టునయ్యాను
నీరు మరిచాడు
నీరుగారాను.

* కరెంటొచ్చింది
ఫ్యాను తిరిగింది
టేబుల్ మీది కాగితాలకు
రెక్కలొచ్చాయి.

* జీవితం ఇవ్వలేనిది
మరణమిచ్చింది
ఆమె కోరుకున్నంత
విశ్రాంతిని.

* నీటిబావిలో
చందమామ...
నీలోని కవిత్వం కూడా
అంతే మరి!

* పాత పొత్తం తీసుకున్నా
ఎండిన ఆకుల్లా పేజీలు...
మూసేసి
ఆయుష్షు పెంచా.

* ఆమె అందాన్ని
అద్దం చూపెట్టింది
అంతరంగం
సంగతేమిటి?

* భర్తేమో గుమాస్తా
భార్యేమో ఏ/సి కోరింది
ఆస్తి మూరెడు
ఆశ బారెడు!

* అమృతం కదా!
అమ్మచేతి ముద్ద
అమరత్వం కాదా
అమ్మ ఒడిలో నిద్ర.

-ఆమటింతల.. 6300917759