S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరిపూర్ణత (సండేగీత)

చాలామందిలో సృజనాత్మకత ఉంటుంది.
కొంతమందిలో కథలో రాసే నేర్పు, మరి కొంతమంది కవిత్వం రాసే ఉత్సాహం ఇలా ఎన్నో..
బొమ్మలు కావొచ్చు.
పాటలు పాడటం కావొచ్చు.
ఇట్లా ఎన్నైనా చెప్పవచ్చు.
వారిలో వున్న ఉత్సాహాన్ని చాలా మంది తొక్కివేస్తారు. అణచివేస్తారు.
పిల్లల చదువులు దెబ్బ తింటాయని పెద్దవాళ్లు, పెద్దవాళ్లు అయిన తరువాత వాళ్ల ఉద్యోగ ప్రయత్నాలు దెబ్బ తింటాయని వాళ్లకన్నా పెద్దవాళ్లు నిరుత్సాహపరుస్తారు.
ఇది పర్వాలేదు.
కొంతమేర పెద్దవాళ్లని అర్థం చేసుకోవచ్చు.
యుక్తవయస్సు వచ్చి కొంత జ్ఞానం వచ్చిన తరువాత వీళ్లు కాకుండా వేరే వాళ్లు నిరుత్సాహపరుస్తుంటారు. ఇదీ పర్వాలేదు.
వీళ్లెవరూ కాకుండా ప్రతి వ్యక్తిలో మరో మనిషి వుంటాడు. అతను ఆ వ్యక్తిని నిరుత్సాహ పరుస్తూ ఉంటాడు.
ఏదైనా సృజనాత్మక పని చేసిన తరువాత ఇతరులకి ఆ పనిని చూపించడానికి ప్రయత్నం చేద్దామని అనుకోగానే లోపలి నుంచి గొంతు అతనితో ఇలా చెబుతుంది.
* మీ పనిలో ఇంకా పరిపూర్ణత రాలేదు. అప్పుడే చూపించాల్సిన అవసరం లేదు.
* అది ఇంకా పూర్తి కాలేదు.
* విమర్శలు వస్తాయి. జాగ్రత్త.
* ఇతరులు ఏమైనా అనుకుంటారేమో - ఇలా ఆ గొంతు ఎన్నో చెబుతుంది.
వాటిని మనం త్రోసిపుచ్చాలి. ఆ గొంతు మన హితుడిది కాదు. మరో విధంగా చెప్పాలంటే అది మన శత్రువుది.
అందుకని ఆ గొంతు చెప్పింది పాటించాల్సిన పనిలేదు.
పరిపూర్ణత అనేది తరువాత రావొచ్చు.
పరిపూర్ణత వుండవచ్చు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001