S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓడిపోయిన ప్రతిసారీ...( సండేగీత )

ఈ మధ్య రెండు కొటేషన్స్ చూశాను. అవి బాగా నచ్చాయి. మొదటిది జపాన్ కొటేషన్ - ఏడుసార్లు క్రిందపడినా పర్వాలేదు. ఎనిమిదో సారికి లేచి నిల్చో. రెండవది - కన్ఫూజియస్ చెప్పిన మాట. ‘ఓడిపోయిన ప్రతిసారీ తిరిగి ప్రయత్నం చేయడంలోనే కీర్తి ఉంటుంది.’
ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేస్తాం. అవి రావు. ఏడుసార్లు అలా జరిగినా పర్వాలేదు. ఎనిమిదవ సారి విజయం సాధిస్తాం. ఈ ఏడు, ఎనిమిది అనేవి ఉదాహరణలు మాత్రమే.
ప్రతి పనిలో అపజయం ఉంటుంది. మొదటిసారికే విజయం కొంతమందికే లభిస్తుంది. అది అందరికీ లభించదు.
సర్పంచ్ కాలేని వ్యక్తి ఎమ్మెల్యే అయిన సందర్భాలు ఎన్నో వున్నాయి.
క్లర్క్ కాని వ్యక్తి కలెక్టర్ అయిన సందర్భాలూ ఉన్నాయి.
మేజిస్ట్రేట్ కాలేని వ్యక్తి జిల్లా జడ్జి హైకోర్టు జడ్జి అయిన సందర్భాలు ఉన్నాయి.
ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
ఓడిపోయిన ప్రతిసారీ ప్రయత్నం మళ్లీ చేయాలి. అట్లా చేసినప్పుడు మన పట్ల మనకి గౌరవం ఏర్పడుతుంది.
ఉద్యోగాల విషయంలోనే కాదు అన్ని విషయాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001