S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టీవీ చూస్తూ కూర్చుంటే...

ఫ్రశ్న: టీవీ చూడటం వలన కళ్లు దెబ్బతింటాయి. ఊరికే ఎక్కువసేపు కూచోటం వలన స్థూలకాయం వస్తుంది. ఇవి కాక ఇంకా ఏమైనా అపకారాలు ఉన్నాయా?
-ప్రమీలాదేవి జాగర్లమూడి (గుంటూరు)
జ: టీవీలకు అంటిపెట్టుకొని కూర్చోవటం వలన కేన్సర్ కూడా వస్తుందని ఇటీవలి ఒక పరిశోధన చెప్తోంది. యాభై ఏళ్లకన్నా తక్కువ వయసులో ఉన్నవారు ఎక్కువసేపు టీవీ చూస్తూ గడపటానికీ, Colorectal Cancer రావటానికీ గల సంబంధాన్ని నిరూపించే ఒక పరిశోధనా పత్రం వివరాలను మెడికల్ న్యూస్ టుడే జర్నల్ 2019 ఫిబ్రవరి 6 సంచికలో ప్రచురించింది. అదే పనిగా టీవీ చూస్తూ కూర్చుంటే పెద్ద పేగుల్లో కేన్సర్ వస్తుందని ఈ పరిశోధన నిరూపిస్తోంది.
మధ్యవయస్కులందరికీ ముఖ్యంగా 40-50 మధ్య వయసులో ఉన్నవారికి ఇది హెచ్చరిక! 50కన్నా తక్కువ వయసులో ఉన్నవారికి వచ్చే ఈ కేన్సర్ వ్యాధిని young -onset colorectal cancer అంటారు.
ఇక్కఢ సమస్య టీవీ కాదు. దాని వలన శరీరానికి, మరీ ముఖ్యంగా పేగులకు సోమరితనం ఏర్పడటం గురించి శాస్తవ్రేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇది నడివయసు మహిళలలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. 40 ఏళ్లు దాటిన మహిళలు ఓ 20 ఏళ్లపాటు టీవీ ముందు అదే పనిగా కూర్చోవటాన్ని మానేయాలని అమెరికన్ జర్నల్ ఆఫ్ నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ వారు మొదటగా ప్రపంచ మహిళా లోకాన్ని హెచ్చరించారు. టీవీ సీరియళ్లలో లీనమై పోయి, నరాలు బిగబట్టి టెన్షన్‌లో ఎక్కువసేపు కూర్చునే (prolonged sitting) మహిళలలో మలాశయ కేన్సర్ ఎక్కువగా కనిఫిస్తోందని ఈ జర్నల్ పేర్కొంది. అలా టీవీలకు అంటుకుపోయే అవకాశం మన దేశంలో స్ర్తిలకు ఎక్కువగా ఉంది! కాబట్టి స్ర్తిలకు ఇది ముఖ్యంగా హెచ్చరిక.
నడివయసులో వస్తే ఈ వ్యాధి మరీ ఎక్కువ ప్రమాదకారి అని తెలిపింది. చిన్నవయసులో రావటం వలన రోగి పైన వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించక పోవటంతో బాగా ముదిరిపోయే వరకూ కనుక్కోలేక పోవటం కూడా వ్యాధి ఎక్కువ ప్రమాద స్థితికి కారణం అవుతుంది.
మలాశయ కేన్సర్ (Cancer of the colon and the rectum) అనేది మలాశయం లేదా పెద్ద ప్రేవుల చివరి భాగంలో వచ్చే కేన్సర్ వ్యాధి. ఇది పేగులలో మొదలై మలాశయం దాకానో లేక మలాశయంలో మొదలి పేగుల లోపలికో వ్యాపించవచ్చు.
జీర్ణకోశంలో చివరి భాగాన్ని పెద్ద పేగు (large intestine, large bowel) అంటారు. వీటికి ముంధు భాగంలో ఉండే చిన్న పేగుల్లోంచి పచనం జరుగుతున్న ఆహారం నెమ్మదిగా ఈ పెద్ద పేగుల్లోకి ప్రవేశిస్తుంది. పెద్ద పేగులు అందులోని నీటిని, లవణాలను పీల్చుకుని తక్కిన ఆహారాన్ని మలాశయంలోకి పంపిస్తాయి. అది మలద్వారం ద్వారా మలం రూపంలో బయటకు విసర్జించబడుతుంది.
పెద్ద పేగు మూడు భాగాలుగా ఉంటుంది. సీకం, కోలాన్, రెక్టమ్ అని! వీటిలో సీకం అనేది చిన్న పేగుని పెద్ద పేగునీ కలిపే ఒక కవాటం లాంటిది. సీకమ్ నుండి రెక్టమ్ వరకూ కోలాన్ అని పిలుస్తారు. ఇది దాదాపు 5 అడుగుల పొడవుంటుంది. దీనికి చివర రెక్టం అంటే మలాశయం ఉంటుంది. కోలాన్ + రెక్టమ్‌లలో వచ్చే కేన్సర్ వ్యాధిని కోలో రెక్టల్ కేన్సర్ అంటారు.
పచనం అవుతున్న ఆహారంలోంచి నీటిని, లవణాలను బాక్టీరియా సాయంతో విడగొట్టి ఈ పెద్ద పేగు గ్రహిస్తుంది. తక్కిన ఆహారం అంతా మలం రూపంలో మలాశయాన్ని చేరుతుంది.
కోలాన్ లోపల చిన్నచిన్న మొలకల్లాంటివి (పాలిప్స్) ఏర్పడి మనకు తెలీకుండానే నెమ్మదిగా పెరిగి పెద్దవై చివరికి పెద్ద గడ్డలా తయారౌతాయి. ఈ గడ్డలలో కొన్ని పేగుల గోడల్లోకి చొచ్చుకుపోయి కాలక్రమంలో కేన్సర్ గడ్డలుగా మారవచ్చు. కేన్సర్ రోగుల్లో మూడొంతుల మంది ఈ మలాశయ కేన్సర్‌తోనే బాధపడ్తున్నారని అంచనా!
కూరగాయల్ని తక్కువగా తినేవారికి, తినేది శాకాహారమే అయినా అందులో కూర తక్కువ - మసాలాలు, చింతపండు రరసం గ్రేవీలూ ఎక్కువగా ఉంటే ఈ ‘కోలో రెక్టల్ కేన్సర్’ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. శరీరానికి తగినంత శ్రమ, వ్యాయామం లేకుండా సోమరిగా ఉండే వ్యక్తులకు, ముఖ్యంగా ఇంటికి పరిమితంగా ఉండే గృహిణులు అతిగా టీవీ ముందు కదలకుండా కూర్చొనే వారిలో ఈ కేన్సర్ కనిపిస్తోందంటున్నారు.
శరీర శ్రమ, వ్యాయామాదులు తగినంత ఉన్నవారైనా సరే కదలకుండా ఒకేచోట కూర్చోవటం వలన కోలో రెక్టల్ కేన్సర్ వస్తోంది. అలా కదలకుండా గంటల తరబడీ కూర్చునే అవకాశం టీవీలు చూసేప్పుడే ఉంటుంది. అందుకే ఇంత హెచ్చరిక చేస్తున్నారు. ఎంత ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే అంత ఎక్కువ పరిమాణంలో కేన్సర్ గడ్డ ఉంటోందని కూడా గమనించారు.
శరీరానికి కదలిక చాలినంత లేకపోతే, పేగులు కూడా సోమరిగానే తయారౌతాయి. దాని వలన secondary bile acide లాంటి ఆమ్లాలు పెద్ద ప్రేవులో ఎక్కువసేపు నిలబడిపోయి, అక్కడ కేన్సర్ గడ్డల్లాంటివి రావటానికి కారణం అవుతాయి. ఉత్సాహంగానూ, ఉత్తేజంగానూ తిరిగే వ్యక్తులకు ఈ కోలో రెక్టల్ కేన్సర్ ఈ కారణాల వలన రాకుండా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇంట్లోనే టీవీలకు అంటుకుపోతే అంతఃపుర కాంతల్లాగా, అసూర్యంపస్యల్లాగా ఎండ తగలకుండా జీవించటం వలన డి విటమిన్ తగ్గిపోవటం ఈ వ్యాధికి ఇంకో కారణం.active lifestyle అనేది ముఖ్యంగా కేన్సర్ వ్యాధి నివారణకు ముఖ్యం.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com