S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉత్తర మధ్యభాగంలో టాయిలెట్స్‌ఉండొచ్చా? (వాస్తు)

వర్మ (విజయనగరం)
ప్రశ్న: ఉత్తర మధ్యభాగంలో టాయిలెట్స్ ఉన్నాయి. అలా ఉండవచ్చా?
జ: ఉత్తరం అనేది కుబేర స్థానం కావున అక్కడ టాయిలెట్స్ ఉండరాదు. దీనివల్ల ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. కావున దోష నివారణ చేసుకోండి.
మధు (గుంటూరు)
ప్రశ్న: మా ఇంట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం మా ఇంటి వాస్తు అని చాలామంది అంటున్నారు.
జ: మీ ఇంటికి నైరుతి, ఆగ్నేయ దోషాలు ఉన్నాయి. నైరుతిలో దక్షిణ ముఖంగా వీధిపోటు తగులుతున్నది. అది చెడు ఫలితాలను ఇస్తోంది. అదే విధంగా ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల ఆడవారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముందుగా ఆగ్నేయంలో ఉన్న సెప్టిక్ ట్యాంకును తూర్పు మధ్యభాగంలోకి మార్చుకొని, పాతగుంటను పూడ్చివేయండి. దీనివల్ల సగం దోషం పోతుంది. తర్వాత నైరుతిలో వీధి పోటు నివారణ యంత్రాన్ని ప్రతిష్ఠించుకోండి.
శ్యామలాదేవి (కాకినాడ)
ప్రశ్న: మా ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా తరచూ వాయిదా పడుతున్నాయి. అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాలలో కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
జ: మీ ఇంట్లో వాయవ్య దోషాలు ఉన్నాయి. ప్రహరీగోడ నిర్మాణంలో ఉత్తర వాయవ్యం పెరిగింది. అలాగే వాయవ్యంలో లెట్రిన్‌ను కట్టి దాని కిందనే సెప్టిక్ ట్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు దోషాల వల్లనే తరచూ శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. ముందుగా ప్రహరీ గోడ నిర్మాణంలో పెరిగిన ఉత్తర వాయవ్యాన్ని వేరు చేస్తూ ఉత్తర ఈశాన్యం పెరిగేలాగా ఒక బేస్‌మెంట్ నిర్మాణం చేసి తర్వాత ప్రహరీగోడ నిర్మాణం చేయండి. దీనివల్ల పెరిగిన ఉత్తర వాయవ్య దోషం పోతుంది. తర్వాత వాయవ్యంలో ఉన్న సెప్టిక్ ట్యాంకును పూడ్చివేసి ఉత్తర మధ్యభాగంలోకి తీసుకోండి. దీనివల్ల వాయవ్యంలో గొయ్యి వలన దోషం పోయి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28