S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రేడియో ధార్మికత (శాస్ర్తియ ఆవిష్కరణలు)

కేన్సర్ చికిత్స, కాల నిర్ధారణ పరీక్షలు, శిలలు, అణు, జీవశాస్త్రం, ఆధునిక జన్యు శాస్త్రం వంటి పలు అధ్యాయాలు రేడియో ధార్మికతతోనే ప్రారంభమయ్యాయంటే అతిశయోక్తి కాదు. అణుశక్తి, అణుబాంబులకు కూడా ఇదే ఆధారం. హెన్రీ బెక్యురెల్ 1897లో ఎక్స్ కిరణాలను అధ్యయనం చేస్తూ యురేనియం లవణం ఫొటోగ్రాఫిక్ ప్లేట్‌పైన గుర్తులను ఏర్పరచటం గమనించాడు. ప్రతిభావంతురాలైన శాస్తవ్రేత్త మేరీక్యూరీ ఈ యురేనియన్ నుంచి వెలువడే అద్భుత శక్తిని అధ్యయనం చేయాలని నిర్ణయించుకుంది.
రేడియో ఆక్టివిటీ (రేడియో ధార్మికత) అన్న పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది మేరీ క్యూరీనే. యురేనియమ్ కాకుండా ప్రకృతిలో మరికొన్ని పదార్థాలు కూడా ఇదే విధంగా కిరణాలను వెదజల్లుతున్నట్లు ఆమె గుర్తించింది. తన భర్త పెరీక్యూరీతో కలిసి నిర్వహించిన పరిశోధనల ద్వారా ఆమె రేడియో ధార్మికత అన్నది రసాయన చర్య కాదని, పరమాణువు ప్రదర్శిస్తున్న సహజ లక్షణమని నిరూపించింది. ఆపైన పెరీ రేడియో ధార్మికత లక్షణాలను అధ్యయనం చేస్తుండగా మేరీ ఇతర రేడియో ధార్మిక మూలకాలను గుర్తించి శుద్ధిచేసే పనిలో నిమగ్నమయింది. ఈ ప్రయత్నం వల్ల 1989లో ఆమె పొలోనియం, రేడియంలను కనిపెట్టింది. ఒకరోజు పెరీ తన చర్మంపైన రేడియం ప్రభావాన్ని పరిశీలించేందుకు ప్రయత్నించారు. అది ఆయన శరీరంపై కాలిన గాయాన్ని చేసింది. ఆపైన కొద్ది రోజుల్లోనే రేడియంను కేన్సర్ చికిత్సలో వాడటం ప్రారంభించారు. తరువాత 1903లో మేరీ నోబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఆమె, భర్త పెరీ, హెన్రీ బెక్యురెల్‌లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి ప్రకటించారు.
ఆపైన 1911లో మేరీ రెండోసారి నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. రేడియంను శుద్ధిచేసినందుకు గాను ఆమెకు రసాయన శాస్త్రంలో ఈ బహుమతి ప్రకటించారు. వైద్య శాస్త్రం మొదలుకొని అణు భౌతిక శాస్త్రంలో పరిశోధనల దాకా రేడియో ధార్మికత వల్ల కలిగే అనేక ప్రయోజనాలను గుర్తించినది మేరీ క్యూరీనే. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన దశలో యుద్ధ క్షేత్రంలో గాయపడిన సైనికుల శరీరాల్లో దిగబడి చిక్కుకుపోయిన బుల్లెట్లు, ఇతర ఇనుప ముక్కలను గుర్తించేందుకు వీలుగా ఆమె ఎక్స్‌రే వాహనాలను రూపొందించారు.

-బి.మాన్‌సింగ్ నాయక్