S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను.. కణరహిత, క్షణాతీత చైతన్య గర్భను

నేను...
జీవగంగా భగీరథ తపస్విని.. చైతన్య విస్ఫోటనా విశ్వమిత్రుడిని.. భౌతిక అధిభౌతిక లయకారుడిని.. త్రిగుణ లలాట కాలరేఖను.. కణప్రాయ కాంతిలేఖను.. తామసిక అధో చైతన్యాన్ని.. తాపసిక ఉన్నత చైతన్యాన్ని.. సాంసారిక సరూప చేతనను.. ఐహిక సంగమ చేతనా కెరటాన్ని.. ఆముష్మిక సాంద్రతా కెరట కిరణాన్ని.
అవును, నేను.. భువన క్షణ ఇతిహాసాన్ని.. గగనతల మానవేతిహాసాన్ని.. నిన్నటి సెయింట్‌ను.. నేటి సెయింటిస్ట్‌ను.. కణరహిత, క్షణాతీత చైతన్య గర్భను.
* * *
Higher Mind is Spiritual in nature and is Universal in its perception.
* * *
నేను-
లోయర్ లెవల్‌లో సమకాలీన చైతన్యాన్ని.. హయ్యర్ లెవల్‌లో సర్వవ్యాప్త విశ్వచైతన్యాన్ని.. హ్యూమన్ ఎమోషన్స్‌తో.. సమ్మోహన లోయర్ కాన్షియస్‌నెస్‌ను.. హయ్యర్ ఇంటెలిజెన్స్‌తో.. సంయమన హయ్యర్ కాన్షియస్‌నెస్‌ను.
కొన్ని భావాలు, భావోద్రేకాలు, భావోద్విగ్నతల ‘నేను’ను నిర్వీర్యం చేస్తుంటాయి.. చచ్చుబడేలా చేస్తుంటాయి. అవును, భావోద్రేకాలు మృత్యుస్థితికి అంపశయ్యలే! ప్రతీ భావోద్విగ్నతా మనల్ని మనమే చంపుకునేలా చేస్తుంది.
‘నేను’ కొన్ని ఎమోషన్స్‌తో లోయర్ కాన్షియస్‌నెస్‌కే పరిమితమై పోయి ‘సీరియల్ కిల్లర్’ అవుతుంటుంది. అంటే, ‘సెల్ఫ్ కిల్లర్’ అవుతుంది.
మితిమీరిన సిగ్గరితనం మనల్ని మనమే అసహ్యించుకునేలా చేస్తుంది. మనకు మనమే ద్వేషి అవుతాం కాబట్టి స్థారుూ భావాన్ని దాటని సిగ్గరితనాన్ని లోయర్ కాన్షియస్‌నెస్‌గా పరిగణించాలి.
సిగ్గరితనం కంటే మరో మెట్టు పైనున్నది అపరాధ భావన. మనల్ని మనమే క్షమించుకోలేని భావోద్విగ్నతకు గురిచేసే ఈ ఎమోషన్ లోయర్ కాన్షియస్‌నెస్‌దే!
ఆశ పొటమరించనితనం మనలో పేరుకుపోవటం అధమ స్థాయి చైతన్య వీచికనే! ఇది జీవన నైరాశ్యంగా పరిణమిస్తుంటుంది.
ఎల్లప్పుడూ ఏదో పోగొట్టుకున్నాననే భావన తొలచివేస్తుంటుంది. రోజురోజుకీ ఆశ అడుగిడుతుంటుంది. ఈ నిరాశామయ తత్వంతో జీవితం కునారిల్లుతుంటుంది.. మనం కుదేలవుతుంటాం.
ఏమీ చేయలేక భయం గుప్పిట్లోకి జారుకోవటమూ అధోస్థాయి చైతన్యమే. ఈ భావోద్విగ్నతతోపాటు ఈ సమాజం మనకు రక్షణ కల్పించలేక పోతోందన్న భావన తీవ్రరూపం దాలుస్తుంటుంది.
కోరికలు గుర్రాలవుతుండటమూ అధమ స్థాయి చైతన్యమే. డబ్బు కోసం పరుగు, అధికారం కోసం నానా గడ్డి కరవటం, కీర్తి కోసం వెంపర్లాట - ఇలా భౌతికతలో ఇరుక్కుపోవటం లోయర్ కాన్షియస్‌నెస్ ప్రభంజనం వల్లనే.
ఆశించింది దొరకనపుడు, అనుకున్నది జరగనపుడు కోపం తారాస్థాయికి చేరుతుంటుంది.. ముక్కుమీద కోపం తాండవమాడుతుంటుంది. ఫలితంగా భంగపడి భయంతో స్నేహం చేయటం జరుగుతుంటుంది.
ఇలా భావోద్రేకాలతో తల్లడిల్లుతున్నంత కాలం ‘నేను’ది మృత్యుస్థితే. ఒక విధంగా డెత్ బెడ్‌పైన ఉన్నట్లే. అధమ చైతన్యంతో అధములుగా బ్రతుకుతున్నట్లే.
ఈ ఎమోషన్స్ పరిష్వంగంలో ఉంటూ ఎలాగోలా జీవితం కొనసాగుతోందంటే ఆ జీవితంలో మమేకమవుతున్నామంటే - అది కృత్రిమ గౌరవమే - ఫాల్ట్ ప్రిస్టీజ్‌నే - ప్రతిష్ఠలా ప్రతిబింబించే అప్రతిష్ఠ అది.
అంటే, లోయర్ కాన్షియస్‌నెస్ అనేది ఫిజికల్ ఎమోషన్స్ సమాహారమే! వాటివల్ల సామాజికంగా ఎంతో కొంత గౌరవం దక్కినప్పటికీ వైయక్తికంగా అప్రతిష్ఠకు లోను చేస్తున్నట్లే!
అయితే సెల్ఫ్ రియలైజేషన్‌తో ఈ లోయర్ కాన్షియస్‌నెస్ నుండి బయటపడాలంటే ఫాల్స్ ఫీలింగ్స్‌కి దూరం కావాలి.
* * *
అధో చైతన్య సాంద్రత తగ్గుతుండటం అంటే తామసికం నుండి సాత్వికం వైపు మరలుతుండటమే! ఈ సాత్విక జీవనశైలి ఉన్నత చైతన్యాన్ని పరిపుష్టం చేసుకోవటానికే! ఆత్మగౌరవంతో హయ్యర్ కాన్షియస్‌నెస్ వైపుగా అడుగులు పడటం అంటే తాపసికానికి తలుపులు తెరచుకోవటమే!
అవును, ఫీల్ గుడ్, ఆల్ ఈజ్ వెల్ తత్వంతో జీవనయానం కొనసాగించటం సాత్విక సరళే! సంపద, కీర్తి, అధికారం ఆత్మగౌరవ ప్రతీకలు కావు అని తెలిసికోవటం సెల్ఫ్ రియలైజేషన్! భక్తి, ముక్తి హయ్యర్ కాన్షియస్‌నెస్‌కు తొలి వాహికలన్న నిర్ణయానికి రావటం మనం స్పిరిట్యుయలిజమ్ వైపు ఆముఖం కావటమే! ఈ ఆధ్యాత్మిక పయనంలో సంకుచిత భావదాస్యం పనికిరాదు. మన నమ్మకాలు, విశ్వాసాలే ప్రామాణికాలని, వాటిని అందలం ఎక్కించటం, వాటి కోసం అహంకరించటం, ఇతరాల్ని చిన్నచూపు చూడటం ఆత్మగౌరవ సోపానాలు కావు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే హయ్యర్ కాన్షియస్‌నెస్ పరంగా మన ఐహిక జీవనం జీవనది కావాలి.. మనమే జీవగంగా భగీరథ తపస్వులం కావాలి.
ఇక, మన ధైర్యమే మన బలం. ధైర్యంతో జీవితం ఛాలెంజింగ్, ఎగ్జయిటింగ్, ఓవర్ వెల్మింగ్ అవుతుంది. దీంతో నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగవుతుంటుంది. ఈ మెరుగంతా మనం చైతన్య విస్ఫోటనా విశ్వమిత్రులంగా పరిణమిస్తుండటాన్ని సూచిస్తున్నట్లే.
గెలవాలి! గెలిపించాలి!! అనుకోవటం మనలోని ఉన్నతత్వానికి ప్రతీక. ఈ ప్రయాణంలో మనం ఎక్కడా ఆగిపోం.. ఎక్కడా అతుక్కుపోం.. అలుపు సొలుపు ఉండదు.. అనుభవాలే తప్ప ఆధారాలు పరిగణనలోకి రావు. ఈ ప్రస్థానంలో మనకు మనమే కాంతిలేఖలం.
ఇష్టం, మక్కువ, అంగీకారం - ఐహిక సంగమ చైతన్య కెరటాలే అయినప్పటికీ హయ్యర్ కాన్షియస్‌నెస్‌లో అంతర్ప్రవాహాలైన మూడు పాయలు.. ఆముష్మిక సాంద్రతా చైతన్య కిరణాలు. విల్లింగ్‌నెస్ అనేది మన సెల్ఫ్ డిసిప్లిన్‌కి, విల్ పవర్‌కి దోహదపడుతుండటం అంటే ఆముష్మిక సాంద్రతా చైతన్య కిరణమనేగా! అవును, This is the point where your consciousness becomes more organized and disciplined.
అన్నట్టు, ద్విగుణీకృత చైతన్యంతో బ్రతకాలనుకోవటం మన స్వభావాన్ని స్వాగతించటమే! మనల్ని మనం అంగీకరించటమే! మనలది కేవలం వైయక్తిక బాధ్యత మాత్రమే కాదు.. కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత, ప్రాపంచిక బాధ్యత, విశ్వబాధ్యత పెనవేసుకున్న బంధం. ఈ బంధం, బాధ్యతలతో మనలది విశ్వమైత్రి... మనం విశ్వభరులం అవుతాం.
మన శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించగలిగేది ఈ విశ్వమైత్రితోనే! విశ్వపురుషగా పరిణమించటానికి ఇదే తొలి మలి ప్రస్థానం ఈ ప్రస్థానంలో ప్రేమ విస్తృతమవుతుంటుంది.
ఈ విస్తరింపు తొలి అంకంలో నీకూ నాకూ మధ్యనే! ఈ ప్రేమ నీ-నా నుండి రారుూ రప్పకు, చెట్టూ చేమకు, నింగికీ నేలకూ వారధి అవుతుంది. ఈ హయ్యర్ కాన్షియస్‌నెస్ పరంగా మన లక్ష్యాలు అహంకార రహిత నిస్వార్థాలు, శుద్ధాలు, పారదర్శకాలు, విశ్వజనీనాలుగా ప్రస్థానిస్తాయి.
ఇదే సంకల్ప సిద్ధత్వం.
ఇదే గిక జాయ్, పీస్, ఎన్‌లైటెన్‌మెంట్‌ల సంయోగం.
గికత్వం అంటే- శాంతి ప్రవచనం కాద.. నిశ్శబ్ద సాధన... ఆనందహేల కాదు.. శాంత ప్రస్థానం... జ్ఞాన లోగిలి కదా.. ప్రజ్ఞాన కలశం. అందుకే-నేను.. సమకాలీన అస్తిత్వ చైతన్యాన్ని!

-విశ్వర్షి 9393933946