S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంధనం పొదుపు వంటకాలు

ఫొయ్యి తెలుగు సంస్కృతికి ప్రతీక! మట్టితో చేసిందయినా, ఇనుముతో చేసిందైనా, ఇటుకలతో కట్టిందయినా తెలుగు సంస్కృతితో పెనవేసుకొని నడిచింది పొయ్యి. ఇప్పటి ప్రజలు స్టౌలు మాత్రమే వాడుతున్నారు కాబట్టి, పొయ్యి అనే మాట ఇవ్వాళ్టి తరంలో చాలామందికి తెలియకపోతే ఆశ్చర్యం లేదు. కిరసనాయిలు స్టౌలు కూడా తగ్గిపోయాయి. గ్యాస్ స్టౌ అనేది నిత్యావసర వస్తువయ్యింది. ఎక్కడో కొద్దిమంది గ్రామీణ ప్రాంతాల్లో కొంతవరకూ కట్టెల పొయ్యిలు వాడుతూ ఉండవచ్చు.
ఇంజనీరింగ్ విప్లవాల గురించి మాట్లాడుతుంటాం. మూడు రాళ్లను పేర్చి పొయ్యిగా చేసి, పైన ఓ కుండను పెట్టి నీళ్లు, ధాన్యం పోసి అన్నం వండిన మొదటి ఇంజనీరు పారిశ్రామిక విప్లవానికి మూల పురుషుడు. లోహ యుగంలోనే ఇనుమును కరిగించి పోతపోసి ఆయుధాలు, పనిముట్లు, పరికరాలు తయారుచేసే కర్మాగారాలను నెలకొల్పిన పారిశ్రామికవేత్తలంతా ఆయన వారసులే! పొయ్యికైనా, కొలిమికైనా, ఇనుముకైనా ఇంకా ఏ ఇతర లోహానికైనా అగ్నిని తగినంతగా ప్రజ్వరిల్ల చేయగలగటం ఒక విద్య. ఇనుమును కరిగించేంత ఉష్ణోగ్రతను సృష్టించగలగటం సామాన్య విషయం కాదు. కనీసం 4వేల ఏళ్ల క్రితం తెలుగు నేల మీద మన పూర్వులు దీన్ని సుసాధ్యం చేశారు.
రెండు నిలువు రాళ్లు, ఒక అడ్డరాయితో పొయ్యిని కడతారు. పొయ్యి, పొయ్య, ప్రొయి ఇలా పొయ్యిని అనేక రకాలుగా పిలుస్తారు. పొయ్యి లోపల కట్టెలుంచి మంట పెడతారు. పొయ్యి రాళ్ల మీద గినె్న నుంచి వంట చేస్తారు. పొయ్యి రాళ్లని పొక్కటి రాళ్లు (పొయ్యి + కల్లు + ఇ + గడ్డ) పొక్కల్లు అని కూడా అంటారు. పొక్కటి రాళ్ల కోసం పోట్లాడుకొన్న సందర్భాలు అనేకం ఉండేవి. పొయ్యి రాళ్లలా కలసిమెలసి ఉండాలనేది తెలుగింటి సూక్తి.
పొక్కలి అంటే మూడు రాళ్లు అందంగా పేర్చి, వంట కమ్మగా చేసుకునేందుకు ఉపయోగించే ఒక సాధనం. గినె్న కదలకుండా ఉంచి, గాలి ధారాళంగా అందేందుకు పొయ్యి రాళ్లపైన గుబ్బలాంటి ఉబ్బుల్ని ‘పొయిగడ్డలు’ లేక పొయిగడ్లు అంటారు. పొయ్యికి పెనాన్ని అంటించి తయారుచేసినవి కూడా ఉండే. పొయ్యి + పెనం కలిసిన దీన్ని ‘పొయిపెనం’ అనీ, ‘పొయ్యిపెండె’ అనీ అంటారు. బంగారం లాంటి తేలిక లోహాలు కరిగించే మూసని ‘పొయిగారం’ అంటారు. వంట గదిలో పొయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని ‘పొయ్యిల్లు’ అన్నారు.
1975 వరకూ పొయ్యి మీద వంటలే ప్రధానంగా జరిగేవి. రాతి పాత్రల్లో వండుకునేవారు. ఈ ఆధునిక యుగంలో పొయ్యిలు, రాతి పాత్రల గురించి మాట్లాడటం అనాగరికంగా అనిపించవచ్చు కానీ, మన పూర్వీకులు జీవితాన్ని ఎంత సంతోషంగా అనుభవించారన్నది ముఖ్యం.
గ్యాసు పొయ్యి సర్వ శ్రేష్ఠం అనుకోవటం కూడా భ్రమే! అలాగని అందుకు ప్రత్యామ్నాయంగా దేన్నీ మనం అట్టే పెట్టుకోలేదు. కిరసనాయిలు స్టౌల మీద వండిన వంట ఆరోగ్యదాయకం కానే కాదు. మరి గ్యాసు వాడకానికి ప్రత్యామ్నాయం ఏమిటీ...? ఆ ప్రత్యామ్నాయానికి తగిన పొయ్యి కావాలి కదా! ఎలక్ట్రిక్ హీటర్లు, ఓవెన్లు, ఇండక్షన్ స్టౌలు, పొగరాని ఇంకా అనేక పొయ్యిలు ఈనాడు దొరుకుతున్నాయి. కానీ, కరెంటు లేనప్పుడు, గ్యాసు సిలిండరు ఖాళీ అయినప్పుడు కోటి రూపాయలు జేబులో ఉన్నా ఇంట్లో పొయ్యి రాజుకోదు. ఉన్నది కదా అని వృథా చేయటంకన్నా ఇంధనాన్ని పొదుపు చేసే విధంగా వంటకాలు తయారుచేసుకోవటం వలన ఆరోగ్యం చెడకుండా ఉంటుంది. ఏ వస్తువునైనా అధిక ఉష్ణోగ్రత దగ్గర వండితే అందులో ఎక్రిలమైడ్ అనే విష రసాయనం పుట్టి అది కేన్సర్ లాంటి వ్యాధులకు కారణం అవుతుంది. తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండిన వంటకాలలో ఎక్రిలమైడ్ ఉండదు. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కరెంటు మీద ఆధారపడి, సీలింగ్ ఫ్యాన్లూ, ఏసీలూ ఉన్నాయి కదా అని గాలీ వెలుతురు లోపలికి రాని ఇళ్లు కట్టుకుంటున్నాం. వంటగ్యాసుని నమ్ముకొని వంట గదుల్ని చిన్నవిగా కుదించి కట్టుకోవటం వలన ఈ ఇళ్లల్లో గ్యాసు స్టౌ మీద తప్ప మరొక దాని మీద వంట చేయడం సాధ్యం కాదు.
పొయ్యిలోకి కట్టెలు, కుంపట్లోకి బొగ్గులు దొరకటం అసాధ్యం అయిన ఈ రోజుల్లో గ్యాసు వాడకం అనేది తప్పనిసరే! దాన్ని మితంగా వాడుకోవటం వలన మనం పట్టించుకోవటం లేదు కూడా. కొత్త ధనవంతుల (నియో-రిచ్) సంఖ్య దేశంలో పెరగటం వలన డబ్బు పారేసి దేన్నైనా కొనేయాలనుకునే మనస్తత్వం మనలో ఎక్కువ కాసాగింది. ఇంధన పొదుపు గురించి మాట్లాడటమే అరుదయ్యింది. వండే విధానంలో మార్పు ద్వారా ఇంధనాన్ని పొదుపు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాన్ని తయారుచేసుకోవటం ఒక అవసరం. ప్రకృతిని, పర్యావరణాన్ని, వీటితోపాటు మన స్వంత ఆరోగ్యాన్ని కాపాడుకునే రీతిలో మన వంటకాలు తీరు ఉండాలి. మన ఆహార ప్రణాళికలో ఇంధన పొదుపు ముఖ్య అంశం అయితేనే ఇది సాధ్యమవుతుంది.
ఉడకటానికి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరమయ్యే కఠినమైన ఆహార ద్రవ్యాలకు ప్రాధాన్యత తగ్గించగలిగితే ఇంధనం కొంత పొదుపు అవుతుంది. ఉదయం పూట ప్రతీరోజూ టిఫిన్ల తయారీకి చాలా ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నాం. టిఫిన్లకు బదులుగా పెరుగన్నం తినే అలవాటు చేసుకోగలిగితే ఇంధన పొదుపే కాదు శరీర ఆరోగ్యం కూడా పదిలం అవుతుంది. ఏ జబ్బులో అయినా సరే టిఫిన్లను తినటం మానేస్తే సగం వ్యాధి తగ్గినట్లే భావించాలి. వ్యాధితోపాటు ఇంధన వాడకం కూడా తగ్గుతుంది.
ఎక్కువ నీళ్లు పోసి ఉడికించటం, ఎక్కువ నూనెలో వేసి వేయించటం వలన ఇంధనం వృధా అవుతుంది.
మాంసాహారానికీ ప్రాధాన్యత తగ్గించి కూరగాయల్ని ఎక్కువ మోతాదులో తినగలిగేలా వండుకుంటే మాంసంకన్నా ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. జీర్ణాశయ వ్యవస్థ బలంగా ఉంటుంది. తేలికగా అరిగే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత నివ్వటం అన్ని విధాలా లాభదాయకం.డీప్ ఫ్రై, టిక్కా, డబుల్ రోస్ట్ లాంటి ముద్దు పేర్లు పెట్టుకున్న వంటకాలు ఆరోగ్యానికి ఎంతవరకూ సహకరిస్తాయో గమనించుకోవాలి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com