S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేరు

ఆదివారం.. ఉదయం తొమ్మిది గంటలు.. నగరంలో పేరుమోసిన ఇంజనీరింగ్ కాలేజీ.. కంప్యూటర్ బ్లాక్ ముందు అమ్మాయిలంతా ఒక క్యూలో, అబ్బాయిలంతా మరో క్యూలో బారులుతీరి నిలబడి ఉన్నారు.
వాళ్లలో కొందరి ముఖాల్లో ఆతృత, ఆందోళన, ఉత్సుకత నిండి ఉంటే, మరి కొందరి ముఖాల్లో నిర్లక్ష్యం, బద్దకం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. వాళ్లంతా బ్యాంకు ఉద్యోగం కోసం పోటీ పరీక్ష అటెండ్ కావడానికి నిలబడి ఉన్నారు.
‘మీ మొబైల్ ఫోన్స్, వాచీలు, పర్సులు, వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్‌లు పక్కనున్న కౌంటర్‌లో ఇచ్చి టోకెన్స్ తీసుకోండి. అలాగే మీ చెప్పులు, షూస్ ఎగ్జామ్ హాల్ ముందు విడిచి లోపలికి వెళ్లండి. లేకపోతే అనుమతించరు’ అందరికీ వినపడేలా బిగ్గరగా చెప్పాడు టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ తాలూకూ ప్రతినిధి.
ఒక్కసారిగా కలకలం చెలరేగింది క్యూలలో. ‘మొబైల్ లేకపోతే ఎలా?’ అని అమ్మాయిలూ, ‘మొబైల్స్, వాచీలు ఉంటే ప్రాబ్లెమ్ ఏంటీ?’ అని అబ్బాయిలూ బిగ్గరగా గొణుక్కోవడం మొదలుపెట్టారు.
‘ఇంకా నయం! బట్టలు విప్పమనే్లదు!’ అని ఎవరో కొంటె కుర్రాడు అనగానే అందరూ బిగ్గరగా నవ్వారరు.
‘ప్లీజ్ బి సైలెంట్ - హియర్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఫ్రమ్ బ్యాంకర్స్’ అనగానే అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
సుమారు నలభై ఏళ్లావిడ ముందుకొచ్చింది. ఆవిడ పక్కనే ఇంచుమించు అదే వయసున్న మరొకావిడ నిలబడి ఉంది. వాళ్లిద్దరి మెళ్లోనూ ఓ జాతీయ బ్యాంకు తాలూకూ ఆఫీసర్లని తెలియజేసే ఫొటో ఐడెంటిటీ కార్డులున్నాయి.
‘మీరందరూ దయచేసి మీ ఎగ్జామ్ కాల్ లెటర్స్‌నీ, మీ ఫొటోతో కూడిన ఐడెంటిటీ కార్డులనీ సిద్ధంగా ఉంచుకోండి. కాల్‌లెటర్స్‌పై లేటెస్ట్ ఫొటో అంటించి ఉండాలి. లేకపోతే ఆ పక్కన గమ్ ట్యూబ్ ఉంది వాడుకోండి. ఇకపోతే కాల్‌లెటర్‌లో మీ పేరు ఎలా ఉందో, ఇంటి పేరుతో సహా.. అదే విధంగా మీరు చూపించే ఐడెంటిటీ కార్డులో కూడా ఉండాలి. తేడా ఉంటే అంగీకరించబడదు. ఎగ్జామ్‌కి ఇంకా గంట టైముంది. మిమ్మల్ని ఇప్పట్నుంచీ లోపలికి పంపిస్తాం. వరుసగా ఒక్కొక్కళ్లూ రండి. ఆల్ ది బెస్ట్’ వివరంగా, స్పష్టంగా చెప్పి ‘కమాన్ సంధ్యా! లెటస్ స్టార్ట్ ద ప్రాసెస్’ అంటూ ముందుకొచ్చింది మొదటి ఆవిడ. ఆ ఇద్దరూ చెరో క్యూ చివరా నిలబడి ఒక్కొక్కళ్లనీ చెక్ చేసి లోపలికి పంపడం మొదలుపెట్టారు.
‘ఇదేంటీ! మీ ఫొటో లేదు. ఫొటో అతికించాలి మీరు!’ మధ్యలో ఆపి అడిగింది ఒక అబ్బాయిని.
‘లేదు మేడమ్! మర్చిపోయాను...’ కేర్‌లెస్‌గా చెప్పాడు ఆ అబ్బాయి.
‘లేకపోతే అనుమతించలేం!’ క్లియర్‌గా చెప్పింది బ్యాంకర్.
‘అదేంటి మేడమ్! కాల్‌లెటర్‌పైన ఫొటో కాపీ చేయబడ్డ నా ఫొటో ఉందిగా! నన్ను పోల్చి చూస్కోండి! నేనే వచ్చానుగా! ఏంటీ ప్రాబ్లెం! సరిపోకుంటే వెనుకకు పంపించెయ్యండి!’ అన్నాడు ఆ అబ్బాయి.
‘్ఫటో తెచ్చి అతికించాలని ఇన్‌స్ట్రక్షన్స్‌లో వున్నది చదవలేదా! దాన్ని ఫాలో అవ్వండి. మీ సొంత రూల్స్ చెప్పద్దు’ స్థిమితంగా చెప్పింది.
‘నిన్న వేరే డ్రెస్ వేసుకున్నాను మేడమ్! దాంట్లో ఫొటో ఉంది. హడావిడిగా వచ్చాను చూసుకోలేదు’ అబ్బాయి కొంచెం తగ్గాడు.
‘అందుకే ముందే చెప్పాం. సరే! ఇప్పటికయినా ఇంటి దగ్గర ఎవరయినా ఉంటే వాళ్లకు అర్జంటుగా ఫొటో తెచ్చివ్వమని చెప్పండి. అందాకా మీరు పక్కకు జరిగి వేరే వాళ్లని రానివ్వండి’ చెప్పిందామె.
‘ఎలా మేడమ్! మాది పక్కనే పల్లెటూరు. మా వూరు ఇది కాదు. ఇప్పుడెవరొస్తారు?’ ప్రశ్నించాడు ఆ అబ్బాయి.
‘అవన్నీ ముందే చూసుకోవాలి బాబూ! ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తే వెనుక వాళ్లకు టైం లాస్ అవుతుంది...’ అంది వెనుక అసహనంగా కదులుతున్న మిగతా వాళ్లను గమనిస్తూ.
ఆ అబ్బాయి ప్రక్కకు వెళ్లి ఎవరికో ఫోన్ చేయడం మొదలు పెట్టాడు.
‘అబ్బ! ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేమిటే వీళ్లూ?’ లైన్లో వున్న కీర్తితో అంది శిరీష.
‘అవును మరి! ఫొటో లేకుండా ఎలా అలౌ చేస్తారు చెప్పు! మన కాల్‌లెటర్‌లో క్లియర్‌గా ఉంది కదా!’ అంది కీర్తి.
‘్భలే ఎగ్జయిటింగ్‌గా ఉంది కదూ!’ అంది మళ్లీ కీర్తి.
‘అవును నాక్కూడా! మనం ఉద్యోగం కోసం రాసే ఫస్ట్ ఎగ్జామ్ కదా!’ అంది శిరీష. క్యూ కదులుతోంది.
‘ఇదేంటమ్మా! మీ కాల్ లెటర్‌లో సర్‌నేమ్‌కీ, మీరు తెచ్చిన ఆధార్ కార్డులో ఇంటి పేరుకీ తేడా ఉందేమిటీ?’ ఆడపిల్లల క్యూ చెక్ చేస్తున్నావిడ ఓ అమ్మాయిని అడిగింది.
‘అవును మేడమ్! ఇదే నాదే!’ అందా అమ్మాయి.
‘మీదే.. కాదనడంలేదు.. బట్.. కాల్ లెటర్‌లో బైరు ప్రియాంక అని ఉంది. మీ ఆధార్ కార్డులో వంక ప్రియాంక అని ఉంది. ఇలా అనుమతించలేం!’ చెప్పిందామె.
‘నాకు మ్యారేజ్ అయింది మేడమ్! అయినాక మా అత్తగారింట్లో ఆధార్ కార్డు తీసుకున్నాం. ఇంటిపేరు మారకుండా ఎలా ఉంటుంది?’ వింతగా అడిగింది ప్రియాంక.
‘ఇంటి పేరు మారకుండానూ ఉండొచ్చు. మార్చుకోనూ వచ్చు. అది మీ వ్యక్తిగత విషయం. కానీ, ఇక్కడ అలా అనుమతించబడదు’ స్థిరంగా చెప్పిందామె.
‘ఎలా మేడమ్? మా అత్తగారింట్లో మార్పించారు. నాకు తెలీదు. అలౌ చేయండి ప్లీజ్!’ బ్రతిమిలాడుతూ అంది ప్రియాంక.
‘లేదమ్మా చేయలేం.. అయినా రేషన్ కార్డో, ఓటర్ కార్డో అయితే మీకు తెలియకుండా, ఎవరో సర్వేకు వచ్చినవాళ్లు ఇంట్లో వాళ్లు ఏది చెబితే అది వ్రాసుకు పోయేవాళ్లు అనుకోవచ్చు కానీ, ఆధార్ కార్డు కోసం మీరు స్వయంగా వెళ్లి వివరాలు చెప్పి ఫోటో దిగి, వేలిముద్ర ఇవ్వాలి కదా! మీకు తెలియకుండా ఎలా ఉంటుంది?’
‘మేడమ్! ఈ ఒక్కసారికి అలౌ చేయండి ప్లీజ్! నేను బాగా ప్రిపేర్ అయ్యాను.. నాకీ జాబ్ చాలా అవసరం’ రిక్వెస్ట్ చేసింది ప్రియాంక.
‘అయ్యయ్యో! మిమ్మల్ని ఎగ్జామ్‌కి దూరం చెయ్యాలని నాకు లేదు! పోనీ, కాల్ లెటర్‌పై వున్న పేరుకు సరిపడేలా వోటర్ కార్డు గానీ, డ్రైవింగ్ లైసెన్సు గానీ, పాన్‌కార్డు కానీ, పాస్‌పోర్ట్ గానీ ఉంటే ఇవ్వండి. పంపిస్తాను’
‘అవేవీ లేవు మేడం.. ఇప్పుడెలా మేడం.. మీరే చెప్పండి!’ బ్రతిమిలాడ్తూ అంది ప్రియాంక.
‘ఏంటీ శ్రీదేవీ! ఏమిటి ప్రాబ్లెం?’ వెనుక క్యూ ఆగిపోవడం చూసి ఇటు క్యూ వైపు వచ్చి అడిగింది సంధ్య అన్నావిడ. విషయం వివరించింది శ్రీదేవి.
‘మీ కాల్ లెటర్‌లో నిబంధనలు చదివారా?’ అంటూనే ప్రియాంక చేతిలోని కాల్ లెటర్‌లోని నిబంధనల్లో ఒకదాన్ని అండర్‌లైన్ చేయించి చూపించింది సంధ్య.
‘ఒకవేళ వివాహం అయిన మహిళలు ఇంటి పేరు మార్చుకున్నట్లయితే వారు వివాహ రిజిస్ట్రేషన్ పత్రం గానీ ఆ మేరకు గవర్నమెంట్ గెజిట్ కాపీ కానీ, రిజిస్టర్డ్ నోటరీ ధృవీకరణ పత్రం గానీ జతపర్చాల్సి ఉంటుంది’ అని ఇంగ్లీషులో ఉంది అందులో.
‘చూడలేదు మేడమ్! ప్లీజ్ మేడమ్! ఈసారికి ఎలాగైనా అలౌ చేయండి మేడమ్!’ మళ్లీ బ్రతిమిలాడ్డం మొదలుపెట్టింది ప్రియాంక.
‘చూడమ్మా! నీకు అన్ని ఆప్షన్లూ చెప్పాము. ఎగ్జామ్ రాయడం ఇక మీ చేతుల్లోనే ఉంది. నార్మల్‌గా మేము ఒరిజినల్స్ చూసి నిర్ధారించుకున్నాకనే ఫొటో కాపీలను అనుమతిస్తాము. కానీ మీకు ఇంకో ఛాన్స్ కూడా ఇస్తాము. మీ ఇంట్లో వాళ్లకెవరికైనా ఫోన్ చేసి, ఏ డాక్యుమెంటైనా ఉంటే మెయిల్ చెయ్యమనండి. ఇక్కడ ప్రింట్ తీసుకుందాం లేదా ఇంకా నలభై నిమిషాల టైముంది. దగ్గర్లో ఎవరైనా నోటరీతో మాట్లాడి అఫిడివిట్ తెచ్చుకోండి. సమయం వృధా చేసుకోవద్దు. ఎవరితోనైనా మాట్లాడాలంటే నా మొబైల్ ఇస్తాను.’ స్థిరంగా చెప్పి తర్వాతి వాళ్లను చెక్ చేసి గబగబా లోపలకి పంపించడం మొదలుపెట్టింది శ్రీదేవి.
చేసేదేమీ లేనట్లు ఒకపక్కగా నిలబడి నిస్సహాయంగా చూడసాగింది ప్రియాంక. ఆమె కళ్లు నీటితో నిండుకున్నాయి. చేతిలో వున్న మొబైల్ నుండి ఏవో నంబర్లు డయల్ చేసి మాట్లాడింది. చివరకు నిరాశగా వెనుదిరిగి మెల్లగా నడవసాగింది.
‘ఏమయ్యింది ప్రియాంకా! ఐడీ కార్డు తీసుకురాలేదా?’ లైన్లో వున్న శిరీష అడిగింది.
విషయమంతా చెప్పింది ప్రియాంక.
‘ఎగ్జామ్ అయ్యేలోపు తెచ్చివ్వమని మీ వాళ్లకు ఫోన్ చేయకపోయావా?’ అన్నది కీర్తి.
‘మా వాళ్ల సంగతి తెల్సు కదా?! మా నాన్న ఇలాంటి విషయాలు అస్సలు మేనేజ్ చేయలేడు. చిట్‌ఫండ్ కంపెనీలో చిన్న జాబ్ ఆయనది. అయినా, పెళ్లి చేశాం.. బాధ్యత తీరింది అన్నట్టుగా ఉంది వాళ్లకి. ఇంక ఇక్కడెవరికయినా చెప్పి అరేంజ్ చేస్తాడేమోనని నా హస్బెండ్‌కి ఫోన్ చేశాను. తనేమో, ‘పోతే పోనీ వెధవ రూల్స్! ఈ జాబ్ కాకపోతే ఇంకోటి వస్తుంది. ఇప్పుడవన్నీ ఎవడు తెస్తాడు?’ అంటున్నాడు’ దిగులుగా చెప్పింది ప్రియాంక.
‘అయ్యో! ముందు చూసుకుంటే బావుండేది!’ అంది కీర్తి.
క్యూలో కదులుతూనే ప్రియాంక కోసం ఆలోచిస్తోంది శిరీష.
‘పాపం! మళ్లీ ఏడాది దాకా తను బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి కుదరదు. ఈలోగా ఇంకా పోటీ పెరుగుతుంది. తనకు కూడా ఉత్సాహం తగ్గిపోవచ్చు. అసలు పెళ్లవగానే సర్‌నేమ్ మార్చుకోకపోయినా బావుండేది!’
‘మీ ఇంటి పేరు సరిపోవట్లేదు. కాల్ లెటర్‌లో ఒకలాగా, మీరు చూపించిన ఐడీలో ఒకలాగా ఉంది. వేరే ఏదైనా ప్రూఫ్ వుంటే చూపించండి’ అన్న మాటలకు తుళ్లిపడి చూసింది శిరీష.
తనకన్నా ముందున్న అమ్మాయిని అడుగుతోంది అబ్జర్వర్ శ్రీదేవి.
‘నాకు పోయిన సంవత్సరం మేరేజ్ అయింది మేడమ్! మా అత్తగారు వాళ్లు ఆధార్ కార్డులో కంపల్సరీ వాళ్లింటి పేరే ఉండాలని పట్టుబట్టారు! ప్లీజ్ మేడం! అలౌ చేయండి’ అంటోంది ఆ అమ్మాయి.
‘ఏమ్మా! చదువుకున్నారు - బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నారు. రేప్పొద్దున బ్యాంక్‌లో పనిచేసేటప్పుడు పేరు, ఇంటి పేరు - వీటి ప్రాధాన్యత తెలియకుండా కస్టమర్ల డబ్బుకు సంబంధించిన లావాదేవీలు సరిగ్గా ఎలా చేస్తారు? అయినా, పెళ్లయితే పూజలు, పునస్కారాలూ, నోములూ, వ్రతాలూ ఇలాంటి వాటికి ఇంటి పేరూ, కులం, గోత్రం మార్చుకోవచ్చు గానీ, చదువులూ, ఉద్యోగాలూ లాంటి అఫీషియల్ విషయాలకు మార్చకుంటే ఎలాగమ్మా? ఒకవేళ మార్చుకున్నా పకడ్బందీగా చేసుకోవాలి లేదా అత్తింటి వాళ్లను కన్విన్స్ చేసుకోవాలి. రెండూ కాక మమ్మల్ని బ్రతిమిలాడితే ఏం లాభం?’ అంది శ్రీదేవి.
‘వాళ్లతో ఆ మాటలన్నీ చెప్పడం ఎందుకులే శ్రీదేవీ? అసలు వీళ్లు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి రావడమే చాలా కాజువల్‌గా వస్తున్నారు. జీవితమన్నా, ఉద్యోగమన్నా సీరియస్‌నెస్ లేదు. ఇంకా ఈసారి నయం! ఎనభై శాతం హాజరయ్యారు. పోయిన సంవత్సరం బ్యాంక్ ఎగ్జామ్ వేలంటైన్స్ డే అయింది కదా! ఆ రోజైతే నలభై శాతం మంది కూడా అటెండ్ అవలేదు తెల్సా? కట్టిన ఫీజు కూడా దండగై ఉంటుంది!’ అంది సంధ్య.
‘ఏమ్మా! మీతో ఎవరైనా వస్తే వాళ్లతో అఫిడవిట్ గానీ, కరెక్ట్ ఐడీ గాని తెప్పించగలిగే మార్గం ఉంటే చూడండి! లేకపోతే మీరు ఎగ్జామ్ రాయలేదు’ అంది మళ్లీ.
ఆ అమ్మాయి ఏదో చెప్పబోతూండగానే అక్కడికి ఓ యువకుడు వచ్చాడు. ‘ఏమయింది రవళీ! ఏంటీ ప్రాబ్లెం?’ అని అడిగాడు. ఆ అమ్మాయి భర్తలా ఉన్నాడు.
‘ఎగ్జామ్‌కి అలౌ చేయరట!’ అంటూ విషయం వివరించింది రవళి.
‘అదేంటీ! ఈ రూల్సన్నీ మనకు తెలియవుగా! నెక్స్ట్ టైమ్‌కి ఇద్దాంలే! ఈసారికి పంపించమను’ అన్నాడతను.
వినరన్నట్టుగా తల అడ్డంగా ఊపింది రవళి.
అతను ఇంకో రెండడుగులు ముందుకు వేసి ‘మేడమ్! తనని అలౌ చేయండి. ప్రాబ్లెం క్రియేట్ చేయొద్దు. అసలు ఎక్కడా లేని రూల్స్ చెప్తారేంటీ మీరు? పెళ్లవగానే అమ్మాయికి ఇంటి పేరు మారటం అనేది నేచురల్! మారొద్దని ఎక్కడుంది చూపించండి! మీరు లేడీస్ అయి ఉండి లేడీస్‌ను హరాస్ చేయొద్దు!’ అన్నాడు శ్రీదేవితో.
చకచకా ఒక్కో అమ్మాయి కాల్‌లెటర్ చూసి పంపిస్తున్న శ్రీదేవి తలెత్తి అతని వైపు చూసింది.
చాలా అధికారంగా, దురుసుగా మాట్లాడ్తున్న అతనితో ‘చూడండీ! ఈ ఎగ్జామ్‌కి అప్లై చేసే ముందే రూల్సన్నీ చదువుకోవాలి. అవి ఇక్కడ మేము విధించిన స్వంత నియమాలు కావు. కనీసం పరీక్షకు బయల్దేరే ముందైనా కాల్‌లెటర్ వెనకున్న రూల్స్ చదువుకోవాలి. ఇంటి పేరు మారడం నేచురలా అన్ నేచురలా అంటూ మీతో వాదించే అంత టైమ్ లేదు. ఆ అమ్మాయి పరీక్ష రాయాలంటే మీరు అర్జంట్‌గా దగ్గర్లోని ఎవరైనా నోటరీ అడ్వకేట్ వద్దకు వెళ్లి ఆ మేరకు అఫిడవిట్ తీసుకురండి’ అని ఎంతో శాంతంగా చెప్పి, మళ్లీ తన పనిలో మునిగిపోయింది.
వాళ్లిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుని మళ్లీ అతను శ్రీదేవి దగ్గరకు వచ్చాడు.
‘మేడమ్! నేను వెళ్లి సర్టిఫైడ్ అఫిడవిట్ తీసుకువస్తాను. కొంచెం లేటయినా ష్యూర్‌గా ఎగ్జామ్ అయిపోయేలోగా తీసుకువస్తాను. తనని మాత్రం టైంకి అలౌ చేయండి ప్లీజ్! లేదంటే మొత్తం వేస్ట్ అవుతుంది’ అంటూ బ్రతిమిలాడాడు.
‘సరే! మీరు ఇంతలా చెప్తున్నారు. కనుక, నేను అలౌ చేస్తాను. కానీ, అది మాకు చాలా రిస్క్. మీరు ఎగ్జామ్ అయిపోయేలోగా తీసుకురాలేకపోతే, ఇంటి పేరులో తేడా ఉండి సరియైన డాక్యుమెంట్ లేకుండా ఎలా అనుమతించారని మా మీదకు వస్తుంది. అయినా మీరు తప్పకుండా తెస్తారని నమ్మకంతో ఓ ఆడపిల్లకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రిస్క్ తీసుకొంటున్నాను. తొందరగా వెళ్లి రండి!’ అంది శ్రీదేవి.
‘ఎందుకు అంత రిస్క్ మనకి? ఇందాకటి అమ్మాయిలాగే ఈమెను పంపిస్తే పోయేదిగా! అనవసరంగా హామీ ఇచ్చావు? అయినా పక్కకు నిలబెట్టాంగా! లాస్ట్ మినిట్ వరకూ చూసి ఆ లోపుగా అతనొస్తేనే, పంపించొచ్చులే!’ అంది శ్రీదేవితో సంధ్య.
‘్ఫర్వాలేదులే! అతను తెస్తాడని నమ్మకం ఉంది!’ అంది శ్రీదేవి.
‘ఒద్దు మేడం! ఎలాంటి రిస్కూ తీసుకోవద్దు. ముఖ్యంగా లేటుగా వచ్చిన వాళ్లను అస్సలు అలౌ చేయొద్దు. ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో చాలా ప్రాబ్లె’ అన్నాడు సాఫ్ట్‌వేర్ సపోర్టర్.
శిరీషనూ, కీర్తినీ ఇంకా మిగతా వాళ్లనూ తొందరగా చెక్ చేసి పంపించారు.
తీరా పరీక్ష టైం అవుతుండగా రవళి కూడా తమ క్లాస్‌రూంలోకే రావడం చూసిన శిరీష ఆనందంగా ‘ఏంటీ! సబ్‌మిట్ చేశావా?’ అనడిగింది.
‘లేదు అక్కడ్నుంచి మనోజ్ ఫోన్ చేశాడు. అఫిడవిట్ తీస్కుంటున్నానని.. మేడమ్‌తో మాట్లాడిస్తే పంపించారు!’ అంది రవళి ఊపిరి తీసుకుంటూ.
గంట తర్వాత ఎగ్జామ్ అయిపోయి బయటికొచ్చారు శిరీష, కీర్తి.
‘కొంచెం టఫ్‌గా వున్నా ఎగ్జామ్ బాగానే చేశా. నువ్వూ?’ అడిగింది శిరీష.
‘సేమ్ విత్ మీ.. ఒక్క రీజనింగ్ పార్ట్ కొంచెం హార్డ్‌గా అనిపించింది. అయినా చూద్దాం!’ అంది కీర్తి.
‘పాపం! ప్రియాంక ఎగ్జామ్ అటెండ్ కాకుండానే వెళ్లిపోయింది. అదే, రవళిని
‘లేదు అక్కడ్నుంచి మనోజ్ ఫోన్ చేశాడు. అఫిడవిట్ తీస్కుంటున్నానని.. మేడమ్‌తో మాట్లాడిస్తే పంపించారు!’ అంది రవళి ఊపిరి తీసుకుంటూ.
గంట తర్వాత ఎగ్జామ్ అయిపోయి బయటికొచ్చారు శిరీష, కీర్తి.
‘కొంచెం టఫ్‌గా వున్నా ఎగ్జామ్ బాగానే చేశా. నువ్వూ?’ అడిగింది శిరీష.
‘సేమ్ విత్ మీ.. ఒక్క రీజనింగ్ పార్ట్ కొంచెం హార్డ్‌గా అనిపించింది. అయినా చూద్దాం!’ అంది కీర్తి.
‘పాపం! ప్రియాంక ఎగ్జామ్ అటెండ్ కాకుండానే వెళ్లిపోయింది. అదే, రవళిని అలౌ చేశారు కదా!’ అంది మళ్లీ కీర్తి.
‘రవళీ వాళ్లాయన ఏదో డాక్యుమెంట్ ఇచ్చాట్ట కదా! ప్రియాంకకి ఎవరూ తేవడం కుదరదందిగా పాపం! అయినా పెళ్లవగానే ఇంటి పేరు మార్చుకోవడం ఎందుకూ? ఏదైనా కొంప మునుగుతుందా? ఇప్పుడు చూడు తనకే నష్టం కదా!’ అంది శిరీష.
‘నీకు తెలియదు శిరీషా! చాలా మంది అత్తింటి వాళ్లు పెళ్లవగానే కోడలు ఇంటి పేరు మార్చుకోకపోవడాన్ని చాలా సీరియస్‌గా చూస్తారు - భర్తతో సహా! ఇప్పటి అబ్బాయిలు కొంచెం నయం అంతగా పట్టించుకోవడం లేదు గానీ, మన కుటుంబాల్లో ఇది చాలా కామన్!’ అంది కీర్తి.
‘పాత రోజుల్లో ఆడవాళ్లు ఉద్యోగాలు చేయనప్పుడో, వాళ్లకు ఆస్తిలో హక్కు లేనప్పుడో అలాంటివి జరిగాయేమో కానీ, ఇప్పుడెంత ప్రాబ్లెం కదా!’
‘మనమింకా ఇంటి పేర్లు మారడం గురించి మాట్లాడుతున్నాం గానీ, అసలు పేర్లు కూడా మారుస్తారు తెలుసా? ఎవరో ఎందుకు? మా మేనత్త పేరు సావిత్రి అని మా ఇంట్లో పిలుస్తారు. ఆ పేరు బాగా లేదని వాళ్లింట్లో సుజాత అని మార్చేశారు. ఇనే్నళ్లుగా ఇక్కడ ఈ పేరుతో అక్కడ ఆ పేరుతో ఆవిడా అలవాటు పడిపోయింది.’
‘అవును! మా పిన్ని వాళ్ల చెల్లెలి పేరు విష్ణుప్రియ. ఆమె పెళ్లప్పుడు ఆ పేరు మీద వాళ్లత్తగారింట్లో చాలా డిస్కషన్స్ అట. విష్ణూ అంటే అబ్బాయి పేరు లాగా ఉందనీ, ప్రియా అంటే ప్రతి వాళ్లూ అలా పిలిస్తే బావుండదనీ, చివరకు వసుధ అని మార్చేశారట.’
‘ఏమో కీర్తీ! నా మట్టుకు నాకు ఇది చాలా సున్నితమైన సమస్య అనిపిస్తుంది. అసలు పేరయినా, ముద్దు పేరైనా, మన చిన్నప్పుడో, మనకు నచ్చిన వాళ్లు పెట్టడమో వేరు. కానీ, మనకిష్టం ఉన్నా లేకపోయినా అదొక హక్కులాగా పేరు మార్చబడటం చాలా అన్యాయం!’
‘సరేలే! అందరూ వెళ్లిపోతున్నారు. ఇంటికెళ్దామా?’ అంది కీర్తి. ఇద్దరూ బయల్దేరారు.
* * *
మూడు నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. శిరీష, కీర్తి ఇద్దరూ పాసయ్యారు. ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారు.
ఈలోగా శిరీషకు సంబంధం కుదిరింది. దూరపు బంధువులే. అబ్బాయి అరవింద్ బి.టెక్ ఎంబిఏ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ మల్టీ నేషనల్ కంపనీలో పని చేస్తున్నాడు.
తెలిసిన కుటుంబం - అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారని వచ్చే నెలలోనే పెళ్లి నిశ్చయం చేశారు.
ఆ రోజు శిరీష బయట నుంచి వచ్చేసరికి వాళ్లమ్మా, నాన్నా హాల్లో పెళ్లి శుభలేఖలు చూస్తున్నారు.
‘రా శిరీ! కార్డ్స్ చాలా బాగా వచ్చాయి. ఇదిగో చూడు’ వాళ్ల నాన్న పిలిచాడు.
శిరీష కొంచెం సిగ్గుగా శుభలేఖ ఒకటి తీసుకొని చూసింది. కవరు చాలా ఆర్టిస్టిక్‌గా ఉంది. లోపలి కార్డు కూడా చదువుతూ ఒక్కసారిగా ఆగిపోయింది.
‘మా ఏకైక పుత్రిక చి.ల.సౌ. శిరీష (అనూష)ను చి. అరవింద్‌కు ఇచ్చి’ అన్న అక్షరాలు చూసి ‘ఇదేమిటి నాన్నా! నా పేరు పక్కన ఇంకో పేరుందేమిటి?’ అనడిగింది.
‘ఓ... అదా! నీకు చెప్పడం మర్చిపోయాను. మొన్న తీరా కార్డ్స్ ప్రింట్‌కు ఇచ్చిన తర్వాత మీ మామగారు ఫోన్ చేశారు. మీ తోడికోడలు పేరు కూడా శిరీషేనట కదా! ఒకే ఇంట్లో ఇద్దరూ శిరీషలే వుంటే పిలవడానికి ఇబ్బంది అవుతుందని అన్నారు. అబ్బాయి అరవింద్‌కు కలిసేలా నీ పేరుకు కూడా దగ్గరగా ఉండేలా అనూష అని పెట్టమన్నారు. పెళ్లప్పుడు మారిస్తేనే అందరికీ తెలుస్తుందంటే కరెక్టే కదాని ప్రెస్‌లో అప్పటికప్పుడు అనూష అన్న పేరు బ్రాకెట్లో వేయించాను. నీకు చెబ్దామనుకుంటూనే మర్చిపోయాను’ అన్నాడు శిరీష వాళ్ల నాన్న జగన్నాథ్.
‘అదేంటీ! నా పేరు కాని పేరుతో పిలిస్తే నేనెలా పలుకుతాను? అయినా అరవింద్ వాళ్లన్నయ్యా, వదినా ఉండేది బెంగుళూరులో. ఏడాదిలో రెండు మూడుసార్లు కలుస్తారేమో! మేముండేది వాళ్లింట్లో హైదరాబాద్‌లో. ఇదో పెద్ద సమస్య అనీ పేరు మారుస్తారా?’ అంది శిరీష.
శిరీష కంఠంలోని తీవ్రతను చూసి, ‘ఏమిటే శిరీ! చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించి భయపడ్తున్నావు. వాళ్లు ఏరి కోరి నిన్ను చేసుకుంటున్నారు. ఏదో చనువుంది, తెలిసిన వాళ్లు. అర్థం చేసుకుంటామనీ ముద్దుగా అలా పిల్చుకుంటామన్నారేమో! అసలు మా కాలంలో అయితే అబ్బాయి నచ్చాడా లేదా అని కూడా ఆడపిల్లను అడిగేవాళ్లు కాదు తెలుసా?’ అంది వాళ్లమ్మ మణి.
* * *
తనకు ఎంతో బాధ కల్గించే విషయం వీళ్లకు ఇంత తేలిగ్గా కనిపిస్తుందా అనుకుంది శిరీష. కొన్ని గంటలపాటు మథనపడి, ఆ తరువాత స్థిమితంగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి అరవింద్‌కి ఫోన్ చేసింది.
‘హాయ్! వాట్ యే ప్లెజెంట్ సర్‌ప్రైజ్!’ అన్నాడు అరవింద్ ఫోన్లో.
‘అరవింద్! మీరు ఫ్రీగా ఉన్నారు.. ఒక్క విషయం మాట్లాడొచ్చా?’ అంది శిరీష.
‘ఏంటీ! ఏమైనా అర్జెంటా?’ అతని కంఠంలో ఆతృత.
‘లేదు లేదు.. అంత అర్జెంటేమీ కాదు’ అంది శిరీష.
‘అయితే టెన్ మినిట్స్‌లో ఒక క్లయింట్ కాల్ అటెండ్ అయి, ఒక మెయిల్ పంపించేసి మళ్లీ కాల్ చేస్తా ఓకేనా’ అడిగాడు.
‘సరే.. సరే’ అని కాల్ ఎండ్ చేసింది శిరీష.
అన్నట్లుగానే పది నిమిషాల్లో కాల్ చేసాడు అరవింద్.
‘అరవింద్! మీ పేరును ఆనంద్‌గా మార్చాలనుకుంటున్నాం. ఆనంద్ అన్న పేరు నాకు చాలా ఇష్టం. ఓకేనా!’ అడిగింది శిరీష.
ఒక్క క్షణం అవతలి వైపు నుంచి జవాబు రాలేదు.
‘హలో!’ గుర్తు చేస్తున్నట్టుగా అంది.
‘యా! యా! శిరీషా.. ఎందుకూ ఈ కోరిక పుట్టిందీ! ఇన్‌ఫాక్ట్. నువ్వు ఏకాంతంలో.. ఏ పేరుతో పిలిచినా నాకు ఓకే! కన్నా.. మున్నా.. నానీ.. బుజ్జీ.. చంటీ ఎక్సెట్రా! బట్.. నా పేరంటే నాకు చాలా ఇష్టం. నిజానికి చిన్నప్పట్నుంచీ అలవాటు కూడా.. అయినా, ఎందుకూ మార్చడం?’ అన్నాడు.
‘మీకు తెలుసో లేదో! మీ వదిన పేరు కూడా శిరీష అవడం వల్ల మీ ఇంట్లో వాళ్లు నా పేరును అనూషగా మార్చారు. నన్నడక్కుండానే.. కార్డ్స్‌లో కూడా వేయించారు. ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలనే మీకు కాల్ చేశాను’
‘ఈజిట్! నాకు నిజంగా తెలియదు.. ఏదో కన్వీనియంట్‌గా ఉంటుందని అన్నారేమో! నేను కనుక్కుంటాను’
‘్ఫరవాలేదు.. మీరు నన్ను ఇష్టపడ్డానని చెప్పారు. నాక్కూడా మిమ్మల్ని ఇష్టపడకపోవడానికి వేరే కారణం ఏమీ లేదు.. బట్.. నా పేరు మార్చడం అనేది తప్పనిసరి అయితే మాత్రం - మీ విషయంలో నేను మళ్లీ ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. మీ అభిప్రాయాలను నేను గౌరవించినప్పుడు, నా అభిప్రాయాలను మీరు కూడా మన్నించాలని కోరుకోవడం తప్పుకాదనుకుంటా. మీ మాట తీరు, సంస్కారం నాకు నచ్చాయి. ఈ విషయం కూడా అర్థం చేసుకుంటారనే నా ఆశ. తొందరేం లేదు - ఆలోచించుకొని చెప్పండి. బై’ అంటూ ఫోన్ పెట్టేసింది.
ఇప్పుడు శిరీష మనస్సు ప్రశాంతంగా ఉంది.

-నెల్లుట్ల రమాదేవి.. 9440622781