S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆగ్నేయం బ్లాక్ ఇల్లు -- వాస్తు

ఆంజనేయులు (ఉరవకొండ)
ప్రశ్న: మా ఇల్లు తూర్పు, దక్షిణం రోడ్లుగల ఇల్లు. అలా ఉండకూడదని చాలామంది అంటున్నారు. అసలు అలా ఉండకూడదా? మరి అలా అయితే చాలామంది ఇళ్లకు రెండు రోడ్లు ఉంటాయి కదా? ఒకవేళ దీనివల్ల ఏదైనా సమస్యలు వస్తుంటే దానికి పరిష్కారం సూచించగలరు.
జ: మొదటగా మీ ఇల్లు ‘ఆగ్నేయం’ బ్లాకుగల ఇల్లు. దీని వల్ల ఇంట్లో నివసించే ఆడవారికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. రెండు రోడ్లు గలవారికి కొన్ని సమస్యలు తప్పకుండా ఉంటాయి. దీనికి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు.
శ్రీహరి (విద్యాధరపురం)
ప్రశ్న: మా ఇంటికి తూర్పు ఆగ్నేయంలో వీధి కలదు. దీనివల్ల ఏమైనా చెడు ఫలితాలు కలుగుతాయా?
జ: తప్పకుండా మీ ఇంటికి సంబంధించి తూర్పు ఆగ్నేయంలో గల వీధి పోటు వలన ఆడవారికి అనారోగ్య సమస్యలు, కేసులు, చిన్నచిన్న తగాదాలు జరుగుతుంటాయి. దీనికి సంబంధించి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు.
ఆర్.యాదవ్ (సిరిసిల్ల)
ప్రశ్న: మేము నూతనంగా గృహ నిర్మాణం మొదలుపెట్టాము. కానీ ఈ ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుండి అనుకోకుండా ఏదో ఒక సమస్య వస్తున్నది. ఇటీవల నాకు యాక్సిడెంట్ జరిగింది. ఇది ఈ ఇంటి ప్రభావమేనా?
జ: మీరు నిర్మిస్తున్న ఇంటికి నైరుతిలో దోషం ఉంది. మీరు నిర్మిస్తున్న ఇంటికి నైరుతి మూలను పెంచుతూ నిర్మాణం చేస్తున్నారు. అందువల్లనే ఇలా జరిగింది. ముందుగా ఆ పెరిగిన నైరుతిని వేరు చేయండి. తద్వారా మీకు గల సమస్యలు తొలగిపోతాయి.
రాజేంద్ర (నిజామాబాద్)
ప్రశ్న: దేవాలయాలకు సంబంధించిన స్థలాలో నివసించవచ్చా? నివసిస్తే ఏమైనా దోషమా?
జ: దేవాలయాలకు సంబంధించిన స్థలాలలో నివసించరాదు. దీనివల్ల మానసిక సమస్యలు వస్తాయి. ఈ దేవాలయ స్థలాలలో దేవాలయంలో పూజలు నిర్వహించే పూజాదులు మాత్రమే నివసించవచ్చు.
త్రినాథరావు (ఒంగోలు)
ప్రశ్న: మేము ఇటీవల ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఒక షాపును కొన్నాం. ఆ షాపు కొన్న దగ్గర నుండి చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందువల్ల?
జ: మీ షాప్‌నకు నైరుతి మూలలో లిఫ్ట్ వున్నది. అందువల్లనే మీకు ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. మీరు లిఫ్ట్‌కు సంబంధించిన దోషాలు రాకుండా ఉండటానికి సంబంధిత నివారణ పద్ధతులు ఉంటాయి. నివారణ చేయించుకోండి.

---------------

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28