S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రిమోట్

‘రిమోట్ మన దగ్గరే ఉండాలి. ఇతరుల దగ్గర కాదు’ ఇదీ ఈ మధ్య నన్ను ఆకర్షించిన వాక్యం.
రిమోట్‌లు ఎన్నో.
వాటిని ఉపయోగించేది ఎందరో.
టీవీ రిమోట్.
ఏసీ రిమోట్.
ఇంటి రిమోట్.
ఇట్లా ఎన్నో రిమోట్‌లు.
ఏ.సి. రిమోట్ మన దగ్గర వుంటే మనకు అవసరమైన రీతిలో దాని చల్లదనాన్ని ఉండవచ్చు.
ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ మన చేతిలో లేకుంటే మనకు ఇష్టమైన కార్యక్రమాన్ని చూడలేం. ఏదో ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నప్పుడు రిమోట్ చేతిలో వున్న వ్యక్తులు సడెన్‌గా చానల్ మార్చి మనలని చికాకు పరుస్తారు.
టీవీల్లో రకరకాల కార్యక్రమాలు వస్తుంటాయి. ఆ కార్యక్రమాల్లో చాలామంది లీనమై పోతారు. భావోద్వేగం ఎక్కువగా వున్న వ్యక్తులు ఆ కార్యక్రమాలని చూస్తూ ఆ కార్యక్రమానికి తగినట్టు వాళ్లు ప్రతిస్పందిస్తూ వుంటారు.
కొన్ని కార్యక్రమాలు-
నవ్విస్తాయి.
మరి కొన్ని భయపెడతాయి.
ఇంకా కొన్ని ఏడిపిస్తాయి.
భావోద్వేగం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఆ కార్యక్రమాలు చూస్తూ నవ్వుతారు. ఏడుస్తారు. భయపడతారు.
ఈ భావోద్వేగాలు వాళ్ల చేతిలో వుండవు.
రిమోట్ ఎవరి చేతిలోనైతే వుందో వారు మార్చిన కార్యక్రమాన్ని బట్టి వాళ్ల భావోద్వేగాలు మారుతాయి.
ఈ విషయాన్ని మన జీవితాలకి అన్వయించుకోవచ్చు.
మన గురించి ఇతరుల అభిప్రాయాలు మనలని ప్రతిస్పందింపచేస్తాయి. వాళ్లు అన్న మాటలని బట్టి మన భావోద్వేగాలు మారుతూ వుంటాయి.
ఈ మాటలు, ఈ చర్యలూ రిమోట్ లాంటివే.
ఈ రిమోట్‌ని మన చేతిలో వుంచుకోవాలి. అప్పుడు మన స్పందన మనం అనుకున్న మాదిరిగా ఉంటాయి.
అందుకని-
మన రిమోట్ మన దగ్గరే ఉండాలి.
ఇతరుల దగ్గర కాదు.

- జింబో 94404 83001