S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాటే మంత్రం

గంగన్న గజదొంగ. దొంగతనాలు, దోపిడీలు చేయడం అతడి వృత్తి. అతడికి కన్నయ్య ఒక్కగానొక్క కొడుకు. కనీసం వాడికైనా విద్యాబుద్ధులు నేర్పిద్దామన్న ధ్యాస లేదు.
ఉన్నట్టుండి జబ్బు చేసి మంచాన పడ్డాడు గంగన్న.
కన్నయ్య తండ్రి దగ్గరకొచ్చి ‘నాన్నా! నాకు చదూకోవాలని ఉంది. ఎవరైనా గురువు దగ్గరకు పంపించవా?’ అని అడిగాడు.
‘సదువులు మనకు అచ్చిరావురా. దొంగతనమే తరతరాలుగా వస్తున్న వృత్తి. దీంతోనే నువ్వు కూడా సుఖంగా బతకగలవు. నా మాట విని సదూ మాట ఎత్తకు’ అని చెప్పి కన్నుమూశాడు గంగన్న.
అప్పటి నుంచి తండ్రి చెప్పినట్లే కన్నయ్య కూడా దొంగతనాలు చేస్తూ పట్టుబడకుండా జీవించసాగాడు.
ఈ క్రమంలో ఓ రోజు పట్నం పోతున్న ఎడ్లబండి మీద దాడిచేసి, అందులో వున్న వ్యక్తుల్ని చితకబాది వారి వద్ద నుంచి నగల మూటను చేజిక్కించుకుని పరుగు తీశాడు.
అది గమనించిన వీరన్న అతడి నుంచి ఎలాగైనా ఆ మూటని కాజేయాలని కన్నయ్యను అనుసరించాడు.
కన్నయ్య అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఆయాసం వచ్చి ఒకచోట ఆగిపోయాడు.
అక్కడ ఓ గురువు శిష్యులకు ఉపదేశించటం కంటపడింది.
‘నాయనలారా! మానవ జీవితం క్షణభంగురం. పోయేటప్పుడు మనతో ఈ సిరులేవీ రావు. కడదాకా వచ్చేవి మనం చేసుకున్న పాపపుణ్యాలే. జానెడు పొట్ట కోసం కొందరు దొంగతనాలు, హత్యలు లాంటి నేరాలు చేస్తుంటారు. కడుపు నింపుకోడానికి నాలుగు కందమూలాలు చాలవా? ‘మానవ సేవే మాధవ సేవ’ అన్నారు. ప్రతి వ్యక్తి తోటివారి యెడల ప్రేమ, దయ కలిగి ఉండాలి’ అంటూ ఉపదేశం చేస్తున్నాడు.
ఆ మాటలు కన్నయ్య చెవిని పడ్డాయి. దాంతో అతడికి కనువిప్పైంది. తను చేస్తున్న పని తనకే సిగ్గనిపించింది. అంతే, ఆ క్షణం నుంచి దొంగతనాలు మానేసి కాయకష్టం చేసుకుని మంచిగా బతకాలనుకున్నాడు. అప్పటికే దొంగిలించిన నగల మూటని తిరిగి వాళ్లకు ఇచ్చేయాలనుకుని వెనక్కి మళ్లాడు.
కన్నయ్యను అనుసరిస్తున్న వీరన్న ఇదే మంచి అదనుగా భావించి ఒక్క ఉదుటున అతడి మీదకు సింహంలా ఉరికి అతడి చేతిలో నుంచి మూటను లాక్కున్నాడు.
అయినా కన్నయ్య వాడితో పెనుగులాడటం గాని పోట్లాడటం కానీ చెయ్యలేదు. దాంతో వీరన్న పని మరింత సులువై పోయింది. దొంగిలించిన నగల మూటతో పారిపోతూ ఉండగా త్రోవలో కొంతమంది రాజభటులు అతణ్ణి అడ్డగించారు.
నగల మూట పోగొట్టుకున్న వారి ఫిర్యాదు మేరకు మహారాజు గారు పంపిన భటులే వారు. వీరన్న చేతిలోంచి మూటని లాక్కుని అతణ్ణి రాజుగారి వద్ద హాజరుపరిచారు.
చేసిన నేరానికి అతడికి కఠిన కారాగార శిక్ష విధించారు.
రాజభటులకు దొరికిపోవలసిన కన్నయ్య తను విన్న గురువుగారి మంచి మాటల ప్రభావంతో బయటపడ్డాడు.
ఆ రోజు నుంచి మరి దొంగతనాల జోలికి వెళితే ఒట్టు.
మంచి మాటలెప్పుడూ మనిషికి మేలే తప్ప కీడు చేయవని గ్రహించిన కన్నయ్య కాయకష్టం చేసుకొని బతకనారంభించాడు.
-దూరి వెంకటరావు
9666991929