S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం -- 15-7-2018 నుంచి 21-7-2018 వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమ మంగళ వారాల్లో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ సంతృప్తి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పరిశోధనలకు, విద్యాత్మక వ్యవహారాలకు అనుకూలం. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి. సామాజిక అనుబంధాలు బలపడతాయి. శారీరక శ్రమ, సౌఖ్య లోపాలకు అవకాశం. బుధ గురువారాల్లో వ్యతిరేకతలుంటాయి. పోటీలు ఒత్తిడులను అధిగమించాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం. ఖర్చులు పెట్టుబడులుంటాయి. సౌకర్యాదులు ఇబ్బందులకు గురి చేయవచ్చు. అధికారులతో జాగ్రత్త. శుక్ర శనివారాల్లో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు విస్తరిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆది సోమ మంగళ వారాల్లో సంప్రదింపులుంటాయి. సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సౌఖ్య లోపం. ఆధ్యాత్మిక ప్రయాణాలు. అసంతృప్తి. విద్యా వ్యవహారాల్లో అనుకూలత. కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులకు అవకాశం. బుధ గురువారాల్లో ప్లానింగ్ అనుకూలత. కొత్త వ్యవహారాలపై దృష్టి. వ్యాపారాదుల్లో ప్రయోజనాలు. సంతానంతో సంతోషంగా గడుపుతారు. ఒక సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు, ఉన్నత విద్య వ్యవహారాల్లో చుక్కెదురు. శుక్ర శనివారాల్లో వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీలు ఒత్తిడులున్నా అధిగమించే ప్రయత్నం చేస్తారు. విజయం సాధిస్తారు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆది సోమ మంగళ వారాల్లో కుటుంబంలో అనుకూలత. కమ్యూనికేషన్స్ వర్తిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గ అనుకూలత. విహార యాత్రలకు అవకాశం. కొన్ని అనుకోని సమస్యలు. చిన్నచిన్న వ్యతిరేక సంఘటనలు. లలిత కళలపై దృష్టి. శారీరకమైన ఒత్తిడులుంటాయి. బుధ గురువారాల్లో ఆహార విహారాలపై దృష్టి. విద్యారంగంలో ముందడుగు. శ్రమతో కార్యక్రమాలు. గృహ వాహనాది వ్యవహారాలుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత. ప్రమాదాలకు అవకాశం. తొందరపాటు కూడదు. శుక్ర శనివారాల్లో ఆలోచనలకు రూపకల్పన. నూతన వ్యవహారాలు. సంతానవర్గ సంతృప్తి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆది సోమ మంగళ వారాల్లో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కుటుంబంలో శుభ పరిణామాలు. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. మాట తీరులో అనుకూలత. పరిచయాలు, అనుబంధాల్లో కొంత నైరాశ్యం. విందులు వినోదాలు. చెల్లింపులు అధికంగా ఉండవచ్చు. బుధ గురువారాల్లో సంప్రదింపుల్లో కొంత ఒత్తిడి. కమ్యూనికేషన్స్ ఇబ్బంది పెట్టే సూచనలు. ప్రయాణాదుల్లో జాగ్రత్త. ఇతరుల సహకార లోపాలు. నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం. పరిచయాల్లో జాగ్రత్తగా మెలగాలి. శుక్ర శనివారాల్లో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆది సోమ మంగళ వారాల్లో ఖర్చులు పెట్టుబడులుంటాయి. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ. బాధ్యతలను సంతోషంగా నిర్వహిస్తారు. ఉత్సాహంగా ఉంటుంది. నిర్ణయాదులు లాభిస్తాయి. వ్యతిరేకతలు కొన్ని చికాకు పెట్టవచ్చు. మనోల్లాసం. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. సంప్రదింపులుంటాయి. విజయం. బుధ గురువారాల్లో కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో చమత్కార ధోరణి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. విందులు వినోదాల ద్వారా సంతృప్తి. కొన్ని పెట్టుబడుల్లో సంతోషం. పోటీలు ఒత్తిడులున్నా విజయసాధన. శుక్ర శనివారాల్లో ఇతరుల సహకారం లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమ మంగళ వారాల్లో కొన్ని ప్రయోజనాలుంటాయి. ఖర్చులు పెట్టుబడులు అధికం. ప్రభుత్వ టాక్స్‌ల కోసం వెచ్చిస్తారు. విహార, వినోద యాత్రలపై దృష్టి. విందులకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. సామాజిక గౌరవం. ఆలోచనల్లో ఒత్తిడి. ఆనందంగా గడిపే ప్రయత్నం. అధికారిక వ్యవహారాలుంటాయి. బుధ గురు వారాల్లో నిర్ణయాదులు లాభిస్తాయి. అనేక కార్యక్రమాల బాధ్యతలుంటాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లాభాలపై దృష్టి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. శుక్ర శనివారాల్లో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుంటారు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమ మంగళ వారాల్లో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలుంటాయి. కీర్తిప్రతిష్టలు. వాహనాది సౌకర్య లోపాలుంటాయి. జాగ్రత్త. చేసే పనులకు సరియైన ప్రతిఫలం. బుధ గురు వారాల్లో ఖర్చులు పెట్టుబడులుంటాయి. వ్యాపారాదుల కోసం వెచ్చించే అవకాశం. హాయిగా గడిపేందుకు విందులు, వినోదాలు, విహారాలకు కూడా ధనం కేటాయిస్తారు. అనేక కార్యక్రమాల బాధ్యతలు. సౌఖ్యాలపై దృష్టి. శుక్ర శని వారాల్లో నిర్ణయాదులకు అనుకూలం. అనేక బాధ్యతలను ఉత్సాహంగా, సంతోషంగా నిర్వహిస్తారు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమ మంగళ వారాల్లో లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సామాజిక గౌరవం లభిస్తుంది. పితృవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వ సంబంధ పన్నులు చెల్లించాలి. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలకు అవకాశం. సంప్రదింపుల్లో జాగ్రత్త. సహకార లోపాలు. వృత్తిలో గుర్తింపు గౌరవాలు. బుధ గురు వారాల్లో లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల అనుకూలత. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. దూర ప్రయాణాలకు ప్లానింగ్. ఉన్నత విద్యపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలు. సోదర వర్గంతో సంప్రదింపులుంటాయి. శుక్ర శనివారాల్లో విజ్ఞాన వినోద యాత్రలకు ఖర్చులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. ఆరోగ్య సమస్యలుండే అవకాశం. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ఆధ్యాత్మిక, విజ్ఞాన యాత్రలు. పరిశోధనలుంటాయి. విద్యాత్మక ఆలోచనలు. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. ఒత్తిడులుంటాయి. మాటతీరులో జాగ్రత్త. నిరాశా ధోరణి. బుధ గురు వారాల్లో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలుంటాయి. వ్యాపారాదుల్లో గుర్తింపు లభిస్తుంది. ఊహించని సంఘటనలుంటాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. మాటల్లో తొందరపాటు కూడదు. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో మంచి ప్రయోజనాలుంటాయి. లాభాలు తమకు సంతృప్తి నివ్వకపోవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమ మంగళ వారాల్లో భాగస్వామ్యాల్లో కొన్ని ఒత్తిడులు. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య సమస్యలు. ఊహించని సంఘటనలు. అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. కొత్త పనులను వాయిదా వేయాలి. వ్యతిరేకతలు ఇబ్బంది పెడతాయి. నైరాశ్య ధోరణి. సంతాన సమస్యలు. బుధ గురువారాల్లో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. విద్యాత్మక, ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. వ్యాపారాదుల్లోనూ గుర్తింపు. భాగస్వామ్యాలు సంతృప్తినిస్తాయి. పరిచయాలు, అనుబంధాలకు అనుకూలం. శారీరక ఒత్తిడులు. తొందరపాటు కూడదు. శుక్ర శనివారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. శ్రమతో గుర్తింపు. అధికారిక వ్యవహారాల్లో తలమునకలవుతారు.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమ మంగళ వారాల్లో వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. ఆలోచనల్లో ఒత్తిడులు అధికం. వ్యర్థమైన ఖర్చులు, ప్రయాణాలకు అవకాశం. కొంత నిరాశ. శ్రమతో సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. ఊహించని సంఘటనలు, అప్రమత్తంగా మెలగాలి. వ్యాపార వ్యవహారాల్లో నూతన నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. వ్యతిరేకతలుంటాయి. వ్యర్థమైన ప్రయాణాలు. శుక్ర శనివారాల్లో అన్ని కార్యక్రమాల్లో అనుకూలత. లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణలో సంతృప్తి. గుర్తింపు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆది సోమ మంగళ వారాల్లో ఆలోచనలకు రూపకల్పన. వ్యతిరేకతలు అధికం. పోటీలు, ఒత్తిడులు, చికాకులు తప్పకపోవచ్చు. పోటీ రంగం ప్రభావితం చేస్తుంది. తొందరపాటు కూడదు. ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నా కొంత నిరాశ తప్పకపోవచ్చు. ఆలోచనల్లో విపరీత ధోరణులు. అనుకోని ఒత్తిడులు. బుధ గురు వారాల్లో సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యాపార భాగస్వామ్యాల్లో అనుకూలత. అభీష్ట సిద్ధి. సంతాన వ్యవహారాలపై దృష్టి. ఆలోచనలకు రూపకల్పన. లక్ష్యాలను సాధిస్తారు. అన్ని పనుల్లో ఆర్థిక ప్రయోజనాలు. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

--డాక్టర్ సాగి కమలాకరశర్మ