S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొటిమలకు మూలికా వైద్యం

(గత సంఛిక తరువాయ)
ముఖానికి నువ్వుల నూనె రాసుకోవడం మంచిదే! కానీ, నూనె రాసుకున్నాక తప్పనిసరిగా నలుగు పెట్టి, ఆ జిడ్డును వదిల్చేయాలి. షాంపూతోనో సబ్బుతోనో ఆ జిడ్డును కడిగేద్దామనుకోవటం సరికాదు. శనగపిండి లేదా పెసరపిండితో వనమూలికలు కలిపి చేసిన సున్నిపిండితో ముఖానికి తరచూ నలుగు పెట్టుకొని, ఆ నలుగుని వలిచేయాలి. మనకు పండుగలు ఎక్కువ కాబట్టి, పండుగ రోజు నలుగు పెట్టుకుని తలంటి పోసుకోవడమనేది ఇలాంటి మొటిమల బాధ రాకుండా ఉండటానికే!
మొటిమల మీద పనిచేసే కొన్ని నిరపాయకరమైన వన మూలికల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. కచ్చూరాల వలన మొటిమల నివారణ ఎలా సాధ్యమవుతుందో చూద్దాం.
సౌందర్య సాధక మూలికల్లో కచ్చూరాలు ముఖ్యమైనవి. తెల్ల పసుపుగా ఇది ప్రసిద్ధి. ళఖూషఖ్ఘౄ చీళజ్య్ఘూజ్ఘ అనేది దీని వృక్షనామం. మామిడి అల్లం కొమ్ములాగానే కనిపిస్తుంది. చక్రాల్లా తరిగి ఎండించిన కచ్చూరం మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతుంది. ఇది చేదుగా కర్పూరం వాసన కలిగి ఉంటుంది. ఒకప్పుడు అల్లప్పచ్చడి లాగా కచ్చూర దుంపలతో ఊరగాయ పెట్టుకునేవాళ్లట. కొన్ని దేశాల్లో ఈ దుంపని కూరగా వండుకుంటారు కూడా!
ఈ దుంపల్లో జెడోరియా అనే ఎస్సెన్షియల్ ఆయిల్ ఉంటుంది. అది అనేక వైద్య ప్రయోజనాలకు కారణం అవుతోంది.
కచ్చూరాలకు వాపు తగ్గించే గుణం ఉంది. మొటిమలు కొందరిని తీవ్రంగా బాధిస్తుంటాయి. పొక్కిపోయి, ఎర్రగా వాచిపోయి నొప్పిపోటు పెడుతున్న వాళ్లకు కచ్చూరాలు కడుపులోకి తీసుకోదగిన ఔషధం. కచ్చూరాలను మిక్సీ పట్టి మెత్తని పొడిని తేనె కొద్దిగా కలిపి బఠాణీ గింజలంత మాత్రలు చేసుకుని ఆరబెట్టుకోండి. పూటకు రెండు మాత్రలు చొప్పు తీసుకుంటే మొటిమల్లో వాపు తగ్గుతుంది. నొప్పి తగ్గుతుంది. ఇన్‌ఫెక్షన్లను తగ్గించే గుణం కూడా దీనికుంది. లేదా పావుచెంచా కన్నా తక్కువ పొడిని పాలలో వేసి టీలాగా కాచుకుని తాగవచ్చు.
చర్మాన్ని మృదువుగానూ కాంతివంతంగానూ చేసే గుణం కూడా దీనికుంది.
లివరుని శక్తిమంతం చేసి రక్తదోషాలను నివారిస్తుంది. అందువలన మొటిమలు త్వరగా తగ్గుతాయి.
గర్భాశయాన్ని పోషించే గుణంతోపాటు నెలసరి సమస్యలను కూడా సరిచేసే గుణం కచ్చూరాలకుంది. యువతులు తరచూ కచ్చూరాలను తక్కువ మోతాదులో వాడుతూ ఉంటే హార్మోన్ల ప్రభావాన వచ్చే మొటిమల తీవ్రత, అధిక రుతు రక్తస్రావం, నెలసరి సరిగా రాకపోవటం, సమయానికి రాకపోవటం, ఆ మూడు రోజులూ కడుపునొప్పి, నడుము నొప్పి లాంటి బాధలు కూడా దీనివలన తగ్గుతాయి. మొటిమలు రావటం తగ్గుతుంది.
కచ్చూరాల పొడిని రోజూ తీసుకుంటే, జీర్ణశక్తి మెరుగు పడుతుంది. అందువలన ముఖానికి జిడ్డు తగ్గుతుంది. జిడ్డు తగ్గటంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు తగ్గుతాయి.
కచ్చూరాలకు ఎలర్జీని తగ్గించే గుణం కూడా ఉంది. ఎలర్జీ కారణంగా ముఖం మీద, శరీరంలో ఇతర భాగాల మీద వచ్చే అనేక చర్మవ్యాధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొటిమలు దురద పెట్టటాన్ని కచ్చూరాలు తగ్గిస్తాయి.
కచ్చూరాల ముక్కల్ని కొబ్బరి నూనెలో వేసి ఉంచుతారు. వీటి వలన ఆ నూనెకు ఒక విధమైన పరిమళం వస్తుంది. ఈ నూనె రాసుకుంటే వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com