S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వివేకం నిండిన ప్రేమ

సాది కవి గురించి ఈ కథ చెబుతారు.
సాదీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. తన జీవితంలో ఆయన ఆ అమ్మాయికి అపూర్వమయిన స్థానమిచ్చాడు. అతను ఆ అమ్మాయి కోసం ఎన్నో చేశాడు.
ఒకరోజు సాదీ ఆ అమ్మాయి కోసం వచ్చాడు. అతని కళ్లను అతను నమ్మలేక పోయాడు. కారణం ఆ అమ్మాయి ఇంకొక వ్యక్తి కౌగిలిలో కనిపించింది. నిశ్శబ్దంగా బయటికి వచ్చి ఇంటి గేటు ముందు నిల్చున్నాడు. ఆ అమ్మాయితో వున్న వ్యక్తి ‘అతను ఈర్ష్యతో ఉడికిపోతున్నట్లున్నాడు. నా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు బయట ఎదురు చూస్తున్నట్లున్నాడు. నన్ను చంపుతాడేమో’ అనుకున్నాడు.
కానీ సాదీ ఆ వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి భయపడుతూ సాదీ దగ్గరకు వచ్చాడు. సాదీ ‘మిత్రమా! ఆందోళన పడవద్దు. నేను కేవలం నీకొక మంచి సలహా ఇవ్వడం కోసం ఇక్కడ ఎదురుచూస్తున్నాను. లేకుంటే నిశ్శబ్దంగా ఇక్కడి నించి నిష్క్రమించేవాణ్ణి. నేను నీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను ఇప్పుడు వౌనంగా వెళ్లిపోతున్నాను. నువ్వు ఆ అమ్మాయిని ఇంకొకరి కౌగిలిలో చూసినపుడు కూడా ఇంతే శాంతిగా, వౌనంగా వెళ్లిపో’ అని చెప్పాడు.
ఆ వ్యక్తి ముఖం వెలవెలబోయింది.

- సౌభాగ్య 9848157909