S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నడివయసులోనూ మొటిమలొస్తున్నాయా?

ఫ్రశ్న: నా వయసు 48 సం.లు. ముఖం మీద, ఛాతీ మీద, మెడ మీద, వీపు మీదా ఇప్పటికీ మొటిమలొస్తున్నాయి. ఇవి మొటిమలేనా? ఈ వయసులో కూడా మొటిమలొస్తాయా? నివారణ చెప్పగలరు.
-లక్ష్మణరావు పెళ్లకూరు (కదిరి)
జ: మొటిమల్లో చాలా స్థాయిలున్నాయి. పింపుల్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇలా అనేక పేర్లతో వీటిని పిలుస్తుంటారు. ఇవి నాలుగు రకాలుగా వస్తుంటాయి.
చర్మంలోని స్వేద రంధ్రాల ద్వారా అతిగా జిడ్డును స్రవించటం వలన చర్మ రంధ్రాలు పూడుకుపోయి అక్కడ పొక్కులు ఏర్పడతాయి. వీటినే మొటిమలంటారు.
స్వేద రంధ్రాలు జిడ్డుతో పూడుకుపోయినప్పుడు అక్కడ ప్రొపియోని బాక్టీరియం యాక్నే అనే బాక్టీరియా చేరి పొక్కులు పుండుపడి చీము పడతాయి.
చర్మ కణాలు పాతవి నశించి వాటి స్థానంలో కొత్త కణాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తాయి. ఇది నిరంతరంగా జరిగే ఒక జీవప్రక్రియ. పొక్కుల దగ్గర మరణించిన కణాలు పెరిగిపోయి పొక్కులు బెరళ్లు కడుతుంటాయి.
మొటిమల దగ్గర వాపు, మంట పుట్టడం జరిగి బాధ పెడుతుంటాయి.
మొటిమల నివారణకు జిడ్డును తగ్గించుకోవటం అనేది మొదటి చర్య. జిడ్డు ఎక్కడిది? మన ఆహారంలోదే! కొవ్వు పదార్థాల విషయంలో మొటిమలొచ్చే వయసులో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని దీని భావం. ముఖం మీద జిడ్డు పేరకుండా రోజుకు మూడు నాలుగుసార్లు కడుక్కుంటూ ఉండండి. జిడ్డు, దుమ్ము కలగలసి మొటిమలకు కారణం అవుతాయి. ముఖప్రక్షాళన జిడ్డునీ, మురికిని కూడా శుభ్రం చేస్తుంది. అలాగని గంట గంటకీ సబ్బునో ఇతర డిటర్జెంట్లనో ముఖానికి పట్టించటం కూడా మంచిది కాదు. ముఖం జిడ్డుని కోల్పోయి చర్మం ఎండి శుష్కించినట్టు అయిపోతుంది. ముఖం కడుక్కున్నాక మాయిశ్చరైజర్ రాసుకోవటం వలన ఇలా శుష్కత్వం రాకుండా ఉంటుంది.
బీరకాయ పీచు లాంటి స్క్రబ్బర్లను ముఖం మీద అతిగా రుద్దితే చర్మం గాయపడుతుంది. ముఖ చర్మం వాచిపోయి, అక్కడ మొటిమలు వచ్చే అవకాశం ఉంది. జిడ్డును తొలగించటం అంటే అంటగినె్నల్ని తోమటం లాంటిది కాదని గుర్తించాలి.
వారు చెప్పారు, వీరు చెప్పారంటూ ఆవుపేడతో మొదలుపెట్టి ముఖానికి సమస్తమైన అనర్థాల్నీ తెచ్చి పట్టిస్తుంటారు. మొటిమల బాధని తప్పించుకోవటానికి ఏదైనా చెయ్యటానికి సిద్ధపడ్తుంటారు. ఇవేవీ ఉపయోగపడవు. పైగా కొత్త సమస్యలు తెస్తాయి. ముఖానికి సౌమ్యంగా ఉండేవి తప్ప ఏదీ రాయకండి. రసాయనాలు అసలు వాడకండి. ముఖం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని రఫ్ఫాడించకూడదు.
స్వేద రంధ్రాలను తెరుచుకునేలాగానూ, జిడ్డుతో మూసుకుపోకుండానూ జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే దీనికి ఉదాహరణ. అది కడుపులోకి మందులు వేస్తే అయ్యేది కాదు. మన జాగ్రత్తలే వాటిని సాధించాలి.
మొటిమల్ని చిదపకండి. పిండేస్తే పోతాయనుకోవద్దు. గుంటపడి, శాశ్వత అనాకారం ఏర్పడుతుంది. మొటిమ పొక్కులు తగ్గి, మచ్చలు, గుంటలు పడకుండా పుండు మానేలా చేసేందుకు మందులు ఉంటాయి. అవసరం అయితే వైద్యుడు వాటిని వాడిస్తారు. ముఖం మీద వైద్యుని సంప్రదింపు సలహాలు లేకుండా స్వంత ప్రయోగాలు చేయకండి.
సంతానం కలగకుండా ఉండేందుకు వాడే హార్మోన్ టాబ్లెట్లను కొందరు మొటిమలు తగ్గటానికి వాడుతుంటారు. ఇలాంటి ఆలోచనల వలన కొండ నాలుకకు వేసిన మందు ఉన్న నాలికను ఊడగొట్టే ప్రమాదం అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి.
మొటిమల వ్యాధికి ఈనాటి యువతరం అతిగా ఇష్టపడే నక్షత్రం చాక్లెట్లు, కుకీలు, కేకులు, ఐస్‌మ్‌ల్రు, మసాలా కర్రీలు, పిజ్జాల వంటి నిరర్థక ఆహార విషాలు ముఖ్య కారణాలవుతాయి. వాటిని కొనసాగిస్తూ మొటిమలకు స్వంత వైద్యాలు చేసుకోవటం తమ చేటును తాము కొనితెచ్చుకోవటం అవుతుంది.
మొటిమలకు మానసిక ఆందోళనలు కూడా కారణం అవుతాయి. పరీక్షల ఒత్తిడి, ఇంకా ఇతర ఒత్తిళ్లు చదువుకునే యువతీ యువకుల మీద ఎక్కువగా ఉండి, మొటిమలను మరింత ఇబ్బందిపాలు చేస్తాయి. ఇవన్నీ ఎవరికి వారు జాగ్రత్త తీసుకోవలసిన విషయాలు.

(మిగతా వచ్చేవారం)