S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సర్మద్

సర్మద్ గొప్ప సూఫీ సాధువు. గ్వాలియర్‌లో నివసించేవాడు. అప్పుడు ఉత్తర భారతాన్ని ఔరంగజేబు పాలించేవాడు. ఔరంగజేబు చక్రవర్తి సర్మద్‌ని ప్రార్థన కోసం మసీదుకు రమ్మన్నాడు.
ఆ రోజుల్లో ప్రార్థనా సమయానికి మసీదుకి రాకుంటే కఠిన శిక్షకు గురి కావల్సి వుండేది.
సర్మద్ నిత్యం, నిరంతరం పరవశంలో మునిగి వుండేవాడు. అతనికి ఉదయం, సాయంత్రం అని కాదు ప్రతి క్షణం భగవంతునితో సన్నిహితంగా వున్నట్లు భావించేవాడు. దైవ చింతన స్పృహలో వున్నవాడు కనుక అతను చక్రవర్తి కోరికను మన్నించలేదో లేక తిరస్కరించాడో తెలీదు. ఫలానా చోట ప్రార్థన చెయ్యాలన్న నియమం అతనికి లేదు. అతనికి ప్రతి చోటు ప్రార్థనా స్థలమే. దాంతో అతను మసీదుకు వెళ్లలేదు.
ఔరంగజేబు చక్రవర్తి ఆగ్రహించి సర్మద్ తలను ఖండించాడు. ఫలితంగా మొగల్ సామ్రాజ్యం క్షీణించింది. క్రమక్రమంగా పతనమయింది. ఆ కాలంలో అత్యుచ్ఛ స్థితిలో వున్న సామ్రాజ్యం అంతమైంది.

-- సౌభాగ్య 9848157909