S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోపం

ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వముంది. వాళ్లు ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డారు. ఒక వ్యక్తి బలహీనుడు. రెండోవాడు బలవంతుడు. బలవంతుడయిన వ్యక్తి సూఫీ ధర్మాన్ని తెలిసినవాడు.
ఇద్దరూ యుద్ధానికి సిద్ధపడ్డారు. బలహీనుడు తనని బలమైన వ్యక్తి తప్పక చంపేస్తాడని భావించాడు. యుద్ధం మొదలుకాక ముందు బలహీనుడు బలమైన వ్యక్తి ముఖం మీద ఉమ్మేశాడు. బలమైన వ్యక్తి నిగ్రహించుకుని బలహీనుణ్ణి ఏమీ చెయ్యకుండా వెళ్లిపొమ్మన్నాడు.
బలహీనుడు ఆశ్చర్యపోయాడు. ‘నువ్వు అనుకుంటే నన్ను చంపేవాడివి. నన్ను చంపకుండా ఎందుకు వదిలిపెట్టావు?’ అన్నాడు.
బలవంతుడు ‘దానికి కారణమేమిటంటే నీవు చేసిన పని నాలో ఆగ్రహాన్ని రెచ్చగొట్టింది. నిన్ను చంపితే నేను ఆగ్రహానికి లొంగి నిన్ను చంపిన వాణ్ణవుతాను. అంటే నేను కోపానికి బానిస నవుతాను. అది నా నియమానికి విరుద్ధం. అందుకని వెంటనే నా తప్పును తెలుసుకుని నన్ను నేను నిగ్రహించుకున్నాను. నా ఉద్దేశాన్ని అనుసరించి కాక నా కోపాన్ని అనుసరించి నేను ఏదీ నిర్వహించను’ అన్నాడు.

- సౌభాగ్య, 9848157909