S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (17-6-2018 నుంచి 23-6-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం సౌకర్యాదులపై దృష్టి. ఇంటి నిర్వహణ, ప్రయాణాలు, సౌఖ్యం, ఆహారం మొదలైన అంశాలు ప్రభావితం చేస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో ఫలితాలు. సోమ మంగళ వారాల్లో ఆలోచనల్లో అనుకూలత. ఒత్తిడులు తగ్గుతాయి. సంతానవర్గ వ్యవహారాలుంటాయి. సంతోషంగా గడుపుతారు. కొన్ని ప్రయోజనాలు సిద్ధించినా శ్రమ తప్పకపోవచ్చు. బుధ గురువారాల్లో వ్యతిరేకతలు అధికం. పోటీ రంగంలో సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయానికి శ్రమించాలి. ఖర్చులు పెట్టుబడులున్నా హాయిని, సంతోషాన్ని అనుభవిస్తారు. శుక్ర శనివారాల్లో సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాల్లో కొంత జాగ్రత్త అవసరం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం కమ్యూనికేషన్స్‌లో జాగ్రత్త అవసరం. ఇతరుల సహకారం ఆశించడంకన్నా అందించడం మంచిది. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. సోమ మంగళ వారాల్లో శ్రమాధిక్యం. ఇల్లు, వాహనం మొదలైనవి ఒత్తిడులకు గురి చేస్తాయి. ముందు జాగ్రత్తలు అవసరం. సౌఖ్య లోపం. ఆహార విహారాల్లో జాగ్రత్త. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత. సామాజిక గౌరవం. బుధ గురువారాల్లో అభీష్టసిద్ధి. స్పెక్యులేషన్‌కు అనుకూలం. క్రియేటివిటీతో కార్యనిర్వహణ. ఆలోచనలకు రూపకల్పన. కొత్త ప్రణాళికలుంటాయి. లాభాలపై దృష్టి తగ్గించాలి. చిన్నచిన్న సమస్యలు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం మాట తీరులో కొంత జాగ్రత్త అవసరం. నిల్వధనం తగ్గిపోయే సూచనలు. దానధర్మాలు మేలు. అనుకోని సంఘటనలు. ఊహించని పరిణామాలు. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. సోమ మంగళవారాల్లో కమ్యూనికేషన్స్ కొంత అనుకూలం. అధికారుల సహకారం లభిస్తుంది. శ్రమ తప్పకపోవచ్చు. దూర ప్రయాణాదులు, ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత. అనుబంధాల్లో కొంత ఒత్తిడి. బుధ గురువారాల్లో ఆహార విహారాలపై దృష్టి. సౌకర్యాలు పెంచుకుంటారు. సౌఖ్యంగా గడుపుతారు. విందులు, వినోదాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శ్రమతో గుర్తింపు. తెలివిగా ప్రవర్తిస్తారు. గౌరవం పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటుంది. అనేక కార్యక్రమాల బాధ్యతలు, నిర్వహణలో శ్రమ ఉన్నా సంతోషం. బిజీగా గడుపుతారు. పరిచయాల్లో జాగ్రత్తలు అవసరం. సోమ మంగళ వారాల్లో మాట తీరులో అధికారిక ధోరణి. మాటవల్ల కొంత సమస్య. ఖర్చులు ఉంటాయి. ఆర్థిక నిర్వహణపై దృష్టి. కుటుంబం కోసం కాలం, ధనం వెచ్చించాల్సి ఉంటుంది. అనుకోని ఒత్తిడులున్నా అధిగమిస్తారు. కొత్త పనుల వాయిదా మంచిది. బుధ గురువారాల్లో కమ్యూనికేషన్స్‌లో జాగ్రత్త. వ్యాపార వర్గ సహకారం ఆశించినంత అందకపోవచ్చు. ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాల్లో పాల్గొంటారు. శుక్ర శనివారాల్లో సౌఖ్య లోపం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం ఖర్చులు, పెట్టుబడులుంటాయి. విందులు, వినోదాలు, విహార యాత్రలకు అవకాశం. సంతోషంగా, సౌఖ్యంగా గడుపుతారు. ప్రయోజనాలుంటాయి. సోమ మంగళవారాల్లో ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనేక కార్యక్రమాలు, బాధ్యతలుంటాయి. కార్యనిర్వహణలో తలమునకలు అవుతారు. పెద్దల అనుగ్రహం, పితృవర్గ అనుకూలత, లాభాలు సంతోషాన్నిస్తాయి. బుధ గురువారాల్లో కుటుంబంలో సంతోషం. మాట తీరులో చమత్కారం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆర్థిక నిల్వలు పెరుగుతాయి. అనుకోని సంఘటనలకు అవకాశం ఉంది. శుక్ర శనివారాల్లో సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం అన్ని పనుల్లో ప్రయోజనాలు. లాభాలున్నా కొంత జాగ్రత్త అవసరం. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నించాలి. కార్యనిర్వహణా దక్షత. సోమ మంగళవారాల్లో ఖర్చులు, పెట్టుబడులు తప్పకపోవచ్చు. విందులు వినోదాల వల్ల సామాజిక గౌరవం పెరిగే అవకాశం. అధికారులు, పెద్దలతో గడుపుతారు. సంతాన వర్గంతో అనుకూలత. ప్రణాళికతో కార్యక్రమాల నిర్వహణ. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో బిజీ అవుతారు. ఉత్సాహంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహార శైలి ఉటుంది. నిర్ణయాదులు మీకు గౌరవం పెంచుతాయి. భాగస్వామ్యాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శుక్ర శనివారాల్లో కుటుంబంలో అనుకూలత.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడులు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సామాజిక గౌరవం నిలబెట్టుకునే ప్రయత్నం. సౌఖ్యంగా గడుపుతారు. ఆహార విహారాలుంటాయి. సోమ మంగళవారాల్లో లాభాల కోసం ప్రయత్నం. ప్రయోజనాల్లో కొంత లోపం ఉండవచ్చు. సుదూర లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. కీర్తి ప్రతిష్ఠలకు అవకాశం. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో సంతోషం. బుధ గురువారాల్లో ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. ఆధ్యాత్మిక, విహార యాత్రలకు అవకాశం. వ్యాపార ప్రయోజనాలుంటాయి. పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తారు. శుక్ర శనివారాల్లో నిర్ణయాదులు సంతృప్తి నిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం కీర్తి ప్రతిష్ఠలు విస్తరించే అవకాశం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణావకాశాలు. ఉన్నత విద్యపై దృష్టి. పరిశోధనలు వెలుగులోకి వస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. సోమ మంగళ వారాల్లో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారులతో జాగ్రత్త. తొందరపాటు కూడదు. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. అప్రమత్తంగా మెలగాలి. ఒత్తిడులుంటాయి. ఆహార విహారాలుంటాయి. బుధ గురువారాల్లో ప్రయోజనాలు కోల్పోవచ్చు. అధిక లాభాలకై ప్రయత్నం వద్దు. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త. నష్టాలకు, లోపాలకు అవకాశం. సంతానవర్గం కోసం ఖర్చులు పెట్టుబడులుంటాయి. ధార్మిక దానాలవల్ల మేలు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం అనుకోని సంఘటనలకు అవకాశం. అనారోగ్య భావనలు. కొత్త నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. వ్యవహార శైలిలో జాగ్రత్త. శ్రమరహిత లాభాలకై ప్రయత్నం. సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లో అనుకూలత. ఉన్నత విద్య, ఆధ్యాత్మిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. లక్ష్యాలను సాధిస్తారు. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడులుంటాయి. బద్ధకం తగ్గించుకోవాలి. సంప్రదింపుల్లో జాగ్రత్త. బుధ గురువారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వ్యాపార భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో అనుకూలత. సంతోషం. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. కొత్త పరిచయాలుంటాయి. స్నేహానుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి. కొత్త పనుల నిర్వహణ. ఆత్మవిశ్వాసం, ఖర్చులు తప్పకపోవచ్చు. సోమ మంగళవారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు, అనారోగ్య లోపాలు. నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్ని పనుల్లోనూ పోటీలు, ఒత్తిడులు, చికాకులుంటాయి. శ్రమాధిక్యం. బుధ గురువారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో సంతృప్తి. విహార యాత్రలుంటాయి. కొంత ఒత్తిడి ఉన్నా పరిశోధనలు వెలుగులోకి వస్తాయి. ఉన్నత విద్యా వ్యవహారాలుంటాయి. గుర్తింపు. శుక్ర శనివారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు ప్రభావితం చేస్తాయి. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. విజయసాధన ఉన్నా శ్రమ అధికవౌతుంది. గుర్తింపు లభిస్తుంది. సోమ మంగళ వారాల్లో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనల్లో కొంత ఆందోళన ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. బాధ్యతలు అధికంగా ఉంటాయి. బుధ గురువారాల్లో అనుకోని వ్యాపార సమస్యలు. మానసిక ఒత్తిడులు. శ్రమ రహిత ప్రయోజనాలను ఆశించవచ్చు. నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. కుటుంబంలో అనుకూలత. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. శుక్ర శనివారాల్లో కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. కొత్త పనుల ప్లానింగ్ ఉంటుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సోమ మంగళవారాల్లో వ్యతిరేక ప్రభావాలు అధికం. విజయసాధన. గుర్తింపు లభిస్తుంది. సౌఖ్యం లోపించవచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్త. శ్రమాధిక్యం. ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. బుధ గురువారాల్లో పరిచయాలు, అనుబంధాలు విస్తరించే అవకాశం. కొత్త వారితో జాగ్రతత. వ్యాపార భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. సౌఖ్యం కోసం ప్రయత్నిస్తారు. సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ