S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కీళ్లవాతానికి మందు

ఫ్రశ్న: నాకు 70 ఏళ్లు. ఈ వయసులో కీళ్లనొప్పులు సహజం కదా! మందుల్లేకుండా ఈ నొప్పుల్ని తగ్గించుకోవటానికి ఏవైనా ఉపాయాలున్నాయా?
జ: కీళ్లనొప్పులు ముసలితనంలో మాత్రమే వస్తాయనుకోవటం అపోహ. మనుషులందరికీ కీళ్లనొప్పులు సహజమే! మనిషి తనను తాను మరింత ఉత్సాహంగా నడుపుకోవటానికి అడ్డుగా ఉన్నవి కీళ్లనొప్పులే! ఆ అడ్డు తొలగించుకోవాలంటే మరింత యాక్టివ్‌గా ఉండటానికి ప్రయత్నించటమే పరిష్కారం. మందుల్లేని మాట నిజమే! మందుల మీద ఆధారపడకుండా నొప్పుల్ని అదుపులో పెట్టుకోవాలనుకోవటం మంచి ఆలోచనే!
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కీళ్లవాతానికి ముఖ్య చికిత్సా సూత్రం. మనోబలానికి మించిన వైద్యం లేదు. ఈ వ్యాధిని ఎలాగైనా తగ్గించుకోవాలనే గట్టి పట్టుదల ఉంటేనే కీళ్లవాతం తగ్గటం అనేది మొదలౌతుంది. పెన్సిల్వేనియా రాష్ట్ర విశ్వవిద్యాలయం 135 మంది కీళ్లవాత రోగుల మీద చేసిన ఒక పరిశోధనలో ఈ విషయాన్ని నిరూపించారు.
ఆత్మవిశ్వాసం స్థాయి వ్యక్తిలో ఎక్కువగా ఉన్న రోజున ఆ వ్యక్తి నొప్పులు తక్కువగా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. కీళ్ల వాతాన్ని తగ్గించుకోవటానికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దైనందిన జీవన కార్యక్రమాలలో మరింత యాక్టివ్‌గా ఉండడానికి కావలసినంత పాజిటివ్ ప్రభావాన్ని ఈ ఆత్మవిశ్వాసం అందిస్తుంది.
ఇవ్వాళ పనెక్కువగా ఉంటుంది, నేను చేయలేను - అని దిగాలు పడితే తగ్గిన నొప్పులు కూడా తిరగబెడతాయి. ఇవ్వాళ ఈ పనులన్నీ పూర్తి చేసేస్తాననే ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగలిగినప్పుడు నొప్పిని ప్రేరేపించే సంకేతాలను పంపే మెదడు మీద దాని ప్రభావం తప్పక ఉంటుంది. విశ్రాంత జీవితంలోకి వచ్చేసిన వయోవృద్ధుల్లో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లోపించటం, ఉత్సాహంగా ఉండే అనుకూల వాతావరణం కరువు కావటం వలన వార్థక్యంలో కీళ్లవాత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సానుభూతి కోరుకోవటం, ఆత్మవిశ్వాసాన్ని జారవిడుచుకోవటం, ఆధారపడే తత్త్వం వీటి వలన నడివయసు మహిళల్లో కూడా కీళ్లవాతం ఎక్కువగా కనిపిస్తుంది.
ఇది నేను చేసెయ్యగలననే తత్వానే్న అలవాటు చేసుకోవాలి. ‘నా వల్ల కాదు’ అనే ధోరణి కీళ్లనొప్పుల్ని ముఖ్యంగా నడుము నొప్పి, మెడనొప్పి, మైగ్రేన్ తలనొప్పి లాంటివి కలగటానికి కారణం అవుతుంటుంది.
మనకు ఇష్టమైన చుట్టాలు వస్తున్నారంటే ఎక్కడలేని ఓపికా కూడుకొస్తుంది. మనకిష్టంలేని వ్యక్తి వస్తున్నారంటే సేవలు చేసే ఓపిక లేదనిపిస్తుంది. ఇది మానవ సహజం. మనసు ఆడించే ఆట! చింత, శోకం, కోపం, భయం, దుఃఖం, అసూయ, ఆందోళన, దిగులు ఇలాంటి మానసిక ప్రవృత్తులు తక్షణం వాతాన్ని పెంచుతాయి. ఎంత తక్షణం అంటే ‘ఆల్ మోస్ట్ సైమల్‌టేనియస్’గా వాతం పెరుగుతుంది.
మైకు ముందు మాట్లాడటం అలవాటులేని వ్యక్తికి అకస్మాత్తుగా మైకిచ్చి మాట్లాడమంటే దడ, వణుకు, వెన్నులో నొప్పి లాంటి లక్షణాలు కలుగుతాయి. మనసులో భయం కలగగానే మనిషి మీద కలిగిన లక్షణాలివి. ఇదే వాతం పెరగటం అంటే! ఈ నెగెటివ్ ఆలోచన స్థానంలో సంతృప్తి, సంతోషం, ఆత్మవిశ్వాసం చోటు చేసుకున్నప్పుడు మనసు వాతాన్ని అదుపు చేస్తుంది. అందువలన సమర్థత పెరుగుతుంది. శరీరం ఉత్సాహవంతం అవుతుంది. వాతం ఉపశమిస్తుంది. నొప్పులు తగ్గుతాయి. ఆయుర్వేద శాస్త్రం ఈ సూత్రాన్ని ఏనాడో చెప్పింది. ఆధునిక శాస్తవ్రేత్తలు దీనిపైన విశేషంగా పరిశోధిస్తున్నారు.
కీళ్ల వాతం రావటానికి దాని కారణాలు దానికుంటాయి. కీళ్లలో అనేక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. కానీ, అక్కడ నొప్పిని ప్రేరేపించేది మాత్రం వాతమే! నొప్పిని లేదా వాతాన్ని ప్రేరేపించే అంశాల్ని జళూజశ ఘషఆ్యఒ అంటారు. నెగెటివ్ ఆలోఛనా విధానం వీటిలో ఒకటి. దానిలోంచి బయటపడటమే కీళ్లవాతానికి విరుగుడు.
అమెరికన్ సీనియర్ సిటిజన్లలో 1/3 వంతు మంది తీవ్రమైన ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్నారని శ్రీడ జఒళ్ఘఒళ ళ్యశఆ్య ఘశజూ -ళ్పళశఆజ్యశ ళళశఆళ వాళ్లు ఒక నివేదికలో పేర్కొన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలు లేని మన దేశంలో ఈ రోగుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటోంది. మందులు, తగిన వ్యాయామం, ఆహార జాగ్రత్తలకు మనసు జాగ్రత్త కూడా ఒక ముఖ్యమైన అంశం అని అర్థం చేసుకోవాలి.
మీ ఆత్మవిశ్వాసమే మీ కీళ్లనొప్పుల్ని మాన్పించే మందు.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com