S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం -- (13-5-2018 నుంచి 19-5-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమ మంగళ వారాల్లో నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం. ఉత్సాహంగా వ్యవహరిస్తారు. కార్యనిర్వహణకు అనువైన కాలం. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. పరిచయాలు, అనుబంధాల వల్ల కొంత ఒత్తిడులకు అవకాశం. అయినా సంతోషంగా గడుపుతారు. బుధ గురువారాల్లో కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక నిర్ణయాదులు ఇబ్బంది పెట్టవచ్చు. శ్రమ రహిత ఆదాయంపై దృష్టి. నిర్ణయాదులు వాయిదా వేసుకోవడం మంచిది. శ్రమతో కార్యనిర్వహణ. శుక్ర శనివారాల్లో సంప్రదింపులకు అనుకూలం. వ్యాపార వ్యవహారాల్లో శ్రమ తప్పకపోవచ్చు. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఉన్నత వ్యవహారాలు, ఆధ్యాత్మికాంశాలు ప్రభావితం చేస్తాయి. విహార యాత్రలకు అవకాశం. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆది సోమ మంగళ వారాల్లో ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వ్యర్థంగా కాలం, ధనం కోల్పోయే అవకాశం. తొందరపాటు కూడదు. విశ్రాంతి లోపం ఉంటుంది. వ్యతిరేకతలను అధిగమిస్తారు. పోటీలు ఒత్తిడులున్నా గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. బుధ గురువారాల్లో నిర్ణయాదుల్లో అనుకూలత. అన్ని పనుల్లో సంతృప్తి. ఆనందంగా, సంతృప్తిగా గడుపుతారు. నూతన కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ. కొత్త పరిచయాల వల్ల సమస్యలు. వైవాహిక, భాగస్వామ్య అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. శుక్ర శనివారాల్లో వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. కుటుంబంలో ప్రశాంతత. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపు. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. వ్యతిరేకతలు, ఇబ్బందులను అధిగమించాలి. మాటల్లో జాగ్రత్త.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆది సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలను ఆశిస్తారు. ఆశించిన ఫలితాలు లభించక ఇబ్బంది పడే సూచనలు. పెద్దల ఆదరణ తగ్గవచ్చు. సంతానంతో సంతోషంగా గడపండి. కొత్త ప్లానింగ్‌కు మంచిది. నూతన కార్యక్రమాలకు రూపకల్పన. సృజనాత్మకత పెరుగుతుంది. బుధ గురువారాల్లో విందులు, వినోదాల కోసం పెట్టుబడులుంటాయి. విహార యాత్రలకు అనుకూలం. సంతోషంగా గడుపుతారు. వ్యతిరేకతలు కొన్ని ఎదురైనా విజయం సాధిస్తారు. పోటీ తత్త్వానికి దూరంగా మెలగండి. విజయ సాధనకు ప్రయత్నం చేయండి. శుక్ర శనివారాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని కార్యక్రమాల నిర్వహణకు అనుకూలం. వ్యాపార వ్యవహారాల్లో ముందు చూపు ఉంటుంది. పరిచయాలు, భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. కొత్తవారితో సమస్యలు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆది సోమ మంగళ వారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో గుర్తింపు. సామాజిక గౌరవం విస్తరిస్తుంది. అధికారిక వ్యవహారాలకు, పదోన్నతులకు అవకాశం. పితృవర్గ కార్యక్రమాలపై దృష్టి. సౌకర్యాలపై మనసు ఉంటుంది. ఆహార విహారాలు సమయానికి సమకూరక పోవచ్చు. సౌఖ్యం కోసం ప్రయత్నం. బుధ గురువారాల్లో పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. కోరుకున్న ప్రయోజనాలు అందకపోవచ్చు. లాభాలు సాధించడానికి శ్రమ తప్పదు. మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. కొత్త వ్యవహారాలపై దృష్టి. శుక్ర శనివారాల్లో ఖర్చులు, పెట్టుబడుల్లో జాగ్రత్త. తొందరపాటు వల్ల ఆసుపత్రులు, పరామర్శలుంటాయి. వ్యాపార లోపాలకు అవకాశం. పోటీలుంటాయి. విజయం సాధించినా ఒత్తిడి తప్పదు. వ్యతిరేకతలను అధిగమించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆది సోమ మంగళ వారాల్లో లక్ష్యాలను సాధించే ప్రణాళికలుంటాయి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. కార్యనిర్వహణలో సంతృప్తి. కీర్తిప్రతిష్టలు విస్తరిస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. దైవ సహకారం కోసం ఇతరులకు మనం సహకరించాల్సి వుంటుంది. ధార్మిక కార్యక్రమాలు, బుధ గురువారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణ అధికం. అధికారుల వత్తిడులుంటాయి. పదోన్నతుల్లో ఇబ్బందులు. గౌరవం తగ్గే సూచనలు. ఆహార విహారాల్లో అనుకూలత. గృహ వాహనాది సౌకర్యాలు, సౌఖ్యాలపై దృష్టి. శుక్ర శనివారాల్లో వ్యాపార ప్రయోజనాల్లో ఇబ్బందులు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. లాభాలపై ప్రత్యేక దృష్టి. కొత్త ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. సంకల్పాలు, నిర్ణయాదులకు అనుకూలం. సంతానవర్గ వ్యవహారాలుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు, శ్రమ అధికం. నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. ఊహించని సంఘటనలు. కుటుంబ ఆర్థికాంశాల్లో ఆలోచించి ముందడుగు వేయాలి. మాటల్లో కొంత జాగ్రత్త అవసరం. శ్రమతో కార్యాలు. బుధ గురువారాల్లో అన్ని కార్యక్రమాల్లో సంతృప్తి. నూతన వ్యవహారాలు. కీర్తి ప్రతిష్ఠలకు అవకాశం. వినోద విహార యాత్రలుంటాయి. సంప్రదింపుల్లో కొంత ఒత్తిడికి అవకాశం. సోదరవర్గ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శుక్ర శనివారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కార్యక్రమాలు సంతోషాన్నిస్తాయి. శ్రమ ఉన్నా గుర్తింపు, గౌరవాలుంటాయి. ఆహార విహారాలున్నా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమ మంగళవారాల్లో పరిచయాలు స్నేహానుబంధాల్లో ఒత్తిడులు. భాగస్వాములతో సంతోషంగా గడిపే ప్రయత్నం. అన్ని పనుల్లోనూ శ్రమతో ఫలితాలుంటాయి. నిర్ణయాదుల్లో అనుకూలత. కొత్త పనులకు శ్రీకారం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ప్రవర్తించాలి. కార్యక్రమాల నిర్వహణ, రూపకల్పన, బుధ గురువారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలకు, అనారోగ్య లోపాలకు అవకాశం. ఊహించని ఇబ్బందులు. శ్రమరహిత లాభాలపై దృష్టి. కుటుంబ ఆర్థికాంశాల్లో ఇబ్బందులు, బంధువర్గ సమస్యలు, శుక్ర శనివారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. అన్ని పనుల్లో అనుకూలత. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. దూర ప్రయాణ భావన. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. సహకారం కోసం ప్రయత్నించాలి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమ మంగళవారాల్లో వ్యతిరేక ప్రభావాలు అధికం. శత్రు రోగ రుణాదులు ఇబ్బంది పెట్టినా అధిగమిస్తారు. కార్యనిర్వహణలో అనుకూలత. పోటీ రంగంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. ధార్మికమైన ఖర్చులు పెట్టాల్సి వుంటుంది. ప్రయాణాదుల్లో ఒత్తిడులుంటాయి. బుధ గురువారాల్లో పరిచయాలు పెంచుకునే ప్రయత్నం. అనుబంధాలతో ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులపై దృష్టి. శుక్ర శనివారాల్లో అనుకోని వ్యాపార సమస్యలు. క్రియేటివిటీ తగ్గిపోవచ్చు. వ్యవహారాల నిర్వహణలో జాగ్రత్త. కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో కొంత అనుకూలత. మాట విలువ తగ్గే సూచనలు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమ మంగళ వారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గంతో సంతృప్తి. కొత్త కార్యక్రమాల రూపకల్పన. ప్లానింగ్‌కు అనుకూలత. లాభాలపై దృష్టి ఉన్నా ఆశించినంతగా లభించకపోవచ్చు. ప్రయోజనాలు కొంత సంతృప్తినిస్తాయి. పెద్దల ఆశీస్సులు. బుధ గురువారాల్లో వ్యతిరేక ప్రభావాలు అధికం. శత్రువులు పెరిగే అవకాశం. రుణాలపై దృష్టి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. గుర్తింపు కోసం ప్రయత్నం. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. ప్రయాణాలుంటాయి. విశ్రాంతి లోపం. శుక్ర శనివారాల్లో కొత్త పరిచయాలు. వ్యాపారాల్లో అనుకూలత. నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులున్నా వ్యవహారాల్లో విజయ సాధన. వ్యాపారానుబంధాల్లో జాగ్రత్త అవసరం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమ మంగళ వారాల్లో సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. సౌఖ్యం కోసం శ్రమిస్తారు. ఆహార విహారాల్లో ఇబ్బందులు. గృహ వాహనాదులు ఇబ్బందులకు గురి చేస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. శ్రమతో గౌరవం. గుర్తింపు. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. బుధ గురువారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మక వ్యవహారాలు లాభాలున్నా ఆశించిన సంతోషం లభించదు. అన్ని పనుల్లో ప్రయోజన దృష్టి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. శుక్ర శనివారాల్లో వ్యతిరేకతలు అధికవౌతాయి. శత్రు, రుణ, రోగాదుల ఇబ్బందులున్నా శ్రమతో అధిగమిస్తారు. గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. విశ్రాంతి లోపం. తొందరపాటు కూడదు. పరామర్శలుంటాయి.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమ మంగళవారాల్లో సంప్రదింపులపై దృష్టి. ఇతరుల సహకారం ఆశించడంకన్నా ఇతరులకు సహకరించడం మంచిది. సోదర వర్గ వ్యవహారాల్లో ఒత్తిడులు. ఉన్నత వ్యవహారాల నిర్వహణపై దృష్టి. ప్రయాణాదులకు అవకాశం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శుభ పరిణామాలు. బుధ గురువారాల్లో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు అధికం. అనేక కార్యక్రమాల నిర్వహణ వల్ల శ్రమ తప్పకపోవచ్చు. గౌరవం పెరుగుతుంది. శుక్ర శనివారాల్లో ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి. సృజనాత్మక వ్యవహారాలుంటాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. సర్దుబాటు మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆది సోమ మంగళవారాల్లో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. మాట విలువ పెరుగుతుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. అనుకోని సమస్యలుంటాయి. శ్రమతో అధిగమిస్తారు. కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. దైవ దర్శనం వల్ల మేలు. బుధ గురువారాల్లో సంప్రదింపుల్లో ఒత్తిడులు. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త వహించాలి. సహకార లోపాలు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. అనేక కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం. కీర్తిప్రతిష్టలపై దృష్టి. శుక్ర శనివారాల్లో సౌఖ్య లోపాలకు అవకాశం. శ్రమతో ఆహార విహారాల సాధన. గృహ వాహనాదులు శ్రమకు గురి చేస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతికి అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సామాజిక గౌరవం లభ్యం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ