S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (29-4-2018 నుంచి 5-5-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమ వారాల్లో కొత్త పరిచయాల వల్ల ఒత్తిడులు, సమస్యలు, కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త. కొత్త పనుల నిర్వహణ. ధైర్యం. వ్యవహారాల్లో విజయం. వైవాహిక, భాగస్వామ్య అనుబంధాలు సంతోషాన్నిస్తాయి. మంగళ బుధ గురువారాల్లో అప్రమత్తంగా మెలగాలి. కొత్త పనులను, నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. అనుకోని సంఘటనలు, అనారోగ్య లోపాలు, మాటల వల్ల సమస్యలకు అవకాశం. ఆర్థిక ఒత్తిడులు, అసంతృప్తి. శ్రమ రహిత సంపాదన కోసం ప్రయత్నం. కాలం, ధనం, శ్రమ వ్యర్థమయ్యే సూచనలు. శుక్ర శనివారాల్లో ఆధ్యాత్మిక, దూర ప్రయాణ భావనలు. సంతృప్తి. సంప్రదింపుల్లో జాగ్రత్త. నూతన వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత కార్యక్రమాల నిర్వహణ. ఇతరులకు సహకారం అందించడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆది సోమవారాల్లో పనుల్లో ఇబ్బందులు. అన్నింటిలో పోటీ తత్వం. వ్యతిరేకతలు అధిగమించే ప్రయత్నం. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. కాలం, ధనం వ్యర్థమయ్యే సూచనలు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. మంగళ బుధ గురువారాల్లో అనుబంధాల్లో జాగ్రత్త వహించాలి. పరిచయాలు శ్రమకు గురి చేయవచ్చు. వైవాహిక అనుబంధాల్లో జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయాదుల్లో అనుకూలత. కొన్ని పనుల్లో ఒత్తిడులు, ప్రమాదవకాశాలు. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. వ్యవహార లోపాలు. ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. పెద్దలతో పోటీలకు అవకాశం. కుటుంబ, ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాటల్లో కొంత అనుకూలత. నిల్వధనం పెంచుకునే ఆలోచనలు. శ్రమతో కార్యనిర్వహణ.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆది సోమ వారాల్లో ఆలోచనలకు రూపకల్పన. మనస్సు సంతోషంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలుంటాయి. అన్ని పనుల్లో ప్రయోజనాల కోసం ప్రయత్నం. లాభాలు రాక సమస్యలుంటాయి. సంతాన వర్గంతో సంతోషం. సృజనాత్మకతతో వ్యవహరిస్తారు. మంగళ బుధ గురువారాల్లో వ్యతిరేకతలు అధికం. పోటీలు, ఒత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. విహారాలు, విందులు వినోదాలకు ఖర్చులు. కొంత అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గే సూచనలు. శుక్ర శనివారాల్లో పరిచయాల్లో ఒత్తిడులుంటాయి. భాగస్వామ్యాల్లో జాగ్రత్త వహించాలి. మానసికమైన సంతోషం. కొత్త పనులపై దృష్టి. నిర్ణయాదుల్లో అనుకూలత. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆది సోమవారాల్లో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాది వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. కొన్ని లాభాలున్నా అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలు. మంగళ బుధ గురువారాల్లో ఆలోచనలకు రూపకల్పన. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ అనుకూలత. కోరికలు తీరుతాయి. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. లాభాలు సంతృప్తినిస్తాయి. ప్రయోజనాలు ఒత్తిడులకు గురి చేస్తాయి. శుక్ర శనివారాల్లో వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులున్నా అధిగమిస్తారు. శ్రమతో కార్యనిర్వహణ. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. వ్యాపార లోపాలకు అవకాశం. ప్రయాణాదుల్లో కొంత జాగ్రత్త వహించాలి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆది సోమ వారాల్లో సంప్రదింపులలో జాగ్రత్త అవసరం. కాంట్రాక్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. సోదర వర్గ భావనలు ప్రభావితం చేస్తాయి. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. ప్రయాణావకాశాలు. ఆధ్యాత్మిక లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. మంగళ బుధ గురువారాల్లో సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాల్లో అనుకూలత. గృహ వాహన వ్యవహారాల్లో సంతృప్తి. సౌఖ్యంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణ. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. శ్రమాధిక్యం. శుక్ర శనివారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. ప్లానింగ్‌కు అనుకూలం. పిల్లల శ్రేయస్సుకు సంతోషం కలుగుతుంది. క్రియేటివిటీ వల్ల గుర్తింపు. లాభాలు ఒత్తిడులకు గురి చేయవచ్చు. ప్రయోజనాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. శ్రమాధిక్యం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమ వారాల్లో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. శ్రమరహిత ధనంపై దృష్టి పెట్టకండి. ఊహించని కొన్ని ఇబ్బందులు పెరిగే అవకాశం. కార్యనిర్వహణలో ఒత్తిడులుంటాయి. మంగళ బుధ గురువారాల్లో సంప్రదింపుల్లో జాగ్రత్త. ఒత్తిడులుంటాయి. దగ్గరి ప్రయాణాదుల్లో సమస్యలు. సోదర వర్గంతో ఘర్షణలకు అవకాశం. విహార యాత్రలకు అవకాశం. సుదూర ప్రాంత యాత్రలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠల కోసం ప్రయత్నం. శుక్ర శనివారాల్లో సౌకర్యాలపై దృష్టి. వాహనాదులతో జాగ్రత్త. ఇంటి పనులపై దృష్టి. శ్రమతో కార్యనిర్వహణ. ఆహార విహారాలపై మనస్సు కేంద్రీకరిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక ప్రదేశాల్లో ఉన్నతి. సామాజికమైన గుర్తింపు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమ వారాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. నూతన కార్యక్రమాల నిర్వహణపై ఆసక్తి. సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు, స్నేహానుబంధాలు శ్రమకు గురి చేయవచ్చు. కొత్త వ్యక్తులతో అధికారులతో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు. మంగళ బుధవారాల్లో కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక సమస్యలుంటాయి. మాటల్లో తొందరపాటు తగ్గించుకోవాలి. ఊహించని సంఘటనలు. కార్యనిర్వహణలో వేగం ఉంటుంది. అప్రమత్తంగా మెలగాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. శుక్ర శనివారాల్లో సంప్రదింపుల్లో ఒత్తిడులుంటాయి. సోదరవర్గ వ్యవహారాలపై దృష్టి. ప్రయాణావకాశాలు. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమ వారాల్లో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. గుర్తింపు గౌరవాదుల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. విశ్రాంతి తగ్గే సూచనలు. ప్రయాణాదుల్లో జాగ్రత్త. వ్యతిరేకతలపై విజయం. శ్రమ ఉన్నా కార్యక్రమాల నిర్వహణ. పోటీలు, ఒత్తిడులు చికాకులను అధిగమిస్తారు. మంగళ బుధ గురువారాల్లో నిర్ణయాదులకు అనుకూలం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. వైవాహికానుబంధాల్లో జాగ్రత్త అవసరం. పరిచయాలు పెంచుకునే ప్రయత్నం. శుక్ర శనివారాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దైవ కార్యక్రమాల కోసం ఆలోచనలుంటాయి. ధార్మిక వ్యవహారాలు. ఆర్థిక నిల్వలపై దృష్టి. కొన్ని అనుకోని సంఘటనలుంటాయి. వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో అప్రమత్తం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమ వారాల్లో లాభాలున్నా సంతృప్తి ఆశించినంత లభించక పోవచ్చు. ప్రయోజన దృష్టి మాత్రం అన్ని పనులపైనా ఉంటుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. నూతన ప్రణాళికలపై దృష్టి. సృజనాత్మకతతో వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. మంగళ బుధ గురువారాల్లో ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణావకాశాలు. మంచి పనుల కోసం కాలం ధనం ఖర్చు అవుతుంది. వ్యతిరేకతలు అధికం. పోటీలలో జాగ్రత్త. ఒత్తిడులను అధిగమించాలి. శ్రమాధిక్యం. శుక్ర శనివారాల్లో నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. సంతోషంగా గడుపుతారు. తొందరపాటు కూడదు. వ్యాపార భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. పరిచయాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. బాధ్యతలు పెరుగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమ వారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలు. చేసే పనుల వల్ల సంతృప్తి. సామాజిక గౌరవం. పదోన్నతి, సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గృహ వాహనాదుల విషయంలో ముందు జాగ్రత్త కావాలి. మంగళ బుధ గురువారాల్లో లాభాలపై దృష్టి. ప్రయోజనాలు ఆశించినంతగా ఉండవు. తొందరపాటు కూడదు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీతో వ్యవహరిస్తారు. సంతానంతో సంతోషం. శుక్ర శని వారాల్లో ధర్మ కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. పెట్టుబడుల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. కార్యనిర్వహణలో శ్రమ ఉన్నా సంతృప్తి ఉంటుంది. విజయసాధన.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమ వారాల్లో లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలుంటాయి. ధార్మిక ప్రయాణాలుంటాయి. వ్యవహార దక్షత. సంప్రదింపుల్లో ఒత్తిడులుంటాయి. సోదర వర్గంతో సమస్యలు. సహకారం ఇతరులకు అందించడం మంచిది. మంగళ బుధ గురువారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో కొంత అనుకూలత. శుక్ర శనివారాల్లో లాభాలు ఒత్తిడులకు గురి చేస్తాయి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. కొంత జాగ్రత్తగా మెలగాలి. సంతోషంగా సంతానంతో కలిసి ఉండే అవకాశాలు. కొత్త ఆలోచనలు. నూతన నిర్ణయాలు, ప్రణాళికలుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆది సోమ వారాల్లో అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. శ్రమతో కార్యక్రమాలుంటాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో అనుకూలత. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. నిల్వధనం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అన్ని విషయాల్లో ముందు జాగ్రత్త అవసరం. మంగళ బుధ గురువారాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అత్యున్నతమైన కార్యక్రమాలపై దృష్టి. దూర ప్రయాణాల సూచన. సంతృప్తిగా వ్యవహరిస్తారు. దైవ, ధార్మిక వ్యవహారాలుంటాయి. సంప్రదింపుల్లో ఒత్తిడులు. సహకారం ఇతరులకు అందించాలి. దైవ సహకారాన్ని మాత్రమే కోరుకోవాలి. శుక్ర శనివారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పదోన్నతులు. సౌఖ్యాలు ఆశించినంతగా లభించకపోవచ్చు. వాహనాది సౌకర్యాలు ఆనందంగా ఉండవు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ