S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్మృతిలయలు....

‘కాల సాగర గర్భమునందు.. గవ్వలు మణులున్ లేవా?
ఏది నీకై సమకూడినదో.. అనుభావ్యమదే కాదా?...
-జననమ్, బాల్యం, శైశవం, వనం, కౌవారం, వృద్ధాప్యం అట్లాగే - స్కూలు, కాలేజీ, ఉద్యోగం, పత్రికలూ, రచన, సంసారం, పిల్లలు - వాళ్ల కోరికలు, వాళ్ల పెళ్లిళ్లు అంటూ రొటీన్‌కొత్త శీర్షిక ప్రారంభం
గా కాలక్రమంగా చెప్పడం మొదలుపెడితే - మీకు ఆవలింతలింత లింతలు వచ్చే ప్రమాదం ఉంది. అదొక ‘క్రైం’ కూడాను. ప్రమోదాలు - ప్రమాదాలు, జయాపజయాలు అంటూ రాతలు కోతలు కథలు నవలలు లోకమూ పాడూ అంటూ మలుపుల్లో మెరుపులు.. మెరుపుల్లో మరకలు, చెబుతాను పట్టణ వాసపు ఘాటు వుంటుంది అవి నాకు బాగా ఎరుకే.. కథలు నవలలు కల్పించి రాసినట్లుగా ఈ సంగతులు చెప్పను మా చెప్పలేను... ఫిక్షను కాదు ఇది. అయితే, విశేషాలను టెంపో కోసం కదా కదన శైలిలో - నొప్పించక తానొవ్వక - తప్పించుకొని’ తిరుగకుండా దొరికిపోతూనే - వాస్తవం వక్కాణించి’ యువర్స్ ఫెయిత్ ఫుల్లీ’గా మిగిలిపోవాలనే వుందండి. అదేనండీ నా ఇది.. చిత్తగించండి.
ఆగక్కడ? ఏమిటి?.. స్పీడ్ బ్రేకరా?.. నువ్వు పోతున్నది వెనక్కి - మనఃకుహర శిథిలాల లోకి.. ఔనా?
వెనక్కి వెళ్లినప్పుడు స్పీడు బ్రేకర్లు ఎందుకుంటాయి? ఇది 2018. వెనక్కి 1950ల లోకి వెళ్లాలి రా అబ్బీ నువ్వు అని మీరు అంటున్నారు కదూ? ఒకే బాస్స్.. అదే దిశా నిర్దేశిని. అవునండీ... వెంటాడే జ్ఞాపకాలని తవ్వి తలకి ఎత్తుకోవాలనే - ప్రయత్నం ఇది. వర్తమానమ్ నుంచి పారిపోయే ఛాన్స్ ఉంటుందేమో గాని గతం నుంచి పారిపోవడం కష్టం... నా మనసుకి రెండు గుండెలు.. ఒక గుండె ఎప్పుడూ గత స్మృతులతో జ్వాలా తోరణాలు కడుతూనే ఉంటుంది. అట్లాగా, నాకు రెండు గుండె కాయలు ముఖ్యమే. ఒక దానిలో జ్ఞాపకాల ‘దడ’ నిరంతరం. కొన్ని మెమోరీలు శిలాక్షరాలే.. ఆది న భోళా శంకరుడు మ్రింగలేక క్కక్కలేక గళమందున దాచుకున్న గరళాన్ని లోపల వుంచుకున్నాడూ అంటే కక్కితే కొంపలు మునిగిపోతాయని.. కాని నా గతం అలాంటి విషం వున్నా అది కక్కేది కాదు..
స్మృతి వేదన లోపల వున్నప్పటికీ మీకు సరదాగా నాకు భారం దిగినట్లుగా చెప్పుకుంటో పోవాలని ఎడిటర్‌గారి కిచ్చిన మాటకి కట్టుబడాలని.. కాల సాగర మధనంలో అందిన మణులనే.. అలాంటి సంగతుల మీదనే.. - అనగా ‘్ఫ్లష్’లు వున్న ‘బ్యాకు’లన్నమాట.. గతానుభవాలు అనుభూతులు అనే వాటితో.. అలా అలా ముడులు విప్పాలని వుంది. విడీవిడని చిక్కులే జీవితం.. ప్రేమకు పగ్గాలే నియంత్రణం.. ఎదిగీ ఎదగని మనుషులు ‘తొలి మలుపులో’ ‘ప్రేమ కోసం’.. సుఖం కోసం’ చేసే అంతులేని పోరాటమే జీవనశైలికి దిశా నిర్దేశమా? కాకపోవచ్చు.. అవ్వొచ్చు - అవి నేను రాసిన కొన్ని నవలలే కావచ్చు కాని, అంతులేని తపన అనే్వషణకి అవే ఊతం - రాసిన పాతిక నవలలూ వందలాది కథలూ - సంఘ జీవన చిత్రాలే అయిన నేను తొంగి చూడకుండా ఎలా వుంటాను - పాలలో కలసిన చక్కెర రీతి - రచయిత చెప్పదల్చుకున్నది వుండాలి తప్ప - సేర్మన్లు స్టేట్‌మెంట్లు లాగా వుండకూడదు.. అదే తపన ఎప్పుడూ...
అక్షరం ముక్కలు పూర్తిగా రాకుండానే.. పేపర్లో (పత్రికల్ని నాడు నేడూ కూడా అలాగేగా అంటాము కదా?!) పడిపోవాలని, అలా పడ్డ తప్పటడుగులు అందరూ చదివేసి - మెచ్చి, నా వీపు మీద శాభాషులు చరవాలని. ఒక పదేళ్ల కుర్రాడికి ఆరాటం ఉన్నదీ అంటే పెద్దలు చెప్పే ‘కీర్తి కండూతి’ అనగా దురద - లేత రూపంలో పడగ ఎత్తింది అనే అనుకోవాలి...
కాని, ఈ జీవిత చరమ ఘట్టంలో నుంచి అరవై అయిదు ఏళ్ల నాటి ప్రథమ ఘట్టంలోకి తొంగి చూస్తూ వుంటే.. అస్తమిస్తున్న సూరీడు నాటి ఉదయభానుడికి జ్ఞాపకాల రంగులు అద్దడానికి సాహసిస్తున్నాడనే చెప్పాలి అయితే అది కేవలం కండూతి కాదు.. ‘తపనా’ కాదు నా ‘బాల్యం’ నాకు తెలీకుండా చేసిన తపస్సు కాబోలు అనిపిస్తోంది.
‘ఆద్మీ కో ఆద్మీ బనానే కేలియే
-శ్యాహీ నహీఁ చాహియే
-ఆన్ఖోఁవాలీ పానీ చాహియే
అంటాడు హిందీ ఆధునిక కవి శైలేంద్ర.
అలాగా, నాలోపల రెండు గుండె కాయలు ఎప్పుడూ - ఒకదానిలో గత గాయాలు గేయాలు కొట్టుకుంటూనే వుంటాయి.. ఆ బరువు తగ్గించుకోవాలి అంటే.. ఇదొక మార్గం!
ఎన్నడో, మన పెద్దలు చెప్పే - వేదవేదాంగాలకన్న మిన్నదయిన - మహా ఐతిహాసిక ఆదికావ్యం ‘రామాయణం’ కరుణరసంలో నుంచే పుట్టింది.
పిట్టల్ని కొట్టడం అన్నది నిన్నటిదాక తను చేసిన పనియే-
ఇవాళ ఒక బోయవాడు చేస్తే, పుట్టలో నుంచి లేచి వచ్చిన మహర్షి పట్టలేని ఆవేదనతో - నేలకొరిగిన క్రౌంచ పక్షి కోసం కన్నీరు కార్చాడు...
కోపాగ్ని రగిల్చాడు
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః
యత్క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం!
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు. ఎందుకంటే క్రౌంచ పక్షుల జంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితే ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం అని అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది అన్నది పెద్దల మాట.
చిన్ననాటి నా అపరిపక్వ మనసుకి అనిపించింది అదే.. గొప్ప కథలన్నీ కష్టాలలో నుంచే పుడతాయి కాబోలు. స్వేచ్ఛగా కవిత్వం రాయడం అంటే ‘కోచ్’ లేకుండా క్రీడలని అభ్యాసం చెయ్యడమే.. అయినా స్వేచ్ఛలో శక్తి వుంది. హాయిగా ఉంటుంది. పైగా సాధన ఫలిస్తే తృప్తి కలుగుతుంది.
సుడిగాలికి బడి ఎక్కడ?
జలపాతం గురువెవ్వరు?
కోకిల గాత్రం సాధన చేసినదెక్కడ?
అది నా చిన్ననాటి ప్రశ్న (1950)
అదీ పదేళ్ల వయస్సు నండిన కుర్రవాడి దబాయింపు.. వెంటాడే జ్ఞాపకం అది.
(మిగతా వచ్చే వారం)

-వీరాజీ