S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం

(8-4-2018 నుంచి 14-4-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారంనాడు లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. భాగస్వామ్యాల్లో సంతృప్తి. కొన్ని విషయాల్లో ఘర్షణలుంటాయి. గౌరవం పెరుగుతుంది. సామాజిక అనుబంధాల్లో సంతృప్తి. సోమ మంగళవారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. అధికార వ్యవహారాలపై దృష్టి. సామాజిక హోదా పెంచుకునే ప్రయత్నం. శ్రమతో కార్యనిర్వహణ, సౌకర్యాలు సమకూర్చుకుంటారు. బుధ గురు శుక్రవారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలు. లాభాలపై దృష్టి. పెద్దల అనుకూలత సాధించే యత్నం. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. విజయసాధన. సంతాన వర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సృజనాత్మకత. శనివారంనాడు ఖర్చులు, పెట్టుబడులు అధికం. ఆహార విహారాల కోసం ప్రయత్నిస్తారు. కొన్ని పోటీలు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. వ్యతిరేకతలపై విజయం.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం అన్ని పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. నిర్ణయాలు వాయిదా వేసుకోవటం మంచిది. కుటుంబ ఆర్థికాంశాల్లోనూ లోపాలుంటాయి. మాటల్లో జాగ్రత్త. సోమ మంగళవారాల్లో అన్ని పనుల్లో గుర్తింపు. సంతృప్తి అధికం. కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. దూర ప్రయాణాల చర్చలు. ఇతరుల సహకారం లభిస్తుంది. మాతృవర్గ, సోదరవర్గ వ్యవహారాల్లో అనుకూలత. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు. బుధ గురు శుక్రవారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో శుభకరమైన మార్పులు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో ఉన్నతికి అవకాశం. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. సౌఖ్య లోపాలకు అవకాశం. శనివారంనాడు అన్ని పనుల్లో ప్రయోజనాలున్నా శ్రమ తప్పకపోవచ్చు. పెద్దల అనుకూలత కోసం యత్నిస్తారు. మనోభీష్టాలు నెరవేరుతాయి.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆదివారంనాడు భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. వైవాహికానుబంధాలు బలపడతాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. కొన్ని ఊహించని సంఘటనలు. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాటల వల్ల ఒత్తిడులు. బుధ గురు శుక్రవారాల్లో అన్ని పనుల్లో సంతృప్తి. ఆధ్యాత్మిక యాత్రలు. భాగస్వామ్యాలలో సంతృప్తి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. సోదర వర్గ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. పరిచయాల్లో ఒత్తిడులకు అవకాశం. శనివారం వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. అధికారులతో జాగ్రత్త. సౌకర్యాలు సమకూర్చుకునే యత్నం.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం వ్యతిరేకతలు పెరుగుతాయి. పోటీలలో విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. శత్రు రుణ రోగాదులను అధిగమిస్తారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సోమ మంగళ వారాల్లో పరిచయాలు, స్నేహానుబంధాల విస్తరణ. కొత్త పరిచయాల్లో జాగ్రత్త. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వైవాహికానుబంధాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. తమకోసం నూతన నిర్ణయాలు తీసుకుంటారు. బుధ గురు శుక్రవారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలు. నిర్ణయాదులను వాయిదా వేయాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాటల్లో గాంభీర్యం. శుభ పరిణామాలు. శనివారం ఉన్నత కార్యక్రమాలు. కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. యాత్రలకు అవకాశం. సోదరులతో జాగ్రత్తగా మెలగాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. పెద్దల సహకారం. లాభాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయోజనాలు కోల్పోవచ్చు. సోమ మంగళవారాల్లో పోటీలు, ఒత్తిడులు చికాకులుంటాయి. కార్యనిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. వ్యతిరేకతలు అధికం. ఖర్చులు, పెట్టుబడుల్లో శుభ పరిణామాలు. దానధర్మాల వల్ల మేలు. ఆహార విహారాలపై దృష్టి. బుధ గురు శుక్రవారాల్లో పరిచయాలలో జాగ్రత్త వహించాలి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త. స్నేహానుబంధాల్లో ఒత్తిడులు. ఆత్మవిశ్వాసం పెంచుకునే యత్నం. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. కొత్త పనులపై దృష్టి. శనివారం అన్ని పనుల్లో జాగ్రత్త. అనారోగ్య భావన. కార్యక్రమాలను వాయిదా వేయాలి. కుటుంబ, వ్యాపార, ఆర్థిక వ్యవహారాల్లో కొంత అనుకూలత. కొత్త నిర్ణయాదులుంటాయి.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. సౌకర్యాదుల విషయంలో ఘర్షణ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాలు సోమ మంగళవారాల్లో ఆలోచనలకు రూపకల్పన. మనోభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత, సంతాన వర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. లాభాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయోజనాలలో ఒత్తిడులు అధికం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. బుధ గురు శుక్రవారాల్లో వ్యతిరేకతలున్నా విజయసాధన. పోటీలు అధికం. శత్రు రుణ రోగాదులపై విజయం. కార్యనిర్వహణ దక్షత. ఖర్చుల్లో పెట్టుబడుల్లో జాగ్రత్త. అధికారిక వ్యవహారాల్లో వ్యర్థంగా కాలం ధనం పోవచ్చు. శనివారం భాగస్వామ్యాలపై దృష్టి, స్నేహానుబంధాల్లో జాగ్రత్త వహించాలి. పరిచయాల్లో ఒత్తిడులు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. సోదర వర్గంతో కొంత జాగ్రత్త. దగ్గరి ప్రయాణాల్లో ఒత్తిడులు. ఆధ్యాత్మిక, విహార యాత్రలకు అనుకూలం. నిర్ణయాదులు లాభిస్తాయి. సోమ మంగళవారాల్లో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. శ్రమతో సౌకర్యాలు సాధిస్తారు. ఆహార విహారాల్లో కొంత అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారిక వ్యవహారాల్లో సమస్యలు. కార్యనిర్వహణలో ఒత్తిడి. గుర్తింపు తగ్గే సూచనలు. బుధ గురు శుక్రవారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొత్త నిర్ణయాదులుంటాయి. సంతానంతో సంతృప్తి. లాభాలు ఆశించినట్లుగా ఉండవు. శనివారంనాడు వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులు తీవ్రవౌతాయి. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం కుటుంబంలో అనుకూలత. నిల్వధనం పెంచుకునే యత్నం. మాట విలువ పెంచుకుంటారు. దానధర్మాల కోసం వ్యయం. అనుకోని సమస్యలుంటాయి. వ్యాపార నష్టాలకు అవకాశం. సోమ మంగళ వారాల్లో సంప్రదింపులు శ్రమకు గురిచేస్తాయి. సోదర వర్గ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాదుల్లో జాగ్రత్త. సహకార లోపాలకు అవకాశం. దూర ప్రయాణాలకు ప్రణాళికలుంటాయి. దైవ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. బుధ గురు శుక్రవారాల్లో సౌకర్యాలు సమకూర్చడంలో శ్రమ. ఆహార విహారాదుల్లో ఒత్తిడులు. గృహ వాహనాది వ్యవహారాల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో సంతృప్తి. సామాజిక గౌరవం. శనివారం ఆలోచనలకు రూపకల్పన. కొత్త ప్రణాళికలు. పిల్లలపై అనురాగం. ప్రయోజనాలు ఆశించినట్లు ఉండకపోవచ్చు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులపై దృష్టి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు, వ్యాపారానుబంధాల్లో కొంత జాగ్రత్త అవసరం. సోమ మంగళవారాల్లో కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. మాట విలువ తగ్గే సూచనలు. నిల్వధనం గూర్చి చర్చిస్తారు. కొన్ని అనుకోని ప్రయోజనాలుంటాయి. అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాదులు వాయిదా వేయాలి. బుధ గురు శుక్రవారాల్లో సంప్రదింపులు శ్రమకు గురి చేస్తాయి. సేవక జన సహకారం విషయంలో జాగ్రత్త. సోదర వర్గంతో చర్చలుంటాయి. లక్ష్యాలను సాధించే యత్నం. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. కీర్తి ప్రతిష్టలపై దృష్టి. శనివారం ఆహార విహారాలు, గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. సౌకర్యాదులకు అనుకూలం. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం ఖర్చులు, పెట్టుబడులకు అనుకూలం. ప్రయాణాల్లో జాగ్రత్త. పరామర్శలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో కాలం ధనం వ్యర్థం కావచ్చు. పోటీలలో విజయం. సోమ మంగళవారాల్లో నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. ఉత్సాహంగా గడుపుతారు. భాగస్వామ్యాల్లో తొందరపాటు కూడదు. పరిచయాలు, అనుబంధాలు ఇబ్బంది పెట్టవచ్చు. బుధ గురు శుక్రవారాల్లో కుటుంబ అనుబంధాలు పెరుగుతాయి. ఆర్థిక నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. కొత్త పనులు కూడదు. శ్రమ రహిత ధనంపై దృష్టి మంచిది కాదు. శనివారంనాడు సంప్రదింపుల్లో జాగ్రత్త. సోదర వర్గంతో ఒత్తిడులుంటాయి. లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత. కీర్తిప్రతిష్టలు. కొత్త నిర్ణయాదులుంటాయి.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం ప్రయోజనాలపై దృష్టి. ఆశించిన ఫలితాలు అందవు. పెద్దల ఆశీస్సులు శ్రమతో లభిస్తాయి. మార్గదర్శనం దొరుకుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు. సోమ మంగళ వారాల్లో ప్రయాణాలకు, ఖర్చులకు, పెట్టుబడులకు అనుకూలం. దానధర్మాల వల్ల మరింత మేలు కలుగుతుంది. పోటీలు, వత్తిడులు చికాకులకు గురి చేస్తాయి. శత్రువులు, రోగాలు పెరిగే అవకాశం. బుధ గురు శుక్రవారాల్లో నిర్ణయాదులకు అనుకూలం. కొత్త పనులు, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గుంభనగా ఉంటారు. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. పరిచయాలు, స్నేహానుబంధాలు శ్రమకు గురి చేయవచ్చు. శనివారం కుటుంబ ఆర్థికాంశాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. మాటల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనుకోని ఇబ్బందులు. వ్యాపారాదుల్లో నష్టాలకు అవకాశం. కాలం ధనం కోల్పోవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం వృత్తి ఉద్యోగాదులకు అనుకూలం. పెద్దలతో వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్త. గౌరవ లోపాలు లేకుండా చూసుకోవాలి. ఆహార విహారాల్లో శ్రమతో అనుకూలత. గృహ వాహనాదులపై ప్రఒత్యేక ఆలోచనలు. సోమ మంగళవారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలున్నా అప్రమత్తంగా మెలగాలి. లాభాలు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. బుధ గురు శుక్రవారాల్లో ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో ఒత్తిడులకు అవకాశం. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. వ్యతిరేకతలను అధిగమిస్తారు. పోటీల్లో విజయం. శనివారం నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. వ్యాపార అనుబంధాల్లో ఒత్తిడులుంటాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744