S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆగ్నేయ మూలలో సెప్టిక్ ట్యాంక్

== వాస్తు ==
రాహుల్ (వికారాబాద్)
ప్రశ్న: మా ఇంటికి ఆగ్నేయ మూలలో లెట్రిన్ ట్యాంక్ ఉంది. అలా వుండవచ్చునా? మా ఇంట్లో అశాంతి నెలకొని ఉంది. పరిష్కారం తెలుపగలరు.
జ: మీ ఇంటికి సంబంధించి ఆగ్నేయ దోషాలు ఉన్నాయి. దీనివల్ల ఆడవారికి అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. కావున ఆగ్నేయంలోగల సెప్టిక్ ట్యాంక్‌ను అక్కడ నుండి తీసివేసి తూర్పు మధ్యభాగంలోకి మార్చుకోండి. మీకు గల సమస్యలు తొలగిపోతాయి.
ప్రసాద్ (రావులపాలెం)
ప్రశ్న: మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటోంది. అలాగే ఏ పని తలపెట్టినా పూర్తి కావడంలేదు.
జ: మీ ఇంటికి సంబంధించి దృష్టి దోషాలు ఉన్నాయి. అందువల్లనే ఇలా జరుగుతోంది. మీరు ఇంటి గుమ్మానికి ఎదురుగా గుమ్మడికాయను వేలాడదీయండి. అలాగే ప్రతిరోజూ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా చేయడం వలన మీకు గల దృష్టిదోషాలు తొలగిపోతాయి. అంతా మంచి జరుగుతుంది.
గోపాలకృష్ణ (గుంటూరు)
ప్రశ్న: మా ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. దీనికి కారణం వాస్తు అవుతుందా? లేక జాతక ప్రభావమా?
జ: మీ ఇంటికి సంబంధించి వాయవ్యంలో లెట్రిన్ గుంట ఉంది. అలాగే ఉత్తర వాయవ్యంలో వీధి పోటు ఉన్నది. ఈ రెండింటి వలన మీ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. మొదటగా వాయవ్యంలోగల లెట్రిన్ గుంటను ఉత్తర మధ్యభాగానికి మార్చండి. అలాగే ఉత్తర వాయవ్య వీధి పోటుకు ‘వీధిపోటు నివారణ యంత్రం’ ప్రతిష్ఠించుకొని మంచి ఫలితాలను పొందండి. ఈ రెండు మార్పులు చేసిన తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
శైలజ (ఆత్మకూరు)
ప్రశ్న: మేము ఒక అపార్ట్‌మెంట్‌ను ఇటీవల తీసుకున్నాం. అది తీసుకున్న దగ్గర నుండి ఏదో ఒక సమస్య వస్తున్నది. ఈ ఫ్లాట్‌కి నైరుతిలో లిఫ్ట్ వచ్చింది. దీనివల్ల ఏమైనా దోషాలు ఉన్నాయా?
జ: నైరుతిలో లిఫ్ట్ ఉండటం చాలా పెద్ద దోషం అవుతుంది. దీనివలన కోర్టు కేసులు, గొడవలు, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంకా చాలా వస్తాయి. ఆ లిఫ్ట్‌ను మార్చడానికి వీలులేదు కాబట్టి దీనికి సంబంధించి నివారణ యంత్రాలు ఉంటాయి. అవి ప్రతిష్ఠించుకొని మంచి ఫలితాలను పొందండి.
పంతులు (శ్రీకాకుళం)
ప్రశ్న: మా ఇంటికి నైరుతి మూల తోకలాగా పెరిగింది. అలాగే తూర్పు ఆగ్నేయంలో వీధి పోటు కూడా ఉన్నది. ఇంకా నైరుతిలోనే లెట్రిన్ గుంట ఉన్నది. ఇది జాయింట్ ప్రాపర్టీగా ఉన్నది. కానీ నైరుతి దోషాలుగల ఇల్లు నా భాగంగా వచ్చింది. నేను ఏ పని మొదలుపెట్టినా అన్నీ నష్టాలే. ఇప్పటిదాకా చాలా డబ్బులు నష్టపోయాను. పరిష్కారం చూపగలరు.
జ: ముందుగా నైరుతిలోగల లెట్రిన్ గుంటను తీసివేయండి. అలాగే పెరిగిన నైరుతి మూలను వేరుచేస్తూ ఒక గోడను నిర్మించండి. దీని తర్వాత తూర్పు ఆగ్నేయ వీధి పోటుకు సంబంధించి నివారణ యంత్రాలు ఉంటాయి. అవి ప్రతిష్ఠించుకొని మంచి ఫలితాలను పొందండి.
సికిందర్ (రంగారెడ్డి జిల్లా)
ప్రశ్న: పుట్టలు వున్న స్థలంలో ఇంటి నిర్మాణం చేయవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషాలు కలుగుతాయా?
జ: పుట్టలు వున్న స్థలాలలో ఇంటి నిర్మాణం చేయరాదు. అలా చేయడంవల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఒకవేళ మీకు అటువంటి స్థలం ఉన్నట్లయితే దానిని అమ్మివేయండి.

===========

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28