S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేమ - గౌరవం

సండేగీత
---------
ప్రేమ, గౌరవం అన్న రెండు పదాలు భిన్నమైనవి. రెండింటిలో భేదం ఉంది. ప్రేమ అత్యున్నతమైనదని చాలామంది భావన. నిజానికి గౌరవం అన్నదే అత్యున్నతమైన భావన. ప్రేమే గొప్పది అన్న అభిప్రాయం రావడానికి కారణాలు ఎన్నో.
‘దేశమును ప్రేమించుమన్నా’ అన్న కవితా చరణాలు, ‘్భరతదేశం నా మాతృభూమి, భారతదేశమును ప్రేమిస్తున్నాను’ అన్న ‘ప్రతిజ్ఞ’ చరణాలు లాంటివి ఇలాంటి అభిప్రాయం బలపడటానికి కారణాలు. ప్రేమకన్నా గౌరవం అన్నది ముఖ్యమైనది అని అంటే చాలా మంది అంగీకరించకపోవచ్చు. ‘ప్రేమ’ అనేది చాలా శక్తివంతమైన భావోద్వేగం అని చాలామంది అంటూ ఉంటారు.
జీవితంలో బతకడానికి ప్రేమకన్నా గౌరవం ముఖ్యమైంది. విజయవంతమైన జీవితం గడపాలంటే ఇతరులని గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవించి ప్రేమిస్తే మరీ మంచిది. జంతువులకి మనుషులకి మధ్య వున్న భేదం ఈ రెండు విషయాలని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు.
మనుషులకి జంతువులకి మధ్యన వున్న భేదాల గురించి చూద్దాం. మనిషి తింటాడు. జంతువులూ తింటాయి. మనుషులు నీళ్లని తాగుతారు. జంతువులూ తాగుతాయి. మనుషులు తమ సంతతిని పెంపొందిస్తారు. జంతువులు కూడా. జంతువులు గాఢంగా ప్రేమిస్తాయి. మనుషులు కూడా గాఢంగా ప్రేమించగలరు. మనుషులు గౌరవించగలరు. జంతువులకు ఈ విషయం తెలియదు.
ఇదే మనుషులకి జంతువులకి మధ్యన వున్న భేదం.
చాలామంది కుక్కలని పెంచుకుంటారు. కొంతమంది పిల్లులని కూడా పెంచుకుంటారు. అవి ఆ యజమాని ఇంట్లోకి రాగానే పైకి ఎగబడి మీద పడతాయి. ఆడతాయి. ఆ యజమానిని ఎంతో ప్రేమిస్తాయి. సృష్టి వాటికి ఆలోచనా శక్తిని ఇవ్వలేదు. అందుకే గౌరవించడం వాటికి అంతగా తెలియదు. విజయవంతంగా జీవనం కొనసాగించాలంటే గౌరవించడం తెలుసుకోవాలి. ప్రేమించడం తెలియకపోయినా ఫర్వాలేదు. ప్రేమించకపోయినా ఫర్వాలేదు.
ఓ జడ్జిగారు ప్రజల పక్షపాతి. మంచి తీర్పులు ప్రకటించాడు. న్యాయబద్ధంగా వ్యవహరిస్తాడు. ఆయనని ప్రేమిస్తే సరిపోతుందా? ఆయన కోర్టుకి వెళ్లినప్పడు, కోర్టు ప్రారంభంలో లేచి నిల్చోని గౌరవించకపోతే ఆయనకు కోపం రాదా? కోర్టు జవాను ఏమీ అనకుండా ఉంటాడా? ఇదే పరిస్థితిపై అధికారుల విషయంలోనూ వర్తిస్తుంది. ఏదైనా సంస్థలో పని చేస్తున్నప్పుడు ఆ సంస్థలోని వ్యక్తులని ప్రేమించడం కన్నా ముఖ్యమైనది ఆ సంస్థలోని వ్యక్తులని గౌరవించడం.
మనిషికి జంతువులకి వున్న భేదం ఆలోచనా శక్తి. ఈ ఆలోచనా శక్తిని ఉపయోగించి ఇతరులని గౌరవించడం నేర్చుకోవాలి. మనిషి జంతువుకన్నా ఉన్నతమైనవాడు. ఎదుటి వ్యక్తులని గౌరవిస్తే మనకూ గౌరవం లభిస్తుంది. విజయమూ లభిస్తుంది. కనీసం అపజయం ఉండదు. అవమానమూ ఉండదు. దీనికి ఎలాంటి పెట్టుబడీ అవసరం లేదు.
ఇప్పుడు చెప్పండి. ప్రేమ, గౌరవంలో ఏది అత్యంత ముఖ్యమైంది..?

**