S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దాహం

ఒక కొండపైన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక బలమైన దృఢమైన గోడ ఉంది. ఒక సూఫీ గురువు ఆ గోడ మీద కూచుని ప్రార్థన చేసుకున్నాడు.
ఏదో శబ్దం వస్తే అటువేపు చూశాడు. ఆ చివర గోడపై ఒక వ్యక్తి కూచుని గోడలోని ఇటుకలు లాగుతూ గోడ కింద పదడుగుల దూరంలో ఉన్న నీటి కాలువలో విసురుతున్నాడు.
సూఫీ గురువు ఆశ్చర్యపోయాడు. గోడలోని ఇటుకలు లాగి ఎందుకు నీటిలోకి విసురుతున్నాడు? అనుకున్నాడు. ఆయన గోడ చివర కూచున్న వ్యక్తిని పిలిచి ‘ఏమైంది? ఎందుకు రాళ్లు విసురుతున్నావు?’ అని అడిగాడు.
ఆ వ్యక్తి ‘నాకు చాలా దాహంగా ఉంది’ అన్నాడు. సూఫీ గురువు ఆశ్చర్యపోయాడు.
‘నీకు అంత దాహంగా ఉంటే గోడ దిగి పదడుగులు వేసి కాలువ నీళ్లు తాగవచ్చు కదా!’ అన్నాడు.
అతను ‘నేను అక్కడికి వెళ్లను’ అన్నాడు.
గురువు ‘ఎందుకు?’ అన్నాడు.
అతను ‘నేను కాలువను నా దగ్గరికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఎందుకు ఇటుకలు వేస్తున్నానంటే అట్లా విసురుతూ పోతే క్రమక్రమంగా కాలువలో నీళ్లు పైకి వచ్చి నా దగ్గరికి వస్తాయి. పైగా ఇటుక విసిరినప్పుడల్లా నీళ్లు పైకి ఎగిరి మెరుస్తాయి. ఇక్కడ కూచుని ఎగిరే నీటిని, ఆ శబ్దాన్ని వినడం నాకు ఇష్టం. ఆ నీళ్లు యిక్కడికి వచ్చాయంటే నా దాహం కూడా తీరుతుంది కదా!’ అన్నాడు.
సూఫీ గురువు చిత్రమైన ఆ వ్యక్తి తత్వానికి ముచ్చటపడ్డాడు.

- సౌభాగ్య, 9848157909