S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏ దిశ యోగిస్తుంది? (వాస్తు)

కార్తికేయ (తణుకు)
ప్రశ్న: నా పేరు ప్రకారం గృహ నిర్మాణానికి ఏ దిశ యోగిస్తుంది?
జ: మీ పేరునుబట్టి తూర్పు, దక్షిణం రోడ్లుగల ఆగ్నేయం బ్లాకు చాలా బాగా యోగిస్తుంది.
జైపాల్‌రెడ్డి (ఉరవకొండ)
ప్రశ్న: కొత్త ఇంటి నిర్మాణం చేపట్టి రెండు సంవత్సరాలైంది. కొన్ని రోజులు పని సాగుతుంది. మరలా కొన్ని రోజులు పని ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఇంటి పని త్వరగా పూర్తి కావడంలేదు.
జ: మీ ఇంటికి సంబంధించి కట్టుబడిలో పెరిగిన దక్షిణ నైరుతిని వేరు చేయండి. అలాగే స్థల దోషం కూడా ఉంది. దోష నివారణ చేయించుకోండి. తిరిగి మీ ఇంటి నిర్మాణం వేగవంతం అయి పూర్తవుతుంది.
సి.ఎన్.ఆర్ (రావినూతల)
ప్రశ్న: మేము ఒక హోటల్ వ్యాపారం మొదలుపెట్టి చాలా లాభాలు గడించిన తర్వాత ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశాము. అప్పటి నుండీ మాకు అన్నీ నష్టాలే కష్టాలే. భాగస్వాముల మధ్య గొడవలు. అలాగే పనివాళ్లతో సమస్యలు. ఇక పనివాళ్లు ఎక్కువకాలం మా దగ్గర పని చేయడం లేదు. దీనికి మా హోటల్ నిర్వహించే స్థలం వాస్తు ప్రభావమా?
జ: కొత్తగా కొనుగోలు చేసిన ఇంటికి ఆగ్నేయ దోషాలు, నైరుతి దోషాలు ఉన్నాయి. అందువల్లనే మీకు ఇలా నష్టాలు, కష్టాలు వస్తున్నాయి. ముందుగా ఆ ఇంటి యొక్క ఈ రెండు దోషాలను నివారించుకోండి. అలాగే మీరు హోటల్ నిర్వహిస్తున్న స్థలానికి/ భవనానికి/ మీ వ్యాపారానికి నరదృష్టి దోషాలు ఉన్నాయి. కావున ఆ దోష నివారణ కూడా చేసుకోండి. తద్వారా మీ వ్యాపారం తిరిగి లాభాల బాట పడుతుంది.
గోపాలరావు (కనిగిరి)
ప్రశ్న: మా ఇంటికి పక్క ఇంటి వాళ్ల వెన్నుపోటు కలుగుతున్నది. పరిష్కారం తెలుపగలరు.
జ: దీనికి సంబంధించి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు.
అచ్చిరెడ్డి (నిజామాబాద్)
ప్రశ్న: కొత్తగా ఇంటిని నిర్మించి గృహ ప్రవేశం చేశాం. కానీ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి మానసిక ఆందోళనలు, భయాలు ఎక్కువగా కలుగుతున్నాయి. అసలు నిద్ర అనేదే మాకు కరువైంది.
జ: మీ ఇంటికి సంబంధించి నైరుతిలో దోషాలు ఉన్నాయి. అలాగే మీరు ఇంటిని నిర్మించిన స్థలానికి సంబంధించి ‘శల్య వాస్తు’ దోషాలు ఉన్నాయి. మీ ఇంటికి నైరుతిలోగల టాయిలెట్‌ను తీసివేయండి. దీనివల్ల మీకు గల సమస్యలు తొలగిపోతాయి.

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28