S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నోరు-అగ్నిపర్వతం

స్కూల్ నించి తిరిగి వచ్చిన రూపసి తల్లితో ఉత్సాహంగా చెప్పింది.
‘ఇవాళ క్లాస్ నాకు బాగా నచ్చింది. అగ్నిపర్వతాల గురించి నేర్చుకున్నాను’
‘ఓ! చిన్నప్పుడు వాటి గురించి నేనూ చదివిన గుర్తు. ప్రకృతిలోని ఆకర్షణీయమైన వాటిలో అవొకటి’ తల్లి చెప్పింది.
‘మా టీచర్ దగ్గర చిన్న అగ్ని పర్వతం మోడల్ ఉంది. అది పేలి లావా బయటికి వచ్చేలా కూడా చేశారు. నిజమైన అగ్ని పర్వతం బద్దలైతే బయటకి ఏమొస్తుందో తెలుసా?’ రూపసి తల్లిని అడిగింది.
‘లావా, వేడి వాయువులు, రాతి ముక్కలు’ క్రితం సంవత్సరం అదే పాఠం చదివిన రూపసి అన్న చెప్పాడు.
‘నోర్ముయ్. నేను అడిగింది నిన్ను కాదు, అమ్మని’ రూపసి కోపంగా అరిచింది.
అన్న మొహం మాడ్చుకున్నాడు. తర్వాత రూపసి తల్లికి అగ్నిపర్వతం గురించి తను నేర్చుకున్నది చెప్పసాగింది.
‘వొత్తిడి పెరిగి ఎర్రటి వేడి బూడిద అందులోంచి బయటికి వస్తుంది. అది ఎక్కడి నించి వస్తుందో తెలుసా?’
‘అగ్నిపర్వతం నోట్లోంచి. శంఖాకారంలో ఉండే పర్వత శిఖరమే నోరు’ అన్న చెప్పాడు.
అన్న వంక ఉరిమి చూసి రూపసి చెప్పింది.
‘తప్పు. అలా కనిపించినా నిజానికి అవి బయటికి వచ్చేది శిఖరం కింద నించి. దాన్ని వెంట్ అంటారు. నీకెంత తెలిసిందో అర్థమైందా మొద్దు వెధవా? ఈసారి నేను అడిగితే కానీ సమాధానం చెప్పకు’
వాడు మళ్లీ మొహం మాడ్చుకోవడం గ్రహించిన తల్లి చెప్పింది.
‘నోరున్నది ఒక్క అగ్నిపర్వతానికే కాదు. మనకి కూడా. అగ్నిపర్వతం బద్దలయ్యాక బయటికి వచ్చే లావా మన నోట్లోంచి రాకపోవచ్చు. కానీ ఇప్పుడు నీ నోట్లోంచి వచ్చినట్లుగా మన నోళ్లు బద్దలై వేడి, విషపూరిత, నిర్దయతో కూడిన మాటలు బయటికి వచ్చి ఇతరులని బాధిస్తాయి’
‘మరి నీతో అగ్నిపర్వతాల గురించి మాట్లాడుతుంటే అన్న ఎందుకు అడ్డు పడాలి?’
‘అంత మాత్రం చేత నువ్వు అలా మాట్లాడటం సబబు కాదు. అగ్నిపర్వతం బద్దలైతే దాని దారిలోని అన్నిటినీ నాశనం చేస్తూ ముందుకి సాగుతుంది. మన నోళ్లలోంచి వచ్చే పరుష పదాలు కూడా ఇతరుల మనసుని బాధపెట్టచ్చు. మనిషి అగ్నిపర్వతం బద్దలవడాన్ని ఆపలేడు. కానీ మనం మన నోట్లోంచి వచ్చే మాటలని కంట్రోల్ చేసుకోవచ్చు’
‘అప్పుడు అవి లావా లిప్స్ కావు’ అన్న నవ్వుతూ చెప్పాడు.
కంట్రోల్ యువర్ వౌత్

-మల్లాది వెంకట కృష్ణమూర్తి