S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చూస్తుండగానే...

చాలా సంవత్సరాల తరువాత యూనివర్సిటీకి వెళ్లాను. అదేదో నిన్న మొన్న అక్కడ చదువుకున్నట్టుగా అన్పించింది.
కానీ ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయింది.
ఆ మధ్య సిరిసిల్లలోని కోర్టుకి వెళ్లాను. అక్కడ నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాను. అది కూడా నిన్ననో, మొన్ననో అక్కడ ప్రాక్టీస్ చేసినట్టు అన్పించింది.
కానీ ముప్పై సంవత్సరాలు దాటిపోయింది.
ఆ మధ్య కొత్తగూడెంలో పని చేస్తున్నప్పుడు భద్రాచలం వెళ్లాను. ఈ మధ్యనే అక్కడికి వచ్చినట్టు అన్పించింది.
కానీ నా పెళ్లైన కొత్తలో అంటే 37 సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చాను.
చూస్తుండగానే...
కాలం ఎంత గడిచిపోయింది.
తెలియకుండానే ఎంతకాలం కాలగర్భంలో గడిచిపోయింది.
బాపు, అమ్మ అన్నయ్యలతో నిన్న మొన్న మాట్లాడినట్టుగా ఉంది. కానీ సంవత్సరాలు గడిచిపొయ్యాయి.
తెలియకుండా కాలం గడవటం మంచిదే!
మిగిలిన కాలం కూడా మన చేతి వేళ్ల నుంచి జారిపోకుండా చూసుకోవాలి. అంటే వున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఎంతమేరకు ఉపయోగించుకోవచ్చో ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో అంత బాగా ఉపయోగించుకోవాలి.
చూస్తుండగానే...
నడకొస్తుంది. పరుగొస్తుంది.
వయస్సు టీన్స్‌లోకి వస్తుంది.
చూస్తుండగానే...
గ్రామాలు పట్టణాలవుతాయి.
పట్టణాలు కొండ చిలువలై పోతాయి.
జైళ్లు హాస్పిటళ్లవుతాయి.
పచ్చని పొలాలు రియల్ ఎస్టేట్‌లవుతాయి.
చూస్తుండగానే...
ఎంతకాలం గడిచిపోతుంది.
మన ఊహ లేకుండానే
ఎంత ప్రయాణం చేస్తాం.
చూస్తుండగానే...
ఈ క్షణం కనుమరుగవుతుంది.
చూస్తుండగానే..
అన్నీ రూపాంతరం చెందుతాయి.
అన్నీ కరిగిపోతాయి.
అందుకని ఒక్క క్షణం వృధా కాకుండా చూసుకోవాలి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఎందుకంటే
అది గతం అవుతుంది.
నిన్నా మొన్నా అవుతుంది.
ఎప్పుడో కాకుండా చూసుకోవాలి.

జింబో 94404 83001