S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పథకం

వెబర్ మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాల పడవలో వైల్డ్ ఐలండ్‌కి చేరుకున్నాడు. నౌకాశ్రయం పక్కనే ఉన్న చిన్న కొండ మీద వైల్డ్ ఐలాండ్ హోటల్ ఉంది. ఆ ద్వీపంలో వాహనాలు లేకపోవడంతో అంతా నడిచే వెళ్లాలి. వెబర్ తోటి ప్రయాణీకులతో ఏటవాలు బాటలో నిశ్శబ్దంగా నడిచాడు. కొండ మీది రోడ్ రెండుగా చీలింది. కుడివైపు హోటల్ ఆఫీస్, ఎడం వైపు కాటేజీలు ఉన్నాయి. దూరంగా ఉన్న మరో కొండ మీది లైట్‌హౌస్ అక్కడికి కనిపిస్తోంది.
అంతా కుడివైపు దారిలో హోటల్‌కి చేరుకున్నారు. వరండాలో రాకింగ్ ఛెయిర్స్‌లో కూర్చున్న కొందరు వీరి వంక చూశారు. అంతా గదులు తీసుకునే దాకా ఆగి వెబర్ రిసెప్షనిస్ట్‌తో చెప్పాడు.
‘నాకు రిజర్వేషన్ లేదు. మీరు నాకు బస ఇవ్వకపోతే ద్వీపాన్ని చూసి హార్బర్‌కి తిరిగి వెళ్లి సాయంత్రం ఓడలో వెళ్లిపోతాను’
‘టూరిస్ట్ సీజన్ ఇప్పుడే ఆరంభమైంది. ఇక్కడ జులై, ఆగస్ట్ మాసాలు బిజీగా ఉంటాం. మీకు గది ఇస్తాను’ చెప్పి రిసెప్షనిస్ట్ అతనికి రిజిస్ట్రేషన్ ఫాంని ఇచ్చింది.
వెబర్ కుడి చేత్తో పెన్‌ని తీసుకుని, దాన్ని ఎడం చేత్తో పట్టుకుని, ‘జార్జ్ ఆర్ రీడ్, 11 డౌన్ రోడ్ న్యూయార్క్’ అని రాసాడు. తర్వాత సంతకం చేసి ఫాంని ఆమె వైపు తోస్తూ, ఇబ్బందిని నటిస్తూ చెప్పాడు.
‘నా పెన్నుని వాడాల్సింది. నాది ఎడంచేతి వాటం. ఈ పెన్ కుడిచేతి వాటం వాళ్లు వాడేది. దీన్ని నేను పాడు చేసినట్లున్నాను’
‘మరేం ఫర్వాలేదు. రూం నంబర్ నలభై నాలుగు’
ఆ పెన్ లీక్ అవడంతో రాసిన దాంట్లో చాలా భాగం కనపడటం లేదు. జార్జ్ ఆర్ రీడ్ గురించి ఆమె ఏదైనా గుర్తుంచుకుని చెప్పాల్సి వస్తే, అతనిది ఎడం చేతి వాటం అని గుర్తుంచుకుంటుంది.
వెబర్ జార్జ్‌ని పొట్టిగా, లావుగా తెల్లబడుతున్న నల్ల జుట్టు, విశాలమైన భుజాలు, పొట్టగల వ్యక్తిగా ఊహించాడు. జార్జ్‌కి ఇటీవలే భార్య పోవడంతో కలివిడిగా ఉండడు. ఉప్పు తక్కువ ఉన్న భోజనం చేస్తాడు.
రూం నంబర్ నలభై నాలుగు కిటికీ లోంచి కింద లాన్‌లోని తెల్లటి కుర్చీలు, టెన్నిస్ కోర్ట్, ఫ్లవర్ బెడ్స్ కనిపించాయి. అనేక చేపల పడవలు కూడా ఒడ్డున కనిపించాయి. సాయంత్రం ఐదు దాకా ఈజీ ఛెయిర్‌లో నిద్రపోయాడు. తర్వాత చేతులు కడుక్కుని డైనింగ్ రూంకి వెళ్లాడు. అతని టేబిల్ ముందు కూర్చున్న మిస్టర్ అండ్ మిసెస్ ఫీల్డింగ్స్, మిస్ వైన్స్ పరిచయం చేసుకున్నారు.
అతను లేచి స్టివార్డెస్ దగ్గరికి వెళ్లి ఆమెతో ఉద్వేగంగా చెప్పాడు.
‘నేను వైల్డ్ ఐలాండ్‌కి విశ్రాంతి కోసం తప్ప మనుషుల్ని కలవడానికి రాలేదు. కొద్ది వారాల క్రితమే నా భార్య పోయింది. మనశ్శాంతి కోసం వచ్చాను’
ఆమె అర్థమైనట్లుగా అతనికి ఒంటరి టేబిల్‌ని కేటాయించింది. అతను వెయిట్రెస్‌ని తనకి వడ్డించే వాటిలో ఉప్పు వేయద్దని కోరాడు. సలాడ్ తినేప్పుడు తను చంపాల్సిన వ్యక్తిని గుర్తించాడు. అతని పేరు వెస్ట్. అతనితో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం ఓ రెస్ట్‌రెంట్లో వెబర్‌కి దూరం నించి వేలితో వెస్ట్‌ని చూపించారు. అతని మీద హత్యా నేరం కొట్టివేయబడటంతో అతను ఆ రోజు మిత్రులకు ఆ రెస్ట్‌రెంట్లో పార్టీ ఇస్తున్నాడు.
వెబర్ భోజనం అయ్యేదాకా ఆ ముగ్గుర్నీ గమనిస్తూనే ఉన్నాడు. తర్వాత తన గదికి వెళ్లి నిద్రపోయాడు.
మర్నాడు ఆ ప్రాంతాన్ని పరిశీలించాడు. తర్వాత హోటల్‌ని, బార్‌ని, వంటగదిని చూసి బీచ్‌కి వెళ్లి ఇంకో అడవి దారి లోంచి తిరిగి వచ్చాడు. దారిలో జనరల్ స్టోర్స్, పోస్ట్ఫాస్, చర్చ్‌లని చూశాడు.
మధ్యాహ్నం ఇంకోవైపు వెళ్లి స్థానిక ఇళ్ళని చూశాడు. ఓ గంటసేపు ఓ చిన్న లైబ్రరీలో గడిపాడు. ఇంకా ఎతె్తైన లైట్‌హౌస్ గల పర్వతం ఎక్కి కోస్ట్‌గార్డ్‌లు పెట్టిన ‘నో ట్రెస్‌పాసింగ్’ బోర్డు కనిపించే దాకా వెళ్లాడు.
గురువారం హోటల్ వాళ్లిచ్చిన లంచ్ బేస్కెట్‌ని తీసుకుని ఆ ద్వీపం పశ్చిమం వైపున్న నిర్మానుష్య బీచ్‌కి వెళ్లాడు.
అక్కడ చిత్రాలని గీసే ఆరుగుర్ని లెక్క కట్టాడు. అతను భోజనం దగ్గర, నడిచేప్పుడు వెస్ట్‌ని అనేకసార్లు చూశాడు. అతన్ని త్వరగా చంపాలని నిర్ణయించాడు. వెస్ట్ ఎప్పుడూ ఒంటరిగా లేడు. తనని కోర్ట్ నిర్దోషిగా విడిచిపెట్టడం కొందరికి భరించరానిది అని వెస్ట్‌కి తెలుసు. వారు తమ పద్ధతిలో న్యాయం జరుపుతారని కూడా అతనికి తెలుసు.
వెబర్ వృత్తిపరమైన ఆసక్తితో వెస్ట్ అలవాట్లని, ఎంత తింటాడు, ఎంత తాగుతాడు, ఎంత తరచూ దుస్తులు మారుస్తాడు, ఆ ఇద్దరు బాడీగార్డులతో ఎంతసేపు మాట్లాడుతాడు మొదలైనవి గమనించాడు. ప్రతీ మధ్యాహ్నం వెస్ట్ ఆ ఇద్దరు బాడీ గార్డులతో స్విమ్మింగ్ పూల్ పక్కన కుర్చీల్లో కూర్చుని ఉత్తరాల పడవ కోసం ఎదురు చూస్తూంటాడు.
చివరకి వెబర్ తన పథకాన్ని రూపొందించుకున్నాడు. శుక్రవారం ప్రదేశాన్ని, సమయాన్ని నిర్ణయించుకున్నాడు. తనని ఆ పనికి పురమాయించిన వారు ముందు అనుకున్నట్లుగా జార్జ్ పేర హోటల్‌కి పంపిన టెలిగ్రాంని రిసెప్షనిస్ట్ అతనికి ఇచ్చింది. దాన్ని అతను బయటకి చదివాడు.
‘మీరు మళ్లీ రావాలని అనుకుంటే ఇప్పుడే రిజర్వేషన్ చేయించుకోండి. జులై, ఆగస్ట్ నెలలు రద్దీ నెలలు’
‘నాకు ఇక్కడ చాలినంత విశ్రాంతి లభించింది. ఇలాంటి ప్రదేశం బాధని చంపేస్తుంది’ చెప్పాడు.
* * *
శనివారం మారే రోజు. పాత అతిథులు వెళ్లి కొత్త అతిథులు ఓడలో ఆ రోజు వస్తారు. వారంలోని మిగిలిన ఏ రోజు కన్నా తెల్లవారుఝామునే వెబర్ తన సూట్‌కేస్‌తో లాబీలోకి చేరుకున్నాడు. మెయిన్ లేండ్‌కి వెళ్లే పడవ సరైన సమయానికే వెళ్తోందా అని రిసెప్షనిస్ట్‌ని అడిగాడు. వెస్ట్ అతని బాడీగార్డ్‌లు ఎప్పటిలా తెల్ల కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వెబర్ బిల్ చెల్లించడానికి జేబులోంచి పర్స్‌ని తీస్తూంటే జేబులోంచి ఓ కత్తి కిందకి జారి చెక్క నేలలో నిలువుగ గుచ్చుకుంది. అక్కడ తక్షణం నిశ్శబ్దం అలముకుంది.
‘ఓ లార్డ్!’ చెప్తూ ఒంగి ఆ కత్తిని తీసుకుని ఎడమ చేతికి రుమాలుని చుట్టుకున్నాడు. ఆ అందమైన రిసెప్షనిస్ట్ నివ్వెరపోతూ చూసింది. వెబర్ ఆమెతో చెప్తున్నా, అది హాల్లోని అంతా వింటున్నారని అతనికి తెలుసు.
‘మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడికి పూర్తి నిరాశతో వచ్చాను. ఇక జీవించలేక ఒంటరిగా గదిలో.. నీళ్ల తొట్టెలో.. మణికట్టు కోసుకుని..’ దుఃఖంగా చెప్పేది ఆపేశాడు.
‘మీ చెయ్యి కోసుకుంది. మీరు ముందు దాన్ని కడుక్కు రండి..’ రుమాలు ఎర్రబడటంతో రిసెప్షనిస్ట్ చెప్పింది.
వెబర్ తల ఊపి మెట్ల వైపు తన గదికి వెళ్తూంటే రిసెప్షనిస్ట్ చెప్పింది.
‘బార్లో బాత్‌రూం ఉంది’
‘సరే. నా ఫస్ట్ ఎయిడ్ కిట్‌ని ఏ బేగ్‌లో పెట్టానో’
అతను తన లగేజ్‌ని అందుకుని బార్లోని బాత్‌రూంలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. హార్బర్ నించి పడవ వచ్చిన గుర్తుగా గంట వినిపించింది. ఆ చిన్న దీర్ఘ చతురస్రాకారపు బాత్‌రూం గదిలో వెబర్ తన దుస్తులన్నిటినీ విప్పాడు. అతని భుజాలు విశాలంగా కనిపించేలా పేడింగ్ చేసిన కోటుని, పొట్ట ఎత్తుగా కనపడేలా ప్రత్యేకంగా కుట్టిన తెల్ల షర్ట్‌ని, అతని నడకని మారేలా ప్రత్యేకంగా చేసిన, పొడుగుని పెంచే బూట్లని విప్పాడు. అద్దంలో అతని సన్నటి శరీరం కనిపించింది. తెల్లబడుతున్న నల్ల జుట్టు విగ్‌ని తీయగానే గోధుమ రంగు జుట్టు బయటపడింది. నోట్లోంచి వొంపు తిరిగిన గట్టి రబ్బర్ని తీయగానే కిందకి జారిన పెదవి మామూలుగా ఐంది. వాటన్నిటినీ చిన్న ఎయిర్‌బేగ్‌లో ఉంచాడు. దాని జిప్‌ని లాగి ఎక్స్‌పేండ్ చేశాడు. నీలం షర్ట్, పేంట్, నీలం రంగు కోటు, లెదర్ బూట్లని బయటకి తీసి వేసుకుని తల దువ్వుకుని కళ్లజోడు పెట్టుకున్నాడు. ఇందాకటి రూపానికి ఇప్పటి రూపానికి పోలికే లేదు. ఇదంతా సరిగ్గా రెండు నిమిషాల తొమ్మిది క్షణాల్లో జరిగిపోయింది.
ఐనా రెస్ట్‌రూంలోకి వెళ్లిన జార్జ్ సంగతి అంతా మర్చిపోయి ఉంటారని అతనికి తెలుసు. చేతిలో ఒకే బేగ్‌తో తలుపు తెరచుకుని ఖాళీ బార్లోకి వచ్చాడు. అతను వేగంగా వెస్ట్ కూర్చున్న వైపు నడిచి జేబులోంచి కత్తిని తీశాడు. దాన్ని చటుక్కున వెస్ట్ వైపు బలంగా విసిరాడు. అది అతని వీపులో ఎడమ వైపు సరిగ్గా గుండె ప్రాంతంలో కూర్చుంది. వెస్ట్ ఓసారి కదిలి తర్వాత విశ్రాంతిగా వాలాడు. తాము విషంతో మరణించిన తమ యజమాని శవాన్ని రక్షిస్తున్నామని అతని ఇద్దరు బాడీ గార్డ్‌లకి తెలీదు.
వెబర్ మెట్లు దిగి బీచ్‌కి చేరుకుని కొత్తగా ఓడలోంచి దిగి వచ్చే ప్రయాణీకులతో కలిసిపోయాడు. వారితోపాటు మళ్లీ ఆ హోటల్ లోకి వచ్చి రిసెప్షనిస్ట్‌తో చెప్పాడు.
‘హలో! నా పేరు పాల్ విల్టన్. క్రితం శనివారం నేనిక్కడ గదిని రిజర్వ్ చేసుకున్నాను’ ఈసారి కంఠం మార్చలేదు.
ఆమె కళ్లనిబట్టి ఆమె తనని గుర్తించలేదని గ్రహించాడు.
‘రూం నంబర్ నలభై రెండు’ ఆమె రిజర్వేషన్ చార్ట్‌ని చూసి చెప్పింది.
‘వినోదానికి ఇక్కడ ఏం చేస్తారు? నాకు బేడ్‌మింటన్ కోర్ట్ కనపడలేదు. బీచ్‌లో ఇసుక కూడా పెద్దగా లేదు’
‘ఇక్కడికి పర్యాటకులు ప్రకృతి దృశ్యాల కోసమో, విశ్రాంతి తీసుకోవడానికో వస్తూంటారు. మీరు చిత్రకారుడు కాకపోతే విశ్రాంతి తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేరు’
ఆమె ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫాంని అందుకుని, కుడిచేత్తో పాల్ విల్టన్, 112, ఆటం స్ట్రీట్, బేటిల్‌బ్రూక్, కనెక్టికట్ అని రాసాడు. తర్వాత పెన్‌ని ఊపుతూ అడిగాడు.
‘దీన్ని ఎవరు వాడారు? చిన్నపిల్లలా?’
‘ఓ ఇబ్బందికరమైన అతిథి. అతనిది ఎడమచేతి వాటం. దీన్ని పాడుచెయ్యడమే కాక, ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు’ ఉద్వేగంగా చెప్పింది.
‘అతన్ని గదిలో పెట్టి తాళం వేసారా?’
‘లేదు. మీరు వచ్చిన ఓడలో వెళ్లిపోతున్నాడు. థాంక్ హెవెన్స్!’
‘నా గది ఎటు? బాత్‌రూంలో షవర్ ఉందా? ఒళ్లంతా ఉప్పగా ఉంది’
ఆమె మెట్ల వంక చూపించింది. వెబర్ తన గదిలోకి వెళ్లి తలుపు మూస్తూండగా ఇద్దరు బాడీగార్డ్‌లు వెస్ట్ మరణించాడని గ్రహించారు. కిటికీ లోంచి వెబర్ కింద లాన్‌లో జరిగే గందరగోళాన్ని చూశాడు. స్నానం చేసి దుస్తులు మార్చుకుని ఆరుగంటలకి కింద బార్లోకి వెళ్లాడు. చాలామంది ఆ కొత్త వ్యక్తి వంక ఆసక్తిగా చూశారు. అతను కొందరికి డ్రింక్స్ కొనిచ్చి, అందరితో కలుపుగోలుగా మాట్లాడాడు. కొద్దిసేపట్లో లాబీలోకి హార్బర్ పోలీసులు వచ్చారు. బార్లో అనేక వదంతుల్ని వెబర్ విన్నాడు.
‘ఏం జరిగింది? లాబీలోకి కూడా పోలీసులు అనుమతించడం లేదు’ వెయిటర్ని అడిగాడు.
‘ఒకర్ని పొడిచాడు. హతుడి పేరు వెస్ట్. రెండు నెలల క్రితమే హత్యానేరం లోంచి బయటపడ్డాడు. నా వరకు అతను మంచి వ్యక్తి. పెద్ద టిప్స్ ఇచ్చేవాడు’ వెయిటర్ చెప్పాడు.
‘ఆ కత్తి రీడ్ అనే వ్యక్తిది. అతను మధ్యాహ్నం పడవలో వెళ్లిపోయాడు. రెండు గంటల క్రితం ఆ పడవ మెయిన్‌లేండ్‌లో ఆగింది. కాని అందులో అతను లేడట’ ఆ సంభాషణ విన్న ఓ కస్టమర్ చెప్పాడు.
‘ఐతే ఇక్కడే ఉండి ఉండాలి’ వెబర్ చెప్పాడు.
‘రీడ్ ఆ కత్తితో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని స్వయంగా చెప్పాడు’ బార్ టెండర్ చెప్పాడు.
‘ఐతే అతనీ హత్య చేసి ఉండడు’
‘కాని హత్యాయుధం రీడ్ కత్తే’
వెబర్ ఓ గంటసేపు భోజనం చేస్తూ తన బల్ల ముందు కూర్చున్న వారికి హత్య గురించి థియరీలు చెప్పసాగాడు.
‘మిస్టర్ రీడ్ ఆ టేబుల్ ముందు కుర్చీలో ఒంటరిగా కూర్చునేవాడు. పిచ్చివాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తర్వాత హంతకుడిగా మారాడు.’ వెబర్ ముందు కూర్చున్న మిస్టర్ ఫీల్డింగ్ చెప్పాడు.
‘తన భార్య గురించి ఆలోచిస్తూ అతను ఎవరితో మాట్లాడలేదు’ మిసెస్ ఫీల్డింగ్ చెప్పింది.
‘కాని అతను ఆ పడవలో వెళ్లలేదటగా? అంటే ఇంకా ఇక్కడే ఉండాలి’ వెబర్ భయం నటిస్తూ చెప్పాడు.
‘బహుశ ఈ హత్య చేసాక సముద్రంలోకి దూకి ఉంటాడు’ మిసెస్ ఫీల్డింగ్ చెప్పింది.
‘అలా జరిగి ఉండచ్చు. పోలీసులకి మీ ఆలోచన గురించి చెప్తాను’ వెబర్ ఆనందంగా చెప్పాడు.
లాబీలో ఓ పోలీస్ వెబర్ని ఆపి అతని పేరు అడిగాడు.
‘పాల్ విల్టన్’
‘ఎక్కడ ఉంటారు?’
అడ్రస్ చెప్పాడు.
‘ఏం చేస్తారు?’
‘పాత వస్తువుల వ్యాపారం’
‘అతను మధ్యాహ్నమే వచ్చాడు. పర్యాటకుల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మిస్టర్ బెయిలీ? రీడ్ తన ఎడమ చేతిని కోసుకున్నాడని చెప్పాగా?’ రిసెప్షనిస్ట్ చిరుకోపంగా చెప్పింది.
‘నా ఎడమ చేతికి గాయం కాని, బేండేజ్ కాని లేదు. హత్యా సమయంలో నేను ఇక్కడ లేనే లేను’ వెబర్ గట్టిగా చెప్పాడు.
‘సారీ సర్! ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిని విచారించడం నా బాధ్యత’
‘మిస్టర్ బెయిలీ. రీడ్ గురించి నాకు కొన్ని థియరీలు ఉన్నాయి. మీరు డ్యూటీ దిగాక నా గదికి వస్తే వాటిని మీకు చెప్తాను. గది నంబర్ నలభై రెండు.’
‘్థంక్స్’ బెయిలీ నిరసనగా చెప్పి ఇంకో పర్యాటకుడిని ప్రశ్నించడానికి వెళ్లాడు.
‘సినిమాల్లో మీరు ఓ ప్లాస్టిక్ ఫోల్డర్ని చూపిస్తూంటారు. అందులో ఏం ఉందో స్పష్టంగా కనపడదు. దయచేసి అది చూపిస్తారా?’ వెబర్ అతన్ని అనుసరించి వెళ్లి ప్రశ్నించాడు.
అతను తన బేడ్జ్‌ని తీసి చూపించాడు.
‘ఏంథోనీ జె బెయిలీ. మీ ఫొటో బావుంది. ఈ హత్య గురించి నేనీ రాత్రి ఆలోచిస్తాను. రేపు ఉదయానికల్లా మీకు కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్తాను. నేను చాలా క్రైం సినిమాలు చూసాను’
‘మీరు బార్‌కి కాని, బీచ్‌కి కాని, మీ గదికి కాని దయచేసి వెళ్తారా?’ అతను కోపంగా చెప్పాడు.
* * *
మర్నాడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ హాల్లో వెబర్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. తన టేబిల్ ముందు కూర్చున్న అతిథులతో చెప్పాడు.
‘రాత్రి ఆలోచించాను. మిసెస్ ఫీల్డింగ్ చెప్పింది నిజం. రీడ్ ఆత్మహత్య ఆలోచన విరమించి వెస్ట్‌ని చంపాడు. తర్వాత పశ్చాత్తాపంతో సముద్రంలోకి దూకి చావలేదు. మన మధ్యే ఉన్నాడు. ఎక్కడ దాక్కున్నాడో కాని మళ్లీ ఇంకొకర్ని చంపుతాడు’
‘సీరియస్‌గా చెప్తున్నారా?’ పొలమారిన మిస్ వైన్స్ అడిగింది.
‘లాజికల్‌గా నేను చెప్పేది నిజం. ఈ ఐడియాని మిస్టర్ ఫీల్డింగ్ ఇచ్చారు’
‘ఇది భయంకరమైన ఆలోచన’ మిస్టర్ ఫీల్డింగ్ గొణిగాడు.
ఆ ఉదయం అంతా వెబర్‌ని ఎంత చీదరించుకున్నా విడవకుండా పోలీసులకి, అతిథులకి, పర్యాటకులకి రీడ్‌ని పట్టుకునేందుకు ద్వీపం అంతా అనే్వషించమని, అతను ఇంకొకర్ని ఎక్కడో చంపి ఉంటాడని చెప్పసాగాడు. సాయంత్రానికల్లా వెబర్ గంటగంటకీ పోలీసులకి, హోటల్ సిబ్బందికీ, అతిథులకి రీడ్ ఆ రాత్రి మూడో వ్యక్తిని తప్పక చంపుతాడని, ఎలా చంపుతాడో థియరీలని మార్చిమార్చి చెప్పసాగాడు.
ఆ రాత్రి డిన్నర్ హాల్లో రెండు గంటలపాటు భయంకరమైన సీరియల్ కిల్లర్స్ గురించి చాలామందికి చెప్పాడు. తన థియరీలని పోలీసులు కొట్టి పారేస్తున్నారని, ఆ రాత్రి అమాయకుడు చంపబడతాడని వాపోయాడు.
మర్నాడు ఉదయం రిసెప్షనిస్ట్ అతని గదికి వెళ్లి చెప్పింది.
‘రిజర్వేషన్స్‌లో చిన్న పొరపాటు జరిగింది. దయచేసి మీరు గది ఖాళీ చేయాలి. సాయంత్రం పడవలో వెళ్లిపోవాలి’
బెయిలీ దగ్గర ఆగి చెప్పాడు.
‘నేను వెళ్లిపోతున్నాను. రిజర్వేషన్‌లో తేడాట. నేను వెళ్లచ్చా? మీ అనుమతి ఉందా?’
‘నా వైపు నించి అభ్యంతరం లేదు’
‘కాని నేను ఇక్కడ ఉంటే మీకు ఎంతో సహాయం చేసేవాడిని. నేర పరిశోధన మీద నాకు మంచి అవగాహన ఉంది’
‘చూడండి మిస్టర్. ఆ హత్య జరిగినప్పుడు మీరు ఇక్కడ లేరు. మీరు అందర్నీ అయోమయానికి గురి చేస్తున్నారు’
‘నేను చెప్పింది సరైందని మీరు ఒప్పుకుని తీరాలి. ఓ మనిషి ఇంకో మనిషిని చంపి వెళ్లిపోతూంటే, అపరాధ పరిశోధకులు నేను చెప్పేది వినడం లేదు’ నిస్పృహగా చెప్పాడు.
‘మీరు వెస్ట్‌ని ఎన్నడూ చూడలేదు. రీడ్‌ని కూడా. కాని అంతా తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు’ బెయిలీ అరిచాడు.
‘ఇలా ఉంటే మీరు ఆ హంతకుడ్ని ఎన్నటికీ పట్టుకోలేరని పందెం. నేను వెళ్లచ్చా?’
‘తక్షణం’ బెయిలీ అరిచాడు.
‘సరే. ఏదో రోజు మీరు నన్ను ఇక్కడ ఉండనివ్వనందుకు బాధపడతారు’ చెప్పి వెబర్ హార్బర్ వైపు నడిచాడు.
*

(జీన్ గేరిస్ కథకి స్వేచ్ఛానువాదం)