S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్ కథ

09/22/2018 - 19:31

డెబ్బై ఐదేళ్ల లైనెల్ తెలివైన తన పనిని ఎవరికీ తెలీకుండా చేసేవాడు. అతన్ని తక్కువ మంది గమనించేవారు. అది అతను చేసే పనికి ముఖ్యం. ఈ రోజు అతను చేసే పని ఎప్పటి లాంటిదే. ఆ వృద్ధాశ్రమంలోకి వెళ్లాడు. లోపల ఆయనకి నచ్చని డెటాల్ వాసన వేస్తోంది. రిసెప్షనిస్ట్ ఆయన్ని చూసి అడిగింది.
‘ఏం కావాలి?’
లైనెల్ తన చేతికర్ర మీద వాలి నవ్వుతూ చెప్పాడు.

09/01/2018 - 19:02

ఇంటర్‌స్టేట్ హైవేకి ఉత్తరాన అరవై ఏళ్ల క్రితం కట్టిన చవకైన అపార్ట్‌మెంట్లలో అదొకటి. నేను మెట్లెక్కుతూంటే కింద చాక్లెట్ రేపర్స్, ఖాళీ బీర్ టిన్స్ కనిపించాయి. ముప్పై ఐదో నంబర్ అపార్ట్‌మెంట్ బయట ఆగి తలుపు అరంగుళం తెరచి కనపడింది. సరాసరి లోపలకి వెళ్లకుండా ఎవరైనా వస్తారని బెల్ నొక్కాను. కాని రాలేదు. మరోసారి బెల్ కొట్టినా ప్రయోజనం లేకపోయింది. నేను తలుపుని తోసి అడిగాను.

08/25/2018 - 21:27

సన్నీ కారు దిగి మంచు పేరుకున్న పేవ్‌మెంట్ మీద నడిచి మేరీ కాటేజ్‌కి చేరుకున్నాడు. ఆ చల్లటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఆమె కాటేజ్‌కి అటు, ఇటు, వెనుక డజన్ల కొద్దీ మరికొన్ని కాటేజీలు కనిపిస్తున్నాయి. ఆ కాలనీలో ఇళ్లల్లోని గౌరవనీయమైన వాళ్లు భోజనం ముగించి టీవీ చూస్తూంటారని సన్నీ అనుకున్నాడు. చాలా కిటికీల్లోంచి టీవీ కాంతి కనిపిస్తోంది.

08/18/2018 - 20:35

కెరోల్ మూడు నెలల క్రితం న్యూయార్క్ నగరానికి ఉద్యోగం కోసం వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో టైపిస్ట్‌గా చేరింది. ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ని అద్దెకి తీసుకున్న ఆమె ఫోన్ కోసం అప్లై చేసింది.
ఓ రోజు ఆఫీస్ నించి ఇంటికి వస్తున్న ఆమె ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంట్ బిల్డింగ్ తలుపు తెరచుకుని బయటి వచ్చి, టెలిఫోన్ కంపెనీ వేన్ దగ్గరికి వెళ్లడం చూసింది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి అడిగింది.

08/14/2018 - 19:29

హోటల్ గదిలో దిగాక రసెల్ గడ్డం గీసుకుని స్నానం చేసాడు. తర్వాత లాంజ్‌లోకి వెళ్లి కూర్చుని ఏం చేయాలా అని ఆలోచించాడు. వెయిటర్ని తన దగ్గరికి రమ్మని సౌంజ్ఞ చేసి పింక్ జిన్‌ని ఆర్డర్ చేశాడు. అది తాగుతూంటే రసెల్ దృష్టి లాంజ్‌లోని ఓ షాప్ బయట ఉన్న బోర్డ్ మీద పడింది. గ్రాండ్ హోటల్ లాంజ్‌లో రెయిడ్స్ బేంక్ బ్రాంచ్ పని చేస్తోందని గ్రహించాక అతనికి చూచాయగా ఓ ఆలోచన కలిగింది.

08/04/2018 - 20:14

‘ఏభై వేల డాలర్లు ఇస్తారా? దేనికి?’ సెలబ్ తల మీద గోక్కుని అడిగాడు.
‘అవును. ఏభై వేల డాలర్లు! నన్ను చంపడానికి. నీకు అది సమ్మతమేనా?’ అడిగాను.
‘ఆ.. కాని చంపాక మరణశిక్ష పడితే అప్పుడు డబ్బేం చేయను?’ సెలబ్ మళ్లీ తల గోక్కుని ప్రశ్నించాడు.
‘నేను మూర్ఖుడ్ని కాను. నీకు మరణశిక్ష పడదు. అసలు నీకు శిక్షే పడదు’
‘మిమ్మల్ని ఎవరు చంపారో ఎవరికీ తెలీకుండా చంపాలా?’

07/21/2018 - 18:33

ఆ కేబిన్ బయట తడిగా, చలిగా, చీకటిగా ఉంది. చేతిలో చేటతో బయటకి వచ్చిన పదిహేనేళ్ల శాలీ మణికట్టు చుట్టూ అతని వెచ్చని వేళ్లు బిగుసుకున్నాయి.
‘్భయపడక. నినే్నం చేయను. లోపలకి వెళ్దాం పద. మనిద్దరం ఇక్కడే ఉంటే మంచుకి టార్గెట్స్ అవుతాం’ చెప్పాడు.
‘నేను చెత్తని పారబోయాలని బయటకి వచ్చాను’ శాలీ చెప్పింది.
‘ఐతే పారబోయి. పక్కనే చెరువు ఉండడం వల్ల ఇక్కడ చల్లగా ఉంటుంది.’

07/14/2018 - 20:13

అది ఆ సంవత్సరంలోని అతి చలి రోజు. లెఫ్టినెంట్ బర్టన్ గ్లవ్స్‌ని ఇంటి దగ్గరే మర్చిపోయాడు. పార్కింగ్ లాట్ లోంచి పెట్రోల్ కార్‌ని బయటకి పోనిస్తూంటే, స్టీరింగ్ వీల్ చాలా చల్లగా తగలడంతో తన షిఫ్ట్ మొత్తం గ్లవ్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కారు ఫెర్రీస్ స్ట్రీట్‌లోకి మళ్లగానే అక్కడ అనేక చిన్న దుకాణాల సముదాయం కనిపించింది. బర్టన్ బీట్లో, అంతేకాక ఆ ఊరి మొత్తానికి అది నేరమయమైన ప్రదేశం.

07/07/2018 - 23:34

ఎథెల్ ఆ ఉదయం దినపత్రికని తెరవగానే మూడో కాలంలో ఆ వార్త కనిపించింది.
హత్యకి కారణం అనే్వషణ
‘దీనికి కారణం మీకు ఎప్పటికైనా నేను చెప్తే తెలుస్తుందా?’ ఎథెల్ ఆ వార్తని చదవగానే మనసులో అనుకుని చదవడం కొనసాగించింది.

06/30/2018 - 23:53

మేల్కోం, డేవిడ్ మిత్రులు. లాయర్లు. లాయర్ ప్రాక్టీస్‌లో భాగస్వాములు కూడా. ఆ ఉదయం డేవిడ్ ఆఫీస్‌కి వచ్చాక ది టైమ్స్ దిన పత్రికని చదివాడు. తర్వాత తన భాగస్వామి మేల్కోంని గట్టిగా అడిగాడు.
‘ఏంబ్రోస్ స్వెండర్ మన క్లైంట్ కదూ?’
‘అవును. ఆ వింత మనిషే కదా? ఏం?’ మేల్కోం ప్రశ్నించాడు.

Pages