S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/08/2016 - 07:25

హైదరాబాద్, జనవరి 7: మెదక్ జిల్లా పటాంచెర్వు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనర్హతకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసుపై సమగ్రమైన వాదనలు వినకుండా, విచారణ జరపకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. బిజెపి నేత రఘునందనరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

01/08/2016 - 07:24

హైదరాబాద్, జనవరి 7: మిషన్ భగీరథకు అటవీ శాఖ నుంచి అడ్డంకులు తొలగిపోయాయి, ఎలక్ట్రికల్ పనుల్లో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ వేగాన్ని పెంచింది. దీంతో ఏప్రిల్ 30 నాటికి హైదరాబాద్ మెట్రో సెగ్మెంట్‌లోని తొమ్మిది నియోజక వర్గాలకు మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీటిని అందిస్తారు.

01/08/2016 - 07:22

హైదరాబాద్, జనవరి 7: మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియా (ఐసిస్) నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఐసిస్ గురించి తెలియకపోతే నోరు మూసుకోవాలని ట్విట్టర్‌లో బెదిరింపు వచ్చింది.

01/08/2016 - 06:51

హైదరాబాద్, జనవరి 7:శాసన మండలికి ఎన్నికైన పది మంది టిఆర్‌ఎస్ సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ జూబ్లీ హాలులోని దర్బారు హాలులో మండలి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు,తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్‌రెడ్డి, ఎంపి కవిత, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

01/08/2016 - 06:50

మహబూబ్‌నగర్/నిజామాబాద్/ కరీంనగర్ /మెదక్/నల్లగొండ/ఆదిలాబాద్/వరంగల్, జనవరి 7: దీర్ఘకా లంగా పెండింగ్‌లో ఉన్న ఫీజుల రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో విద్యార్థులు అందోళనకు దిగారు. కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం పలు జిల్లాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది.

01/08/2016 - 06:49

హైదరాబాద్/సైదాబాద్, జనవరి 7: తెలంగాణ జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భారత గణతంత్య్ర దినోత్సవం రోజున క్షమాబిక్ష పొందిన దాదాపు 300మంది ఖైదీలను విడుదల చేస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. క్షమాబిక్ష ఖైదీలకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి నివేదికలందాయని, వారి విడుదలకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

01/08/2016 - 06:48

గజ్వేల్, జనవరి 7: తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా ములుగు శివారులో ఉద్యానవన యూనివర్సిటీ, అటవీ కళాశాలల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.

01/08/2016 - 06:47

ఖమ్మం, జనవరి 7: తెలంగాణ రాష్ట్రంలో 70,880 కిలోమీటర్ల పొడవున ఉన్న పంచాయతీరాజ్ రోడ్లను 5,474 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయితీరాజ్ ఎం సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం ఖమ్మం వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిటి, మెటల్, మట్టి రోడ్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారీ మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు.

01/08/2016 - 06:33

హైదరాబాద్, జనవరి 7: పఠాన్ కోట్, పారిస్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణలోని ప్రధాన నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత మరింత పెంచారు. హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్‌లలో పోలీసులను మోహరించారు.

01/08/2016 - 06:32

హైదరాబాద్, జనవరి 7: వచ్చే ఎన్నికల్లో తాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రాజులతో గురువారం కెటిఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

Pages