S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/13/2016 - 08:11

హైదరాబాద్, జనవరి 12: హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం బ్రిక్స్ బ్యాంకు నుంచి 30వేల కోట్ల రూపాయల రుణానికి ప్రతిపాదనలు పంపించినట్టు ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టియుడబ్లుజె) హెయుజె, టిఎస్‌పిజెఎ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్‌ది ప్రెస్‌లో కెటిఆర్ మాట్లాడారు.

01/13/2016 - 08:14

హైదరాబాద్, జనవరి 12: ప్రతి మనిషి ఆత్మబలంతో ఎంతటి కార్యానైనా జయించవచ్చని, అదే ఆత్మబలంతో జ్యోతిష్యాన్ని అధిగమించవచ్చని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఉద్బోధించారు. యువశక్తిని అనుకూలంగా ఉపయోగించుకోవాలని, భారతదేశ జనాభాలో 60 శాతం యువత ఉందని, యువశక్తితో దేన్నయినా సాధించవచ్చని స్వామిజీ అన్నారు.

01/13/2016 - 06:53

ఎన్‌సిపి అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ మంగళవారం హైదరాబాద్‌లో సిఎం కె చంద్రశేఖర్ రావును కలిశారు. ఇరువురి మధ్యా చర్చలు జరిగినా సారాంశాన్ని గోప్యంగా ఉంచారు. తన నివాసానికి వచ్చిన పవార్‌కు మెమెంటో అందచేస్తున్న సిఎం కెసిఆర్

01/13/2016 - 06:51

హైదరాబాద్, జనవరి 12: దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌తో ఆలింగనం చేసుకోవడం, తెలంగాణలో బిజెపి చంద్రబాబుతో ములాఖత్ కావడం ప్రజలను నిలువునా మోసం చేయడమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. కేంద్రంలో మోదీ, ఆంధ్ర సిఎం, తెలంగాణ సిఎంలను నమ్మవద్దని, వారి మాటలకు మోసపోవద్దని ప్రజలను కోరారు.

01/13/2016 - 06:43

హైదరాబాద్, జనవరి 12: మిషన్ భగీరథ పథకం భాగంగా తాగునీటి సరఫరా కోసం పైపులైన్లు వేసే పనులు మెదక్ జిల్లాల్లో చురుకుగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు చెందిన మెదక్ జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం మీదుగా వెళ్లనున్న పైపులైన్ కోసం మంగళవారం తవ్వకం పనులు ప్రారంభం అయ్యాయి. రైట్ ఆఫ్ వే చట్టం ప్రకారం పైపులైన్లను వ్యవసాయ క్షేత్రంలో వేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు.

01/13/2016 - 05:52

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణ బ్రాహ్మణ సమాజంలో ఆర్థికంగా వెనకబడిన పేదల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. సిఎం చంద్రశేఖరరావు ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ ఎన్నికల నేపథ్యంలో నియమావళి అమల్లో ఉంది.

01/12/2016 - 12:08

హైదరాబాద్: తనను ప్రేమించాలంటూ ఓ యువకుడు యువతి కుటుంబంపై దాడిచేసి, ఆమె ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన ఫిల్మ్‌నగర్ సమీపంలోని అంబేద్కర్‌నగర్‌లో మంగళవారం జరిగింది. అగ్నిప్రమాదం నుంచి యువతి కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడ్డారు. ప్రేమ పేరిట వేధిస్తున్న యువకుడిపై ఆ యువతి ఇటీవల కేసు పెట్టింది. రెండు రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన ప్రేమికుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

01/12/2016 - 12:05

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 17న మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 21 వరకు గడువు పెట్టారు. 150 వార్డులకు ఫిబ్రవరి 2న పోలింగ్ నిర్వహిస్తారు. 5న మేయర్ ఎన్నిక జరుగుతుంది.

01/12/2016 - 06:16

హైదరాబాద్, జనవరి 11: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మంగళవారం తెదేపా-్భజపా సంయుక్తంగా నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ఇరు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు.

01/12/2016 - 06:14

హైదరాబాద్, జనవరి 11: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని తెరాస సాధించకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, తెరాస గెలిస్తే కాంగ్రెస్, బిజెపి, తెదేపా నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఐటి మంత్రి కె తారక రామారావు సవాల్ చేశారు. గ్రేటర్‌లో తెరాస వంద స్థానాల్లో విజయం సాధిస్తుంది. మేయర్ పీఠంపై తెరాస అభ్యర్థి ఉంటారన్నారు.

Pages