S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/09/2016 - 00:59

హైదరాబాద్: ‘సుదీర్ఘకాల పోరాటాల అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి మహారాష్ట్రంతో చేసుకున్న ఒప్పందం దోహదపడుతుంది’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. గోదావరి జలాలలో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.

03/09/2016 - 00:43

ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టులు
1. ప్రాణహిత ప్రాజెక్టు (తమ్మిడిహట్టి బ్యారేజి),
కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజి)
2. లెండి ప్రాజెక్టు
3. పెనుగంగపై రాజుపేట వద్ద బ్యారేజీ
4. పెన్‌గంగపై చనాఖా-కొరాట మధ్య బ్యారేజీ
5. పెన్‌గంగపై పంపరాడ్ వద్ద బ్యారేజీ
6. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు

03/09/2016 - 00:23

హైదరాబాద్: మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. 11వ తేదీన వీరి చేరికకు ముహూర్తం ఖరారైంది. అరికెపూడి గాంధీ చాలా రోజుల నుంచి టిఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మాగంటి గోపీనాథ్ మాత్రం తొలుత పార్టీ మారే ఆలోచన చేయకపోయినా గ్రేటర్ ఫలితాల తరువాత పునరాలోచనలో పడ్డారు.

03/08/2016 - 18:38

వరంగల్: ఇక్కడి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సందీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఇతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయమై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

03/08/2016 - 18:19

హైదరాబాద్:ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినపుడు ఎంత సంతోషం కలిగిందో గోదావరిపై ప్రాజెక్టుల విషయంలో ఇవాళ మహారాష్టత్రో చేసుకున్న ఒప్పందం అంత ఆనందాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మహారాష్టన్రుంచి తిరిగివచ్చిన ఆయన బేగంపేట విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికిన శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

03/08/2016 - 17:34

హైదరాబాద్:గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టులు నిర్మించే విషయంలో మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అవగాహన కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ముంబై వెళ్లిన ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో కలసి సంతకాలు చేశారు. ఈ పర్యటన దిగ్విజయం కావడంతో తెలంగాణ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మంగళవారం సాయంత్రం కెసిఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికాయి.

03/08/2016 - 16:13

కరీంనగర్: జగిత్యాల మండలం పొలాస వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో నుంచి జారిపడి ఓ మహిళ మరణించింది. సహచర ప్రయాణీకులు ఆస్పత్రికి తరలించేలోగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

03/08/2016 - 08:02

హైదరాబాద్: తెలంగాణ టిడిపిలో మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే. వారిలో కూడా ఇద్దరు చేజారిపోతున్నారా? అనే అనుమానాలు సొంత పార్టీ నాయకుల్లోనే వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి సభ సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ గైర్హాజరయ్యారు. దీంతో పార్టీలో గుసగుసలు ప్రారంభమయ్యాయి.

03/08/2016 - 07:55

హైదరాబాద్: దేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని, ఉగ్రవాదుల కదలికలపై నిఘావర్గాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ సూచించారు.

03/08/2016 - 07:43

హైధరాబాద్: పాతబస్తీలో శివరాత్రినాడు విషాదం చోటుచేసుకుంది. బహాదూర్‌పురా పోలీస్టేషన్ పరిధిలోని కిషన్‌బాగ్‌లో గల అతి పురాతన దేవాలయంలో కాశీబుగ్గా శివాలయం ఒకటి. ఈ దేవాలయంలో శివరాత్రి వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి పెద్దఎత్తున ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. దేవాలయంలో ఒకేసారి భక్తుల రద్దీ పెరిగింది. కాశిబుగ్గా దేవాలయంలో అకస్మాత్తుగా విద్యుత్ వైర్లు భక్తులపై పడ్డాయి.

Pages