S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/28/2016 - 05:50

హైదరాబాద్, మార్చి 27: విదేశీయులు సైతం భారతీయ సంస్కృతిని గౌరవించి జేజేలు పలుకుతుంటే, ఈ దేశంలో ఉంటూ భారత్‌మాతాకు జై..అని అనను అనే వారిని ఏమనాలని, జన్మనిచ్చిన తల్లిని అమ్మా అని పిలవను అనే మూర్ఖులను ఏమనగలమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. అమ్మను ఆరాధించవద్దని ఏ మతం చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.

03/28/2016 - 04:38

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1లో 49, గ్రూప్-2లో 438 ఖాళీలను భర్తీ చేయడానికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుమతిచ్చిందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం తెలంగాణ శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో బిజెపి సభ్యుడు ఎన్.రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మట్లాడుతూ లక్షా ఏడు వేల ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

03/28/2016 - 02:49

హైదరాబాద్, మార్చి 27: వెనుకబడిన తరగతుల హాస్టళ్లను దశల వారీగా గురుకుల పాఠశాలలుగా మార్చబోతున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న వెల్లడించారు. శాసనసభలో ఆదివారం బిసి సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో టిడిపి సభ్యులు ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి జోగురామన్న సమాధానం ఇస్తూ, రాష్ట్రంలో దశల వారిగా బిసి హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మార్చుతున్నామన్నారు.

03/28/2016 - 02:48

హైదరాబాద్, మార్చి 27: ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ సవతి తల్లి ప్రేమ చూపించేది మీ కన్నతల్లే( కాంగ్రెస్) అని విమర్శించారు.

03/28/2016 - 02:47

ఆదిలాబాద్, మార్చి 27: నైతిక విలువలు పతనమవుతున్న నేపథ్యంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించి ప్రజల్లో విశ్వాసం చురగొనాలని మహారాష్ట్ర అదనపు డిజిపి, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ మెడికల్ కళాశాల (రిమ్స్)లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మినారాయణ కీలకోపన్యాసం చేశారు.

03/28/2016 - 02:44

నల్లగొండ / కరీంనగర్, మార్చి 27: ఎండలు ఠారెత్తిస్తున్నాయ. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట వడదెబ్బకు గురై జనం ప్రాణాలు వదులుతున్నారు. నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో నలుగురు వడదెబ్బకు అస్వస్థతకు గురై మరణించారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన రమావత్ బాల (45) పశువులను మేపడానికి వెళ్లి.. వడదెబ్బకు గురికాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా శనివారం రాత్రి మరణించాడు.

03/28/2016 - 02:43

వరంగల్, మార్చి 27: హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావును రీకాల్ చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ నగరంలోని హన్మకొండ అంబేద్కర్ భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వెంటనే విధులకు హాజరుకావడం విద్యార్థులకు ఆగ్రహాన్ని తెప్పించే విషయమన్నారు.

03/28/2016 - 02:42

హైదరాబాద్, మార్చి 27: విజయ డైరీని ప్రోత్సహించి, బలోపేతం చేయడానికే దానికి పాలుపోసే రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయాల చొప్పున ధర పెంచినట్టు వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. పెంచిన ధర మేరకు విజయడైరీకి రూ.16 కోట్ల 30 లక్షలు విడుదల చేశామని, ఈనెలాఖరు వరకు రైతులకు సంబంధించిన బకాయిలన్నీ చెల్లించనున్నట్టు మంత్రి చెప్పారు.

03/28/2016 - 02:41

చౌటుప్పల్, మార్చి 27: మిషన్‌కాకతీయ పథకం అధికార పార్టీ నాయకుల జేబులు నింపేందుకు ఉపయోగపడుతోందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

03/28/2016 - 02:23

భద్రాచలం, మార్చి 27: ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మించ తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సమగ్ర సర్వేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టేకులపల్లి మండలం రోళ్లపాడుకు గోదావరి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన పథకానికి ఇటీవలే ముఖ్యమంత్రి కెసీఆర్ శంకుస్థాపన చేశారు.

Pages