S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/30/2016 - 04:16

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న 25,589 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ శాసన మండలిలో సభ్యులు కర్నె ప్రభాకార్, గంగాధర్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.

03/30/2016 - 04:13

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ మార్కెట్ యార్డుల్లో వివిధ సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు, ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్కెట్ యార్టుల కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి చేసిన సూచనను అప్పటికప్పుడు బిల్లులో చేర్చుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

03/30/2016 - 04:12

సిరిసిల్ల, మార్చి 29: వస్త్ర ఉత్పత్తి రంగంలో సరయిన గిట్టుబాటు ధర లేక రూ 23 లక్షల మేర అప్పుల పాలయ్యానని గత నెల రోజులుగా అదృశ్యమైన సిరిసిల్ల పవర్‌లూమ్ ఆసామి రవీందర్ చెప్పారు. అప్పులిచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి తీఅవమైన ఒత్తిడి చెచ్చారని, ఈ స్థితిలో ఏం చేయాలో దిక్కు తోచక ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయానికి వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చానని చెప్పారు.

03/30/2016 - 04:07

హైదరాబాద్, మార్చి 29 : ముఖ్యమంత్రిని అధికారపక్షం సభ్యులు పొ గడటంలో వింతేమీలేదు. కానీ విపక్షసభ్యులు పొగిడితే అది విశేషమే. తెలంగాణ శాసనసభలో ఆ విశేషదృశ్యం సాక్షాత్కరించింది. నియోజికవర్గాలకు ఎమ్మెల్యేల తరపున నిధులు పెంచాలన్న అంశంపై శాసనసభలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భోళాశంకరుడిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం.

03/30/2016 - 04:03

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖల తెచ్చి న వివిధ మార్పుల వల్ల రాష్ట్రానికి పన్ను ల రూపంలో రూ.32వేల కోట్ల రూపాయల ఆదాయం చేకురిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.

03/30/2016 - 04:03

ఇటిక్యాల, మార్చి 29: ముక్కుపచ్చలారని చిన్నారులను అతికిరాతకంగా చంపిన కసాయి తండ్రి తాను కూడా ఉరి వేసుకుని తనువు చాలించిన హృదయవిదారక సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా, మానవపాడు మండల పరిధిలోని పల్లెపాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనను చూసిన గ్రామస్థులకు కంటతడి పెట్టించింది.

03/30/2016 - 04:01

హైదరాబాద్, మార్చి 29: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విద్యార్థులు, వైస్ ఛాన్సలర్ మధ్య సమన్వయం ఏర్పరచి అనుకూల వాతావరణం కల్పించాలని కోరుతూ వినోద్‌కుమార్ అనే ప్రొఫెసర్ పిటిషన్ దాఖలు చేశారు.

03/30/2016 - 04:00

సూర్యాపేట, మార్చి 29: మైనార్టీవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌కు ధీటుగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు రాష్టవ్య్రాప్తంగా 120 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎసిబి డైరెక్టర్ జనరల్, మైనార్టీ వెల్ఫేర్ బోర్డు కమిటీ కార్యదర్శి ఎకె.ఖాన్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలో 70 పాఠశాలలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

03/29/2016 - 16:42

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తమను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కొందరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు వేసిన పిటిషన్‌పై క్యాట్ మంగళవారం తీర్పునిచ్చింది. మొత్తం 15 మంది అధికారులను తెలంగాణలోనే పనిచేయనీయాలని ఆదేశించింది. సోమేశ్‌కుమార్‌, అనంతరాము, శంషేర్‌, ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్‌, వాకాటి కరుణ, రంగనాధ్‌, అంజనికుమార్‌లు తెలంగాణలోనే పనిచేయాలని క్యాట్‌ తీర్పు ఇచ్చింది.

03/29/2016 - 16:45

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రశాంతత నెలకొనేలా విద్యార్థులు, అధ్యాపకులతో సమన్వయ కమిటీని నియమించాలని హైకోర్టులో మంగళవారం ప్రొఫెసర్ వినోద్‌కుమార్ ‘పిల్’ (ప్రజా ప్రయోజన వాజ్యం) దాఖలు చేశారు. దీంతో హెచ్‌సియు వీసీ, రిజిస్ట్రార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్, విద్యార్థి సంఘాల నేతలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండువారాల తర్వాత విచారణ జరుగుతుందని న్యాయస్థానం ప్రకటించింది.

Pages