S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/31/2016 - 05:52

హైదరాబాద్, మార్చి 30: ఇంటింటికి మంచినీరు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ భగీరథ వంటి పథకాలు మంచివేనని తామేమీ వ్యతిరేకించడం లేదని, కానీ గ్రామాల్లో కరువు పరిస్థితి దయనీయంగా ఉందని, తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. బుధవారం శాసన సభలో కరవుపై జరిగిన చర్చలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.

03/31/2016 - 05:51

హైదరాబాద్, మార్చి 30: కరవు నివేదికను సకాలంలో కేంద్రానికి పంపడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని టిడిపి సభ్యులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి, బిజెపి సభ్యుడు ఎన్‌వివిఎస్ ప్రభాకర్ ఆరోపించారు.

03/31/2016 - 05:51

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ శాసన సభ గురువారం ఒక రికార్డును సృష్టించనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి వివరిస్తారు. శాసన సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇదే మొదటి సారి.

03/31/2016 - 05:20

హైదరాబాద్, మార్చి 30: అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే అభివృద్ధి దిశగా వేసుకుంటున్న పునాదుల దశలోనే దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, అయినా తాము పొంగిపోమని, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్‌వన్ స్థానంలో నిలబెట్టే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

03/31/2016 - 05:19

కరీంనగర్ టౌన్, మార్చి 30: ఆస్తిపన్ను వసూలులో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని అదనపు జాయింట్ కలెక్టర్ డా. ఎ.నాగేంద్ర అన్నారు.

03/31/2016 - 05:31

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ శాసనమండలిలో బుధవారం ఆరు ప్రధాన బిల్లులపై చర్చ జరిగి, ఆమోదముద్ర పడింది. అనంతరం బిల్లులను శాసన మండలి ఆమోదిస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.

03/31/2016 - 05:17

మహబూబ్‌నగర్, మార్చి 30: ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పించిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి లైన్ క్లియర్ అయ్యింది. కొందరు పథకం టెండర్లు, భూసేకరణ విషయంలో హైకోర్టుకు వెళ్లగా గత రెండు రోజుల క్రితం హైకోర్టు ధర్మాసనం కూడా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సానుకూలంగా తీర్పును ఇచ్చింది.

03/31/2016 - 05:16

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో నిధులు స్తంభించిపోవడం, ఖర్చులలో సరైన విధానం లేదని కాగ్ ఎత్తిచూపింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2015 మార్చి 31 నాటికి మొత్తం రూ. 33001 కోట్లు ఖర్చయింది. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల తొలి అంచనాలను రూ. 13,356 కోట్ల మేర పెంచారు.

03/31/2016 - 05:14

హైదరాబాద్, మార్చి 30: ప్రైవేట్ విద్యను కట్టడి చేయకుండా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడం సాధ్యం కాదని శాసనసభలో పాలక, ప్రతిపక్ష సభ్యులు ముక్తకంఠంగా తేల్చి చెప్పారు.

03/31/2016 - 04:57

హైదరాబాద్, మార్చి 30: ఎం-వ్యాలెట్‌ను తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి బుధవారం సచివాలయంలో ప్రారంభించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి బుక్, వాహన బీమా వంటి పత్రాలను ఇక నిరంతరం వాహనంతో పాటు వెంట తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు ఎం-వ్యాలెట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని వాహన సర్ట్ఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Pages