S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/01/2016 - 02:50

నల్లగొండ, వరంగల్, మార్చి 31: వరంగల్, నల్లగొండ జిల్లాలో వడదెబ్బకు అస్వస్థతకు గురై నలుగురు మరణించారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ముగ్గురు మరణించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన మర్రి వెంకన్న (40)అనే తాపిమేస్ర్తీ వడదెబ్బతో అస్వస్థతకు గురై గురువారం మృతిచెందాడు.

04/01/2016 - 02:47

హుజూరాబాద్, మార్చి 31: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ టీంకు హుజూరాబాద్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళ్లే..

04/01/2016 - 02:46

హైదరాబాద్, మార్చి 31: సిఎం కెసిఆర్ చక్రవర్తిలా ఆయన కుటుంబ సభ్యులు సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శాసన సభను టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం ప్రభుత్వ ఏకపక్ష దోరణికి నిదర్శనమన్నారు.

04/01/2016 - 02:24

గుండాల, మార్చి 31: నల్లగొండ జిల్లా గుండాల మండల కేంద్రంలో ఫిలిపోజు కొండయ్య (110)నే శతాధిక వృద్ధుడు గుఠువారం మృతిచెండారు. కొండయ్య మృతదేహంపై కమ్యూనిస్టు నాయకులు ఎర్ర కండువాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి కొండయ్య అని కొనియాడారు.

03/31/2016 - 18:05

హైదరాబాద్: జల విధానం, సాగునీటి ప్రాజెక్టులపై గురువారం అసెంబ్లీలో తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా కాంగ్రెస్, బిజెపి సభ్యులు గైర్హాజరు కావడాన్ని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా ఇలా సభకు రాకపోవడం ఏం సంప్రదాయం అని ఆయన ప్రశ్నించారు. ఏదో సాధిస్తారని గెలిపించిన ప్రజలకు గైర్హాజర్ గురించి విపక్ష సభ్యులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.

03/31/2016 - 18:03

మహబూబ్‌నగర్: వాతావరణం ఆకస్మికంగా చల్లబడి ఉరుములు, పిడుగులు కురియడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు మరణించారు. దామరగిద్ద మండలం ఉద్మిల్‌గిద్ద వద్ద పిడుగుపడి తల్లి, కూతరు మృతిచెందారు. తలకొండపల్లి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద పిడుగుపడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

03/31/2016 - 18:03

కరీంనగర్: కమలాపూర్ మండలం వంగవల్లి వద్ద గురువారం బొగ్గులోడుతో వెళుతున్న లారీ ఓ జీపును ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

03/31/2016 - 17:32

హైదరాబాద్: వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల తెలంగాణలో గురువారం కొన్ని చోట్ల చిరుజల్లులు కురియగా వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెదక్ జిల్లా పటాన్‌చెరులో జల్లులు కురిశాయి. వరంగల్ జిల్లా కట్కూర్‌లో వడగళ్లు కురియగా, చేర్యాల మండలంలో గాలులు వీచాయి. జల్లులతో వేసవి తాపం తగ్గినా, మామిడి పిందెలు రాలిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

03/31/2016 - 17:32

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేటు వద్ద గురువారం నాడు కేరళకు చెందిన సిపిఎం ఎంపీలు ఆందోళన చేపట్టారు. హెచ్‌సియులో ఇటీవల జరిగిన పరిణామాలను తెలుసుకుని విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వారు వచ్చారు. అయితే, వారిని వర్సిటీలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాన గేటు వద్ద కేరళ ఎంపీలు ఆందోళనాకార్యక్రమాన్ని చేపట్టారు.

03/31/2016 - 17:32

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై చర్చ అనంతరం తెలంగాణ శాసనమండలి సమావేశాలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. జల విధానం,నీటి ప్రాజెక్టుల గురించి మంత్రి హరీష్ రావు వివరించారు.

Pages