S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/01/2016 - 12:02

మహబూబ్‌నగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన గృహిణి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అడ్డాకుల మండలం మూసాపేటలో ఈ ఘటన జరిగింది.

04/01/2016 - 04:19

హైదరాబాద్, మార్చి 31: ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్‌ను మూడు వారాల్లోగా పునరుద్దరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రజలు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించేందుకు వీలుగా అన్ని విధాల పొందుపరుస్తామని వెల్లడించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది నజీబ్ ఖాన్ వివరణ ఇస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు.

04/01/2016 - 04:18

హైదరాబాద్, మార్చి 31:ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చట్టసభల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. శాసన సభ చరిత్రలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయడం ఇదే తొలిసారి. గురువారం ఉదయం 11 గంటలకు శాసన సభ సమావేశం ప్రారంభం అయింది. శాసన సభ సమావేశం ప్రారంభం కాగానే తొలుత రుణ విముక్తి బిల్లును సభ ఆమోదించింది.

04/01/2016 - 04:18

హైదరాబాద్, మార్చి 31: నీటిపారుదల ప్రాజెక్టుల్లో పాత వాటిని (పెండింగ్) రెండేళ్ళలో, కొత్త వాటిని ఐదేళ్లలో ఎట్టి పరిస్థితులలో పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రాణాలు పోయినా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

04/01/2016 - 02:56

హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటంలో భాగంగా చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు దేశానికి ఆదర్శ సిఎంగా నిలిచారని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

04/01/2016 - 02:55

హైదరాబాద్, మార్చి 31: రైతుల రుణవిముక్తి బిల్లును గురువారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బిల్లును ప్రవేశపెట్టారు. బ్యాంకుల నుంచి రుణాలు లభించక రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తీసుకున్నప్పుడు వారి ఆస్తులు రాయించుకోవడం వంటి సంఘటనలు నివారించేందుకు రుణవిముక్తి చట్టం తీసుకు వచ్చారు.

04/01/2016 - 02:54

నాగార్జునసాగర్, మార్చి 31: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం ద్వారా శుక్రవారం నుండి ఎడమకాల్వకు డ్యాం అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. గత 2 నెలలుగా ఎడమకాల్వ పరిధిలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. వాయిదా వేసుకుంటూ వచ్చిన ఎడమకాల్వ నీటి విడుదల విషయంలో గురువారం అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు.

04/01/2016 - 02:53

నిజామాబాద్, మార్చి 31: కరవు ఛాయలు దట్టంగా అలుముకుని ఉన్న నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రానున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా, ఇదివరకు మూడు పర్యాయాలు జరిగిన పర్యటనలకు భిన్నంగా ఈసారి సిఎం పర్యటన షెడ్యూల్‌ను రూపొందించారు.

04/01/2016 - 02:52

నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, మార్చి 11: ఆకాశంలో మేఘమే కనిపించని వేళ గురువారం ఒక్కసారిగా పడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వాతావరణం చల్లపడిందని ఒకపక్క సంతోషంగా ఉన్నా, మరోపక్క పంటలు దెబ్బతిని రైతాంగం, పిడుగుపాటుకు ఆప్తుల్ని కోల్పోయన కుటుంబాలు కన్నీరు మున్నీర వుతున్నాయ. గురువారం సాయంత్రం నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లవాన పంటలకు చేటు తేగా..

04/01/2016 - 02:52

చిత్రం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు
ముగిసిన సందర్భంగా రాజ్‌భవన్‌లో
మర్యాదపూర్వకంగా
గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన
ముఖ్యమంత్రి కెసిఆర్

Pages