S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/02/2016 - 03:32

కరీంనగర్, ఏప్రిల్ 1: పార్లమెంటరీ సంప్రదాయానికి భిన్నంగా అసెంబ్లీ వేదికగా సిఎం కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని, దీనికి స్పీకర్ అనుమతించడం సరికాదని జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. అయినా, సిఎం కెసిఆర్ ప్రసంగంలో కొత్త అంశాలేమి లేవని విమర్శించారు.

04/02/2016 - 03:30

హైదరాబాద్, ఏప్రిల్ 1: మహానగర పాలక సంస్థలోని కొందరు ఇంజనీర్ల నిర్వాకం కారణంగా ముప్పై ఏళ్లుగా కొన‘సాగు’తున్న చార్మినార్ పాదచారుల క్షేత్రం పనులను రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు శుక్రవారం పరిశీలించారు.

04/02/2016 - 03:27

నల్లగొండ, ఏప్రిల్ 1: దేశ చరిత్రలో ఇంతకముందెన్నడూ లేని రీతిలో శాసన సభ సంప్రదాయాలను ఖూనీ చేసి సిఎం కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసి ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని పిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం నల్లగొండలో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.్భస్కర్‌రావు, ఉత్తమ్ పద్మావతిలతో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

04/02/2016 - 03:24

వరంగల్, ఏప్రిల్ 1: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం వరంగల్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరంగల్ జిల్లా నుండే విద్యా మార్పులకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు.

04/02/2016 - 03:22

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 1: మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుండి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలన్న ఆయకట్టు రైతులు పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. 15 రోజులుగా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని ఆందోళన బాట పట్టిన రైతాంగం డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

04/01/2016 - 18:14

హైదరాబాద్: నగరంలోని బల్కంపేట ప్రాంతంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా సుమారు 500 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకుని, ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

04/01/2016 - 18:13

హైదరాబాద్: తెలంగాణ సర్కారు గొప్పలకు పోయి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని అసెంబ్లీలో బిజెపి నేత లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలను ‘కాగ్’ సైతం ఎండగట్టిందని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి, విపక్షాల గొంతు నొక్కేసిందన్నారు.

04/01/2016 - 18:12

నల్గొండ: జల విధానాన్ని వివరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సిఎం కేసీఆర్ అసెంబ్లీ సంప్రదాయాలను మంట గలిపారని టి.పిసిసి అధినేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని, నీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ సాంకేతికంగా సరికాదన్నారు. ఇప్పటికే చేపట్టిన నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు.

04/01/2016 - 18:12

నిజామాబాద్: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల కలలు సాకారం కావాలంటే సంక్షేమ పథకాల అమలులో లక్ష్యసాధన కోసం అధికారులు శ్రమించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ జిల్లాలో కరవు పరిస్థితులపై అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాల మాదిరి కాకుండా అనుకున్నది సాధించేలా పనిచేస్తేనే సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయన్నారు.

04/01/2016 - 17:18

హైదరాబాద్: సిఎం కేసీఆర్ చెబుతున్నట్లు రాబోయే 30 నెలల కాలంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తాను గుండు కొట్టించుకుంటానని మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి శుక్రవారం సవాల్ విసిరారు. సిఎం క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టర్ల హవా నడుస్తోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని ఆరునెలల్లో ఎందుకు రెట్టింపు చేశారని ఆయన ప్రశ్నించారు.

Pages