S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/03/2016 - 11:39

గజ్వేల్, ఏప్రిల్ 2: విద్యారంగ సమస్యలను టిఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని, గత మూడేళ్ళుగా స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎన్‌ఎస్‌యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్‌ఖాన్ విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు.

04/03/2016 - 11:38

నల్లగొండ, ఏప్రిల్ 2: సిఎం కెసిఆర్ ప్రాజెక్టులపై శాసనసభలో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అద్భుతమని దేశ చరిత్రలో తొలిసారిగా ఒక సిఎం ఇంత అవగాహనతో ప్రాజెక్టులపై వివరించడం అభినందనీయమని కాంగ్రెస్ శాసన సభ పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

04/03/2016 - 11:29

కొత్తగూడెం రూరల్/చండ్రుగొండ, ఏప్రిల్ 2: ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. వృద్ధులు పండుటాకుల్లా రాలిపోతున్నారు. కొత్తగూడెం ఏరియాలో శనివారం ఒక్క రోజే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు గ్రామానికి చెందిన వీరయ్య (65) శుక్రవారం ఉదయం చేను పనికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

04/03/2016 - 11:28

ఏలేశ్వరం, ఏప్రిల్ 2: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా తాను ఈ నెల 8న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ప్రకటించారు. శనివారం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వరుపుల ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొంత కాలంగా వరుపుల అధికార టిడిపిలోకి వెళుతున్నారనే వార్తలొస్తున్న సంగతి విదితమే.

04/03/2016 - 11:22

భద్రాచలం, ఏప్రిల్ 2: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు కెసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై చేస్తున్న చిల్లర రాజకీయాలను మానుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు.

04/02/2016 - 13:59

హైదరాబాద్:సికింద్రాబాద్‌నుండి కర్నూలు బయలుదేరిన పెళ్లిబృందానికి పెనుముప్పు తప్పింది. వీరంతా ఓ ప్రైవేటు ఏసీ బస్సులో కర్నూలు వెళుతూండగా నగరంలోని సీతాఫల్‌మండి వద్దకు చేరుకోగానే ఇంజన్‌లో మంటలు రేగాయి. అయితే వెంటనే బస్సులోనివారంతా బయటపడటంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక దళం తక్షణం చేరుకుని మంటలను అదుపుచేశాయి.

04/02/2016 - 05:00

హైదరాబాద్, ఏప్రిల్ 1: నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంపూర్ణమైన అవగాహనతోపాటు గొప్ప విజన్ ఉందని ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ప్రశంసించారు. శాసనసభలో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అభినందిస్తూ నాదెండ్ల శుక్రవారం లేఖ రాశారు.

04/02/2016 - 04:58

నల్లగొండ, వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, ఏప్రిల్ 1: ప్రచండ భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. ఎండల తీవ్రతకు జనం ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో శుక్రవారం వడదెబ్బకు అస్వస్థతకు గురై ఐదుగురు మరణించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నందిపాడుకు చెందిన సింగిశెట్టి నాగేశ్వరరావు (60) అనే దర్జీ వడదెబ్బకు గురై గురువారం రాత్రి మరణించాడు.

04/02/2016 - 04:56

హైదరాబాద్, ఏప్రిల్ 1: సెంట్రల్ వర్శిటీ పరిశోధన విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వైస్‌చాన్సలర్ పి అప్పారావును బదిలీ చేసేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి వి హనుమంతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విసి అప్పారావు మళ్లీ విసిగా బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు.

04/02/2016 - 04:54

హైదరాబాద్, ఏప్రిల్ 1: హైదరాబాద్ ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో రాష్ట్రప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కమాండ్ కంట్రోల్ పోలీస్ సెంటర్- ట్విన్ టవర్స్ నిర్మాణంపై హైకోర్టు స్టే ఇచ్చింది. కాగా సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై వెంటనే ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అపీల్ చేసింది.

Pages