S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/23/2016 - 05:27

హైదరాబాద్:మిషన్ భగీరథ కాంట్రాక్టుల్లో తమకు అనుమానాలు ఉన్నాయని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శాసన సభలో మంగళవారం పద్దులపై జరిగిన చర్చల్లో మిషన్ భగీరథ కాంట్రాక్టులపై మంత్రి కె తారక రామారావు, చింతల రామచంద్రారెడ్డిల మధ్య వాగ్వివాదం జరిగింది.

03/23/2016 - 05:26

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాలను హైదరాబాద్‌తో సిసిటివిల ద్వారా అనుసంధానం చేయనున్నట్లు హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వి శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, హైదరాబాద్‌లో సిసిటివి వ్యవస్ధ ప్రాజెక్టు వ్యయం రూ. 657కోట్లు, కమాండ్ కంట్రోలు కేంద్రం ప్రాజెక్టు వ్యయం రూ.302 కోట్లని చెప్పారు.

03/23/2016 - 05:25

హైదరాబాద్:ఢల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ మంగళవారం నగరానికి రానున్న సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవచ్చని భావిస్తున్న పోలీసులు, ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

03/23/2016 - 04:52

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మరోమారు రణరంగంగా మారింది. జనవరి 17న పిహెచ్‌డి విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యతో చెలరేగిన వివాదం సద్దుమణుగుతున్న సమయంలో తిరిగి విసిగా బాధ్యతలు స్వీకరించేందుకు ప్రొఫెసర్ అప్పారావు రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

03/22/2016 - 17:58

హైదరాబాద్: వైస్ చాన్సలర్ అప్పారావును విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మంగళవారం సాయంత్రం విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. వీసీ కార్యాలయాన్ని ముట్టడించి వారు నినాదాలు చేశారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు.

03/22/2016 - 17:57

హైదరాబాద్: ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో కాంగ్రెస్ నేతలు, కాంట్రాక్టర్లు వేల కోట్ల రూపాయలను దోచుకుతిన్నారని మంత్రి హరీష్‌రావు చెబుతున్నా, మళ్లీ అదే కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పజెబుతారని టి.అసెంబ్లీలో టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల మేలుకే పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు.

03/22/2016 - 16:46

హైదరాబాద్: విద్యార్థులు విధ్వంసాలకు దిగుతూ దౌర్జన్యం చేయడం వల్ల వర్సిటీకే చెడ్డపేరు వస్తుందని హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావు అన్నారు. మంగళవారం వర్సీటీలోని తన చాంబర్‌లో కొందరు విద్యార్థులు విధ్వంసం సృష్టించడంపై ఆయన స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను తీర్చేందుకు తాను ఎపుడూ సిద్ధమేనన్నారు.

03/22/2016 - 16:45

హైదరాబాద్: ఎపి సిఎం చంద్రబాబును టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మంగళవారం కలిశారు. నాగార్జునసాగర్ జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన సిఎంకు విజ్ఞప్తి చేశారని, దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిసింది.

03/22/2016 - 16:45

హైదరాబాద్: ప్రతిపక్ష సభ్యురాలు చేసిన వ్యాఖ్యపై మనస్తాపం చెంది తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేనివాళ్లు సభను నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ వ్యాఖ్యానించడంతో డిప్యూటీ స్పీకర్ కలత చెందారు. అరుణ వ్యాఖ్యలపై అధికార తెరాస సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపుగందరగోళం నెలకొంది.

03/22/2016 - 13:12

హైదరాబాద్: ఇకపై ఏ స్థాయిలోనూ ప్రత్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ మంగళవారం ఇక్కడ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా స్థానిక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు దక్కేలా తాము పోరాటం చేస్తామన్నారు. ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఇతర వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.

Pages