S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/12/2016 - 07:03

హైదరాబాద్, ఏప్రిల్ 11: గణేశ్ పండుగ సందర్భంగా మండపాల్లో ఏర్పాటు చేసే విగ్రహాల ఎత్తు 20 అడుగులకు మించకుండా చూడాలని హైకోర్టు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి సలహా ఇచ్చింది. నగరానికి చెందిన వేణుమాధవ్ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్సవ సమితికి ఈ సూచన చేసింది.

04/12/2016 - 07:02

హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ మెడికల్ కాలేజీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లీజు ఒప్పందాన్ని పునరుద్ధరించే అధికారం ఉంటుందా అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది.

04/12/2016 - 06:57

మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 11: నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో సరదాగా ఈతకు వెళ్లిన ఐదుగురిలో ఇద్దరు యువకులు సోమవారం మధ్యాహ్నం గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం షాబునగర్ వాడకు చెందిన స్నేహితులు ఐదుగురు ఎండి.అజహరుద్దీన్, ఎండి.జానిమియా, ఎండి.ఇస్మాయిల్, ఎండి. రియాజ్, ఎండి.లతీఫ్ ఈత కొడదామన్న సరదా తో సాగర్ ఎడమ కాల్వ వజీరాబాద్ మేజర్ తూ ము వద్ద ఈత కొడుతున్నారు.

04/12/2016 - 06:56

హైదరాబాద్, ఏప్రిల్ 11: మహిళల విద్య కోసం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) చైర్మన్ ఘంటా చక్రపాణి కొనియాడారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న మహిళలంతా ఆయన చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మహిళలకు విద్యావకాశాల కోసం పూలే ఆనాడు పోరాడ్డం వల్లనే ఈనాడు ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో స్ధిరపడ్డారని తెలిపారు.

04/12/2016 - 06:53

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్ష స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ ఖయ్యూం ఖాన్ సూచించారు. సోమవారం నగరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీ ఆధ్వర్యంలో ఉచిత కోచిం గ్, స్డటీ మెటీరియల్‌ను ఆయన ఆవిష్కరించారు.

04/12/2016 - 06:53

వరంగల్, ఏప్రిల్ 11: కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లో వచ్చే విద్యాసంవత్సరం 2016-17లో పిజి కోర్సులలో ప్రవేశాలకు పిజి ఎంట్రెన్స్ నోటిఫికేషన్ పిజిసెట్ 2016 విడుదలైనట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ వెంకయ్య, డాక్టర్ లక్ష్మణ్‌నాయక్‌లు తెలిపారు. ఈ ఏడాదిఅడ్మిషన్ల ప్రక్రియలో ఆన్‌లైన్ విధా నం మొదటిసారిగా ప్రవేశపెట్టా రు.

04/12/2016 - 06:52

హైదరాబాద్, ఏప్రిల్ 11: అధికారంలోకి రాగానే బిసి సబ్-ప్లాన్‌ను అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సోమవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూలే చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు.

04/12/2016 - 06:52

హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు. సోమవారం జూబ్లీహిల్స్ వద్ద తనిఖీలు నిర్వహించి నిబంధనలను పాటించని పలు వాహనాలను గుర్తించారు. సినీ నటుడు తారకరత్న కారు అద్దాలకు నల్లటి ఫిల్మ్‌లు ఉండటంతో దానిని పట్టుకుని 700 రూపాయల జరిమానా విధించారు.

04/12/2016 - 06:51

గంగాధర, ఏప్రిల్ 11: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంటిలో దోపిడీ దొంగలు చొరబడి వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే బొడిగె శోభ గంగాధర చౌరస్తాలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

04/12/2016 - 06:50

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణలో కరవు విలయతాండవం చేస్తోందని రాష్ట్ర బిజెపి నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షునిగా నియమితులైన డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్.

Pages