S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/27/2016 - 07:05

ఖమ్మం, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీని బుధవారం ఖమ్మంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరానికి సమీపంలోని చెరుకూరి తోట వద్ద 4వేల మందితో ప్రతినిధుల సభను నిర్వహించేందుకు గానూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు మంగళవారం సాయంత్రానికే ఖమ్మం చేరుకున్నారు. వారందరికి ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

04/27/2016 - 07:04

వరంగల్, ఏప్రిల్ 26: పంచలోహ విగ్రహాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

04/27/2016 - 07:02

ఆదిలాబాద్, ఏప్రిల్ 26: ప్రధానమంత్రి ఆదర్శ సంసద్ యోజన పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు గిరిజన గూడేలను దత్తత తీసుకున్నా ఆ గ్రామాల్లో అభివృద్ది ఛాయలు అంతంత మాత్రంగానే దర్శనమిస్తున్నాయి. రెండేళ్ల కిందటే దత్తత గ్రామాల అభివృద్ధి కోసం తూర్పు, పశ్చిమ పార్లమెంట్ సభ్యులు కంకణం కట్టుకోగా తమ కష్టాలు తీరినట్లేనని మురిసిపోయిన గిరిజనులు ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

04/27/2016 - 06:31

హైదరాబాద్, ఏప్రిల్ 26: పోలీసులతో కాలేజీల తనిఖీలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలు మరోమారు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ పరిధిలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు మంగళవారం నాడు కొత్తపేటలోని జగజ్జీవన్‌రామ్ హాలులో సమావేశమై పోలీసులను క్యాంపస్‌లలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని నిర్ణయించినట్టు యాజమాన్యాల జాక్ కన్వీనర్ ఇ రమణారెడ్డి తెలిపారు.

04/27/2016 - 06:29

హైదరాబాద్, ఏప్రిల్ 26: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిస్తుందని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం మార్కెటింగ్ శాఖలో వివిధ గ్రేడ్ల కింద సిబ్బంది సుమారు 76 మంది పదోన్నతులు పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

04/27/2016 - 06:29

హైదరాబాద్, ఏప్రిల్ 26: ‘వినాశకాలే విపరీత బుద్ధి..’ అని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావునుద్దేశించి విమర్శించారు. అది తనకైనా, ఎవరికైనా వర్తిస్తుందని ఆయన అన్నారు. మంగళవారం పార్టీ నాయకుడు, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పట్ల తన బాధను వ్యక్తం చేశారు.

04/27/2016 - 06:22

హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణలో విద్యుత్ చార్జీల వడ్డన తప్పనిసరిగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ అసెంబ్లీ ఉప ఎన్నిక అనంతరం చార్జీల వడ్డన వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

04/27/2016 - 04:39

హైదరాబాద్, ఏప్రిల్ 26: పాలేరు ఉప ఎన్నికలో విజయం సాధించి ఖమ్మం జిల్లాలో పార్టీ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న అధికార తెరాసకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పాలేరు ఉప ఎన్నికల్లో జిల్లాకు చెందిన కీలక అధికార్లు అధికార తెరాసకు అనుకూలంగా పనిచేసే ప్రమాదం ఉందంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ తక్షణం స్పందించింది.

04/27/2016 - 04:34

ఖమ్మం/ హైదరాబాద్, ఏప్రిల్ 26: ఏళ్ల తరబడి వామపక్షాలకు పెట్టని కోటగావున్న ఖమ్మం ఖిల్లాను గులాబిమయం చేయాలన్న సంకల్పంతో తెరాస వ్యూహాత్మక ప్లీనరీ నిర్వహించబోతోంది. ప్రభుత్వ పనితీరు సమీక్ష, పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ విస్తరణలాంటివి పైకి కనిపించే లక్ష్యాలే అయినా, ఖిల్లాపై పూర్తి పట్టు సాధించేలా పార్టీని విస్తరించాలన్నదే తెరాస అంతర్గత వ్యూహం.

04/27/2016 - 04:29

హైదరాబాద్, ఏప్రిల్ 26: నామినేటెడ్ పదవుల నియామకానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకరరావును అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించారు. కేబినెట్ ర్యాంకు కలిగిన పదవిలో ప్రభాకర్‌రావు ఏడాదిపాటు ఉంటారు. ప్రభాకరరావు ఈనెల 29న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించారు.

Pages