S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/10/2016 - 11:27

హైదరాబాద్: జిహెచ్‌ఎంసిలో ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌కు చెందిన నగరంలోని ఆరు ఇళ్లపై మంగళవారం ఉదయం ఎసిబి అధికారులు సోదాలు చేశారు. కోట్ల రూపాయల్లో ఇతనికి స్థిరాస్తులున్నట్లు, బ్యాంకు అకౌట్లలో భారీగా బాలెన్స్, లాకర్లలో నగదు ఉన్నట్లు గుర్తించారు.

05/10/2016 - 05:12

హైదరాబాద్, మే 9: ఒకటి కాదు, రెండు కాదు కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వివరాణాత్మక నివేదికలు అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి)కి చేరడం లేదు. పిఎసి చైర్‌పర్సన్‌గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జె.గీతారెడ్డి సోమవారం విస్తుపోయారు. అయితే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆమెకు హామీ ఇచ్చారు.

05/10/2016 - 05:07

హైదరాబాద్, మే 9: ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద ఎంపికైన 11 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 6,700 కోట్ల రూపాయల సహాయం చేయాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ప్రధానమంత్రి సించాయి యోజన పథకం అమలుపై బుధవారం ఢిల్లీలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిధుల విడుదల గురించి కేంద్రాన్ని కోరనున్నారు.

05/10/2016 - 05:05

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇవ్వాల్సిన విత్తనాల సబ్సిడీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని మండల కేంద్రాల్లో విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

05/10/2016 - 05:02

హైదరాబాద్, మే 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డితో పాటు నూతన రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు.

05/10/2016 - 05:00

హైదరాబాద్, మే 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన కమాండ్, కంట్రోల్ సెంటర్ జంట టవర్ల నిర్మాణంపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ మీర్ అఫ్సర్ అలీ, మరో 16 మంది దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

05/10/2016 - 04:59

హైదరాబాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసి) చైర్మన్ సోమారపు సత్యనారాయణకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా ఉండే మూడేళ్ల పాటు ఆయనకు కేబినెట్ హోదా కొనసాగుతుందని ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది.

05/10/2016 - 04:57

హైదరాబాద్, మే 9: తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అంధులైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇది దేశానికే ఆదర్శంగా ఉంటుందని హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్-జనరల్ వినోద్ కుమార్ అగ్రవాల్ పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు.

05/10/2016 - 04:56

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో సోమవారం ఏకకాలంలో అధికారుల బృందాలు తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించాయి. కాలేజీల్లో నిర్వహించే రికార్డులు అన్నింటినీ ఆయా కాలేజీలు సమర్పించిన సెల్ఫ్ అప్రైజల్ (స్వీయ నివేదికలు)తో సరిపోల్చి చూశాయి.

05/10/2016 - 02:21

ఖమ్మం, మే 9: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ సమయం సమీపిస్తున్నకొద్దీ మాటలకు పదునుపెడుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్, వామపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే తామని, రెండేళ్లలో చేసింది శూన్యమంటూ టిఆర్‌ఎస్ నేతల వైఖరిపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.

Pages