S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/13/2016 - 04:41

న్యూఢిల్లీ, మే 12: ఆదిలాబాద్ జిల్లా మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కేంద్రన్ని తెలంగాణ మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, జోగు రామన్న విజ్ఞప్తి చేశారు.

05/13/2016 - 04:33

హైదరాబాద్, మే 12: తెలంగాణ ప్రయోజనాలకు సమాధి కట్టాలనుకుంటున్న కాంగ్రెస్, టిడిపి, కమ్యూనిస్టుల పార్టీలకు పాలేరు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కె తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకోవడానికి పాలేరు ఉప ఎన్నికలను వేదికగా చేసుకోవాలని మంత్రి సూచించారు. పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి మంత్రి బహిరంగ లేఖ విడుదల చేశారు.

05/13/2016 - 04:24

స్టేషన్ ఘన్‌పూర్, మే 12: రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే సహాయక చర్యలు తీసుకోవాల్సిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కనే ఓ రైతుకు చెందిన ఎండిపోయిన వరిపంటను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు అనేకమన్నారు.

05/13/2016 - 04:19

హైదరాబాద్, మే 12: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.వివేకానంద కుటుంబీకులకు చెందిన వాణిజ్య భవనాన్ని కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు వేసవి బెంచ్ తిరస్కరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన భవన కూల్చివేత ఉత్తర్వులను నిలిపి వేస్తూ స్టే మంజూరు చేయాలని ఎమ్మెల్యే కుటుంబీకులు, ఆ భవనంలో ఉన్న నారాయణ కళాశాల దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది.

05/13/2016 - 04:17

హైదరాబాద్, మే 12: ఆదిలాబాద్ జిల్లాలో బిజెపికి జవసత్వాలు తెచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం నాడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లా నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

05/12/2016 - 17:29

హైదరాబాద్: నకిలీ సర్ట్ఫికెట్లను విక్రయిస్తూ యువతను వంచిస్తున్న ఓ ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లో గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వివిధ వర్సిటీలకు చెందిన 136 డిగ్రీ సర్ట్ఫికెట్లు, రబ్బరు స్టాంపులు, కంప్యూటర్లను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

05/12/2016 - 17:28

నల్గొండ: దేవరకొండ మండలం పెండ్లిపాకలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తెగి ఓ గుడిసెపై పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.

05/12/2016 - 12:04

ఖమ్మం: పాలేరు ఉపఎన్నికను సాకుగా చూపించి తెరాస మంత్రులు, నాయకులు కోట్లాది రూపాయల మేరకు వసూళ్లు చేస్తున్నట్లు టి.టిడిపి నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల నుంచి కోట్లలో డబ్బు వసూలు చేస్తున్న తెరాస నాయకులను ప్రజలే నిలదీయాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లకు ఇరిగేషన్ ప్రాజెక్టులను అప్పగించి ముడుపులు దండుకుంటున్నారని ఆరోపించారు.

05/12/2016 - 12:03

హైదరాబాద్: రోడ్డుపై లారీని నిలిపి బైక్‌పై వెళుతున్న వ్యక్తిని చిరునామా అడుగుతుండగా వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. నిలిపి ఉంచిన లారీలో ముగ్గురు, బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పయారు. లారీలో మరణించన వారు అనంతపురం జిల్లాకు చెందినవారని, బైక్‌పై వచ్చిన వ్యక్తి పాతబస్తీకి చెందినవాడని పోలీసులు గుర్తించారు.

05/12/2016 - 12:02

మెదక్: చికిత్స పొందుతున్న గర్భిణి ఆకస్మికంగా మరణించడంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగిన ఘటన గురువారం సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. గర్భిణి మృతికి కారకులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు ఘర్షణకు దిగడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Pages