S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/31/2016 - 11:36

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్లు వేసే ముందు టిడిపి అభ్యర్థులు సుజనా చౌదరి, టిజి వెంకటేష్ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని దివంగత నేతకు నివాళులర్పించారు. అంతకుముందు పార్టీ ఆఫీసులో వారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. టిడిపి యువనేత నారా లోకేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

05/31/2016 - 07:37

హైదరాబాద్, మే 30: మిషన్ కాకతీయ పథకం కోసం నాబార్డ్ 800 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ ఏడాది 1800 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వం కోరగా, 800 కోట్ల రూపాయలు సమకూర్చేందుకు నాబార్డ్ అంగీకరించినట్టు చెప్పారు. నీటిపారుదల శాఖకు చెందిన వివిధ అంశాలపై హరీశ్‌రావు సోమవారం సచివాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం అయ్యారు.

05/31/2016 - 07:36

హైదరాబాద్, మే 30: వేగంగా ప్రాజెక్టులు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, భూ సేకరణ ప్రధాన సమస్యగా మారింది. కోటి ఎకరాలకు సాగునీటిని అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25వేల ఎకరాల భూమిని సేకరించాలి. అయితే పలు గ్రామాల్లో భూ సేకరణ వివాదాస్పదం అవుతోంది.

05/31/2016 - 07:29

తొగుట, మే 30: మెదక్ జిల్లా తొగుట మండలంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వానికి భూములు అప్పగించేందుకు కొందరు వ్యక్తులు కారకులని భావించిన జనం ఆగ్రహంతో నలుగురి ఇళ్లపై సోమవారం దాడి చేశారు. అంతేకాకుండా ఆ వ్యక్తులను సంబంధించిన కారు, బైక్ ధ్వంసంను ధ్వంసం చేశారు. ఇళ్లల్లోని సామాగ్రి చిందరవందర చేశారు.

05/31/2016 - 07:27

సంగారెడ్డి, మే 30: సాగు నీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం, ఉపాధి కోసం పరిశ్రమ కల్పనకు ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ కార్యక్రమాలు రసభసగా మారుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో యుద్ధ వాతావరణం నెలకొంటోంది. కలిసిమెలిసి జీవించిన ప్రజాప్రతినిధులు, ప్రజల మధ్య వైరుధ్యం తారాస్థాయికి చేరుకుంటుంది.

05/31/2016 - 07:26

కరీంనగర్, మే 30: పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి యేటా నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్ర మంగళవారం జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో పెద్దఎత్తున నిర్వహించేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దేశం, ధర్మం, సమాజం పట్ల అవగాహన కల్పించడంతోపాటు హిందు సమాజాన్ని జాగృతం చేసేందుకు చేపడుతున్న ఈ యాత్రకు హిందువులు దండులా కదిలేందుకు సిద్ధమవుతున్నారు.

05/31/2016 - 07:21

ఖమ్మం, మే 30: ఆంజనేయ స్వామి విగ్రహం కన్నీరొలికిన సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలోని బ్రాహ్మణపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బ్రాహ్మణపల్లిలో మూడేళ్ళ క్రితం ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారు. ఈ క్రమంలో ఆలయ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని ఆలయ పూజారి సతీష్‌శర్మ ఆలయ పాలకమండలిలో ఒక సభ్యుడితో చర్చించారు.

05/31/2016 - 07:05

మహబూబ్‌నగర్, మే 30: మానస సరోవర్ యాత్రకు వెళ్లి వాతావరణం అనుకూలించకపోవడంతో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. సోమవారం ఐదు హెలికాప్టర్లను నేపాల్ టూరిజం వారు సమకూర్చడంతో నేపాల్ ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టినట్లు సమాచారం.

05/31/2016 - 07:04

హైదరాబాద్, మే 30: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం పర్యటించి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ తెలంగాణ శాఖ నాయకులు దూకుడు పెంచారు. వచ్చే మూడేళ్ళలో తెలంగాణ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడి పని చేయాలని, బిజెపి అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదంటూ అమిత్ షా చేసిన ప్రసంగంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

05/31/2016 - 05:42

‘రాష్ట్రం ఏర్పడగానే అదీ ఇదీ అంటూ గాబరాపడి ఆగమాగమయ్యే ప్రభుత్వం కాదు మాది. ఉమ్మడిలో తెలంగాణకు ఎక్కడ అన్యాయం
జరిగింది, దాన్ని ఎలా
పూడ్చుకోవాలో లోతుగా అధ్యయనం చేస్తాం. మూలాలను తెలుసుకుని
క్షేత్రస్థాయి నుంచి చేపట్టాల్సిన
చర్యలతో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలు పకడ్భందీగా రూపొందించిన తరువాతే ముందుకు సాగుతాం’

Pages